chachalguda jail
-
లోటస్‌పాండ్‌లో జగన్
చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయిన వైఎస్ జగన్ మంగళవారం రాత్రి 9.15 గంటల ప్రాంతంలో లోటస్‌పాండ్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులు హారతిచ్చి ఆయనకు స్వాగతం పలికారు. జననేతకు అభిమానులు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు అడుగడుగునా నీరాజనాలు పట్టారు. -
ఉస్మానియా ఆస్పత్రికి జగన్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డిని చంచల్‌గూడ జైలు నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తరలించే సందర్భంలో జైలు నుంచి ఆస్పత్రి వరకు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులను సైతం పోలీసులు నెట్టేశారు. -
`హెల్త్ బులెటిన్ గోప్యంగా ఉంచటం మానవ హక్కుల ఉల్లంఘనే`
హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో ఇరుప్రాంతాలకు సమన్యాయం చేయాలని, అలా చేయలేకపోతే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలన్న డిమాండ్‌తో చంచల్‌గూడ జైలులో ఐదు రోజులుగా ఆమరణదీక్ష చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆరోగ్యంపై నిన్న సాయంత్రం నుంచి జైలు అధికారులు అధికారకంగా హెల్త్ బులెటన్ విడుదల చేయకపోవడంపై అనుమానులు తలెత్తున్నాయి. దీంతో జగన్ అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం జగన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందనే జైలు అధికారులు చెబుతున్నా, వారు చేసే హడావుడి చూస్తే మాత్రం ఆయన పరిస్థితి బాగాలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జైల్లో నిరవధిక దీక్ష చేపట్టిన వైఎస్ జగన్ ఆరోగ్యంపై సమాచారం అందిచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, గోప్యంగా ఉంచడం రాజ్యంగ ఉల్లంఘనేనని అంటూ వైఎస్ఆర్ సీపీ లీగల్ సెల్ కో ఆర్డినేటర్ నాగేశ్వరరావు విమర్శించారు. అంతేకాకుండా వైఎస్ జగన్ వ్యక్తిగత హక్కులను జైలు అధికారులు నిర్వీర్యంచేశారంటూ ఆయన ఆరోపించారు. జగన్ దీక్షపై కోర్టుకు నివేదించడం కూడా మానవ హక్కుల ఉల్లంఘనేనని తెలిపారు. దీక్ష సమయంలో జగన్ ఎవ్వర్నీ కలవకపోయినా ములాఖత్‌లు రద్దుచేశామంటూ ప్రచారం చేశారని అన్నారు. అసలు ములాఖత్‌లు రద్దుచేశామంటూ ప్రచారంచేయడం కూడా హక్కుల ఉల్లంఘనేనని నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఏ క్షణంలోనైనా వైఎస్ జగన్ ను ఉస్మానియా ఆస్పత్రికి తీసుకవెళ్లవచ్చుననే సమాచారంతో ముందుస్తు జాగ్రత్త చర్యగా ఉస్మానియా పరిసరాల్లో అణువుణునా తనిఖీలు చేపట్టారు. ఇప్పటికే చంచల్ గూడ జైలు వద్ద బారీ కేడ్లను ఏర్పాటుచేశారు. -
వంద గంటలు దాటిన వైఎస్ జగన్ దీక్ష
-
జగన్ ఆరోగ్యంపై గోప్యత, ఐదోరోజు దీక్ష
