యూనివర్సిటీ క్యాంపస్, న్యూస్‌లైన్: తిరుమలలో పర్యావరణ కాలుష్యం ప్రమాదకర స్థాయిలో లేదని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ టీ.సుబ్బిరామిరెడ్డి అన్నారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సోమవారం తిరుపతిలోని పద్మావతి అతిథిగృహంలో సమీ క్ష సమావేశం నిర్వహించింది. తిరుమల తిరుపతిలో వాతావరణ కాలుష్యం, ని వారణ చర్యలు తదితర అంశాలపై చర్చించారు.
అనంతరం ఈ కమిటీ చైర్మన్ టీ. సుబ్బిరామిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. వాతావరణ కాలుష్యం 60 క్యూబిక్ మీటర్లకు చేరితే ప్రమాదమన్నారు. తిరుమలలో ఈ స్థాయి 40 క్యూబిక్ మీటర్లుగా ఉందన్నారు. తిరుమలలో అన్నదానానికి ఉపయోగించే కూరగాయలు, బియ్యం నిలువ ఉంచే పద్ధతులు భేషుగ్గా ఉన్నాయన్నారు. రోజుకు 50 వేల మందికి పైగా భక్తులు అన్నప్రసాదాలు స్వీకరిస్తున్నప్పటికీ, అరటి ఆకులను ఉపయోగించడం హర్షించదగ్గ అంశమన్నారు. తిరుమల ఫారెస్ట్‌లో 3 వేల హెక్టార్లు టీటీడీ పరిధి లో ఉందన్నారు.
ఇలాంటి పర్యావరణం ఎక్కడా లేదన్నారు. తిరుమలలో ప్రస్తుతం 115 పబ్లిక్ టాయ్‌లెట్లు ఉన్నాయని, వీటిని 200కు పెంచాల్సి ఉందన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో మరుగుదొడ్లకు ప్రతి యేటా మర మ్మతులు చేయాలన్నారు. పారిశుద్ధ్యం మెరుగుకు టీటీడీ చేపడుతున్న చర్యలు బాగున్నాయన్నారు. దీనిని మరింత మెరుగు పరచడానికి సిబ్బంది సంఖ్యను పెంచాల్సి ఉందన్నారు.
తిరుమలకు చేరే బస్సుల నుంచి వస్తున్న కాలుష్యం కూడా ప్రమాదకర స్థాయిలో లేదన్నారు. అయితే భవిష్యత్‌ను దృష్టి లో ఉంచుకుని వ్యక్తిగత వాహనాలను అనుమతించాలా? వద్దా? అన్న అం శాన్ని టీటీడీ పునఃసమీక్షించుకోవాలని కోరారు. తిరుమలకు యేడాదికి 5 లక్షల యూనిట్ల విద్యుత్ ఖర్చువుతుందన్నా రు. ప్రస్తుతం పవన విద్యుత్ ద్వారా 1.5 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసుకోబోతున్నామన్నారు. రాబోయే రోజుల్లో మరో 1.5 లక్షల యూనిట్లకు పెంచుకోవడానికి చర్యలు తీసుకోవాలని సూచిం చారు.
తిరుమలలో రోజుకు 40 టన్నుల చెత్త పోగవుతుందని, దీన్ని సమర్థవంతంగా తొలగిస్తున్నారన్నారు. అలానే ఎన్ ఏఆర్‌ఎల్(గాదంకి)లో చేపడుతున్న వాతావరణ పరిశోధనలపై కూడా ఈ సమావేశంలో చర్చించామన్నారు. తిరుమలలో భవిష్యత్ నిర్మాణాలకు స్థలాలు లేనందువల్ల తిరుపతిలోనే భక్తులకు వసతి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని టీటీడీ అధికారులను కోరారు.
పార్లమెంటరీ కమిటీ సభ్యులు విజయ జవహర్‌లాల్, రవి నారాయణ, రామకృష్ణ యాదవ్, ఫణి మనోజ్ పాండియన్, ప్రదీప్ తంతా, రంజన్ ప్రసాద్, రాం శంకర్ రాజ్‌బార్, ఎంబీ.రాజేష్, మణియన్, జయప్రకాష్, సెల్వ గణపతి, టీటీడీ ఈవో ఎంజీ. గోపాల్, తిరుమల, తిరుపతి జేఈవోలు శ్రీనివాసరాజు, పోలా భాస్కర్, చీఫ్ ఇంజినీర్ చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
తిరుమలలో కాలుష్యం తక్కువ
Published Tue, Jan 7 2014 3:25 AM | Last Updated on Sat, Sep 2 2017 2:21 AM
Advertisement