సాక్షి ప్రతినిధి, నెల్లూరు : రాష్ట్ర విభజనలో సమన్యాయం డిమాండ్ చేస్తూ చంచలగూడ జైలులో మూడో రోజు ఆమరణ దీక్షలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడిక్డి జిల్లాలో సంఘీభావం వెల్లువెత్తుతోంది. ఆ పార్టీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. తాము మీ వెంటే అంటూ సంఘీభావ దీక్షలు చేపడుతున్నారు. జిల్లాలో దీక్షా శిబిరాలను ఆ పార్టీ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు డీసీ గోవిందరెడ్డి మంగళవారం సందర్శించారు. దీక్షలో ఉన్న నాయకులను పరామర్శించారు.
అలాగే జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేపట్టిన ఆం దోళన కార్యక్రమాల్లోనూ గోవిందరెడ్డి పాల్గొన్నారు. గూడూరు సమీపంలోని పోటుపాళెం క్రాస్ వద్ద నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చెంతాటి బాలచెన్నయ్య చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షా శిబిరాన్ని గోవిందరెడ్డి, జిల్లా పార్టీ కన్వీనర్ మేరిగ మురళి సందర్శించారు. ఇంకా పలువురు పార్టీ జిల్లా నాయకులు దీక్షా శిబిరాన్ని సందర్శించి బాలచెన్నయ్యకు మద్దతు ప్రకటించారు. బుజబుజ నెల్లూరు వద్ద జాతీయ రహదారిపై వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరిశీలకులు గోవిందరెడ్డి, జిల్లా కన్వీనర్ మే రిగ మురళీధర్, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పోలుబోయిన అనిల్‌కుమార్ హాజరయ్యారు.
గూడూరులో పాతబస్టాండ్ సమీపంలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పాశం సునీల్‌కుమార్ విద్యార్థులతో కలసి రెండో రోజు రిలేదీక్షలు నిర్వహించారు. ఆస్పత్రి రోడ్డులో పాతమోతిమహల్ కూడలి వద్ద బత్తిని విజయ్‌కుమార్ కూడా రెండో రోజు రిలేదీక్ష నిర్వహించారు. చిల్లకూరు మండలంలో వైఎస్సార్‌సీపీ పార్టీ శ్రేణు లు జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ అబ్జర్వర్ గోవిందరెడ్డి, పా ర్టీ జిల్లా అధ్యక్షులు మేరిగ మురళి, తదితరులు పాల్గొన్నారు. జిల్లా స్టీరిగ్ కమిటీ సభ్యుడు నేదురుమల్లి పద్మనాభరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు వాకాడులో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు.
మర్రిపాడు మండలం తెగళ్లపాడు ఎస్సీ కాలనీ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాసులు, కొండారెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. మనుబోలు జాతీయ రహదారిపై భారీ ప్రదర్శన, రాస్తారోకో జరిపారు. వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త దబ్బల రాజారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రిలే నిరాహారదీక్ష మూడోరోజుకు చేరింది. మూడోరోజు పట్టణంలోని యువకులు ముందుకొచ్చి జగనన్న దీక్షకు మద్దతుగా దీక్షలో కూర్చున్నారు. దొరవారిసత్రంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రిలే నిరాహారదీక్ష నాలుగోరోజుకు చేరుకుంది. కావలిలో గాంధీబొమ్మ సెంటర్లో వైఎస్సార్‌సీపీ నేతలు రిలేనిరాహార దీక్షలను చేపట్టారు.
వైఎస్సార్‌సీపీ కావలి రూరల్ మండల కన్వీనర్ చింతం బాబుల్‌రెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పాలడుగు వెంకట్రావు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు జరుగుమల్లి రామారావు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలోని సీతారాంపురం మండల కేంద్రంలో స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు రిలే దీక్షలు చేపట్టారు. జలదంకి పంచాయతీ బస్టాండ్ ఆవరణలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ పాలవల్లి మాలకొండారెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రారంభమయ్యా యి. సైదాపురంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిరాహార దీక్షచేపట్టారు. రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు.
జగన్ దీక్షకు వెల్లువెత్తిన మద్దతు
Published Wed, Aug 28 2013 4:33 AM | Last Updated on Fri, May 25 2018 9:10 PM
Advertisement
Advertisement