హైదరాబాద్ : వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నేటికి అయిదో రోజుకు చేరింది. ఒకవైపు దీక్షకు రాష్ట్రవ్యాప్తంగా నానాటికీ మద్దతు వెల్లువెత్తుతుంటే... మరోవైపు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రజల్లో, అభిమానుల్లో, పార్టీ కార్యకర్తల్లోనూ ఆందోళనలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. పైగా ఈ విషయంలో జైలు అధికారుల వ్యవహార శైలి కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. జగన్ ఆరోగ్యానికి సంబందించి వివరాలు నిన్న సాయత్రం హెల్త్ బులెటిన్‌లో జైలు అధికారులు అందించారు. ఆరోగ్య పరిస్ధితి నిలకడగానే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. కానీ నాలుగు రోజులుగా ఆహారం తీసుకోవపోవడంతో కొంచెం నిరసించిపోయినట్టు సమాచారం. జగన్‌కు అన్ని పరీక్షలూ జరిపించామని, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఒకసారి, నీరసంగా ఉన్నారని మరోసారి... ఇలా జైలు అధికారులు రకరకాలుగా చెబుతున్న వైనం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. పైగా ఆయనకు జరిపిన పరీక్షల వివరాలను కూడా వెల్లడించకపోవడం, వారి వివరాలు రావాల్సి ఉందని, అప్పుడే ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి సమాచారం ఇవ్వగలమని చెబుతుండటం ఆందోళనను మరింతగా పెంచుతోంది. మరోవైపు జగన్ దీక్ష నేపథ్యంలో చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌ను, ఐజీని తాత్కాలిక డీజీ సాంబశివరావు నిన్న తన నివాసానికి పిలిపించుకున్నారు. పరిస్థితులను సమీక్షించడంతో పాటు దీక్ష, దాని పరిణామాలపై చాలాసేపు చర్చించారని తెలుస్తోంది. జైలు ఆసుపత్రిలో ఒక స్థాయి వరకే వైద్యం సాధ్యమన్న అంశం కూడా చర్చకు వచ్చిందని చెబుతున్నారు. దాంతో దీక్షను భగ్నం చేసే దిశగా పథక రచన జరుగుతోందన్న అనుమానాలు మరింతగా పెరుగుతున్నాయి. -
ఐదో రోజుకు జగన్ దీక్ష
-
ఐదో రోజుకు జగన్ దీక్ష: ఆరోగ్య పరిస్థితిపై అధికారుల గోప్యత
జగన్ ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన అనుమానాలకు తావిస్తున్న అధికారుల తీరు ఆరోగ్య వివరాలను గోప్యంగా ఉంచుతున్న వైనం నిలకడగా ఉందని, నీరసంగా ఉన్నారని భిన్న ప్రకటనలు.. వైద్య పరీక్షల ఫలితాలే వెల్లడించని తీరు ఆస్పత్రికి తరలిస్తే భావోద్వేగాలు పెల్లుబుకుతాయేమో.. తాత్కాలిక డీజీతో సమీక్షలో పోలీసు ఉన్నతాధికారులు దాంతో బలపడుతున్న ‘దీక్ష భగ్నం’ అనుమానాలు తీవ్రంగా ఆందోళన చెందుతున్న ప్రజలు, అభిమానులు సాక్షి, హైదరాబాద్: అడ్డగోలు విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చంచల్‌గూడ జైల్లో చేపట్టిన నిరాహార దీక్ష గురువారంతో ఐదో రోజుకు ప్రవేశించింది. ఒకవైపు దీక్షకు రాష్ట్రవ్యాప్తంగా నానాటికీ మద్దతు వెల్లువెత్తుతుంటే... మరోవైపు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రజల్లోనూ, అభిమానుల్లోనూ, పార్టీ కార్యకర్తల్లోనూ ఆందోళనలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. పైగా ఈ విషయంలో జైలు అధికారుల వ్యవహార శైలి కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. జగన్‌కు అన్ని పరీక్షలూ జరిపించామని, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఒకసారి, నీరసంగా ఉన్నారని మరోసారి... ఇలా రకరకాలుగా చెబుతున్న వైనం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. పైగా జగన్‌కు జరిపిన పరీక్షల వివరాలను కూడా వెల్లడించకపోవడం, వారి వివరాలు రావాల్సి ఉందని, అప్పుడే ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి సమాచారం ఇవ్వగలమని చెబుతుండటం ఆందోళనను మరింతగా పెంచుతోంది. ఈ నేపథ్యంలో జైలు వద్ద కూడా బుధవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ అభిమాన నేత దీక్షకు మద్దతు తెలిపేందుకు పలు ప్రాంతాల నుంచివెల్లువెత్తిన నేతలు, అభిమానులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జైలు బయట నాలుగు రోజులుగా జరుగుతున్న ప్రదర్శనలు బుధవారం మరింతగా పెరిగాయి. అయితే వారినెవరినీ కనీసం జైలు పరిసరాల సమీపానికి కూడా రానీయకుండా భారీ సంఖ్యలో నిర్బంధించి పోలీస్స్టేషన్లకు మరిన్ని ప్రశ్నలకు తావిస్తోంది. అంతేగాక బుధవారం జైలు పరిసర ప్రాంతాల్లో భద్రతను కనీవినీ ఎరగని రీతిలో పెంచేశారు. ఎటుచూసినా ఖాకీమయంగా మార్చేశారు! మొత్తంమీద జైలు అధికారులు ఏం చేస్తున్నారో, ఏం చేయాలని భావిస్తున్నారో తెలియడం లేదు. మరోవైపు జగన్ దీక్ష నేపథ్యంలో చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌ను, ఐజీని తాత్కాలిక డీజీ సాంబశివరావు బుధవారం తన నివాసానికి పిలిపించుకున్నారు. పరిస్థితులను సమీక్షించడంతో పాటు దీక్ష, దాని పరిణామాలపై చాలాసేపు చర్చించారని తెలుస్తోంది. జైలు ఆసుపత్రిలో ఒక స్థాయి వరకే వైద్యం సాధ్యమన్న అంశం కూడా చర్చకు వచ్చిందని చెబుతున్నారు. దాంతో దీక్షను భగ్నం చేసే దిశగా పథక రచన జరుగుతోందన్న అనుమానాలు మరింతగా పెరుగుతున్నాయి. అంతేగాక మున్ముందు పలు జిల్లాల నుంచి మద్దతుదారులు జగన్ దీక్షకు సంఘీభావంగా తరలి వచ్చేలా ఉన్నారని, అదే జరిగితే పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుందని నిఘా వర్గాలు ఇచ్చిన నివేదిక కూడా పోలీసు ఉన్నతాధికారుల మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ‘దీక్ష భగ్నం చేసినా, దాన్ని జగన్ తిరిగి కొనసాగిస్తే పరిస్థితేమిటి? అప్పుడు తలెత్తే వైద్యపరమైన ఇబ్బందులను ఎలా ఎదుర్కొనాలి?’ వంటి విషయాలపై వారు దృష్టి పెట్టారంటున్నారు. ‘‘అవసరమైతే ఉస్మానియా, గాంధీ వంటి ప్రభుత్వాసుపత్రులకు జగన్‌ను తరలించాల్సి రావచ్చు. కానీ జైలు వద్ద బందోబస్తే ఇంత కష్టంగా ఉంటే, ఇక జగన్ ఆసుపత్రికి వెళ్తే రాష్ట్రవ్యాప్తంగా భావోద్వేగాలు తీవ్రంగా ఉంటాయి’ అన్న ఆందోళన కూడా భేటీలో వ్యక్తమైందని తెలుస్తోంది. ఇవన్నీ జగన్ దీక్షను భగ్నం చేస్తారనేందుకు సంకేతాలేనంటున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం చంచల్‌గూడ జైలు వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నేతలపై పోలీసులు అమానషంగా విరుచుకుపడ్డారు. జైలు సమీపానికి కూడా రానీయకుండా ఎక్కడివారిని అక్కడే అడ్డుకుని నిర్బంధించారు! -
జగన్ దీక్షకు వెల్లువెత్తిన మద్దతు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : రాష్ట్ర విభజనలో సమన్యాయం డిమాండ్ చేస్తూ చంచలగూడ జైలులో మూడో రోజు ఆమరణ దీక్షలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడిక్డి జిల్లాలో సంఘీభావం వెల్లువెత్తుతోంది. ఆ పార్టీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. తాము మీ వెంటే అంటూ సంఘీభావ దీక్షలు చేపడుతున్నారు. జిల్లాలో దీక్షా శిబిరాలను ఆ పార్టీ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు డీసీ గోవిందరెడ్డి మంగళవారం సందర్శించారు. దీక్షలో ఉన్న నాయకులను పరామర్శించారు. అలాగే జగన్మోహన్రెడ్డికి మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేపట్టిన ఆం దోళన కార్యక్రమాల్లోనూ గోవిందరెడ్డి పాల్గొన్నారు. గూడూరు సమీపంలోని పోటుపాళెం క్రాస్ వద్ద నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చెంతాటి బాలచెన్నయ్య చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షా శిబిరాన్ని గోవిందరెడ్డి, జిల్లా పార్టీ కన్వీనర్ మేరిగ మురళి సందర్శించారు. ఇంకా పలువురు పార్టీ జిల్లా నాయకులు దీక్షా శిబిరాన్ని సందర్శించి బాలచెన్నయ్యకు మద్దతు ప్రకటించారు. బుజబుజ నెల్లూరు వద్ద జాతీయ రహదారిపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరిశీలకులు గోవిందరెడ్డి, జిల్లా కన్వీనర్ మే రిగ మురళీధర్, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పోలుబోయిన అనిల్‌కుమార్ హాజరయ్యారు. గూడూరులో పాతబస్టాండ్ సమీపంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పాశం సునీల్‌కుమార్ విద్యార్థులతో కలసి రెండో రోజు రిలేదీక్షలు నిర్వహించారు. ఆస్పత్రి రోడ్డులో పాతమోతిమహల్ కూడలి వద్ద బత్తిని విజయ్‌కుమార్ కూడా రెండో రోజు రిలేదీక్ష నిర్వహించారు. చిల్లకూరు మండలంలో వైఎస్సార్సీపీ పార్టీ శ్రేణు లు జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ అబ్జర్వర్ గోవిందరెడ్డి, పా ర్టీ జిల్లా అధ్యక్షులు మేరిగ మురళి, తదితరులు పాల్గొన్నారు. జిల్లా స్టీరిగ్ కమిటీ సభ్యుడు నేదురుమల్లి పద్మనాభరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు వాకాడులో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. మర్రిపాడు మండలం తెగళ్లపాడు ఎస్సీ కాలనీ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాసులు, కొండారెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. మనుబోలు జాతీయ రహదారిపై భారీ ప్రదర్శన, రాస్తారోకో జరిపారు. వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త దబ్బల రాజారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రిలే నిరాహారదీక్ష మూడోరోజుకు చేరింది. మూడోరోజు పట్టణంలోని యువకులు ముందుకొచ్చి జగనన్న దీక్షకు మద్దతుగా దీక్షలో కూర్చున్నారు. దొరవారిసత్రంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రిలే నిరాహారదీక్ష నాలుగోరోజుకు చేరుకుంది. కావలిలో గాంధీబొమ్మ సెంటర్లో వైఎస్సార్సీపీ నేతలు రిలేనిరాహార దీక్షలను చేపట్టారు. వైఎస్సార్సీపీ కావలి రూరల్ మండల కన్వీనర్ చింతం బాబుల్‌రెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పాలడుగు వెంకట్రావు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు జరుగుమల్లి రామారావు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలోని సీతారాంపురం మండల కేంద్రంలో స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు రిలే దీక్షలు చేపట్టారు. జలదంకి పంచాయతీ బస్టాండ్ ఆవరణలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ పాలవల్లి మాలకొండారెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రారంభమయ్యా యి. సైదాపురంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిరాహార దీక్షచేపట్టారు. రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు.