T.subbarami reddy
-
ఆప్తమిత్రుడిని కోల్పోయాం : బాలయ్య
సాక్షి, హైదరాబాద్ : బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషి కపూర్ క్యాన్సర్ కారణంగా గురువారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతితో దేశ వ్యాప్తంగా విషాద ఛాయలు నెలకొన్నాయి. సినీ, క్రీడా, రాజకీయ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నారు. రిషి కపూర్ మృతిపట్ల హీరో నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ.. ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్ లాంటి ఇద్దరు నట దిగ్గజాలు హఠాత్తుగా మనకు దూరమవడం చాలా బాధాకరమన్నారు. భారతీయ సినిమాకు ఇది తీరని లోటని, వారి విశేష ప్రతిభ, చిత్రాల ద్వారా ఎప్పటికీ గుర్తుంటారని తెలిపారు. ఈ సందర్భంగా వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మలకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నట్లు పేర్కొన్నారు. (రిషి కపూర్ లాస్ట్ ట్వీట్ అదే..) ఆప్తమిత్రుడ్ని కోల్పోయాను.. సినీ నిర్మాత టి.సుబ్బరామి రెడ్డి స్పందిస్తూ.. రిషి కపూర్ మరణవార్త విని తీవ్ర దిగ్బ్రాంతి కి గురయ్యానని, ఒక ఆప్తమిత్రుడ్ని కోల్పోయానన్నారు, ఆయనతో తాము నిర్మించిన 'చాందిని' చిత్ర జ్ఞాపకాలు ఎప్పటికి పదిలంగా ఉంటాయన్నారు. ' రిషి కపూర్ నిజంగా గ్రేట్ హ్యూమన్ బీయింగ్. మా కుటుంబానికి ఎంతో సన్నిహితులు. ఆయన హఠాత్తుగా మనకు దూరమవడం చాలా బాధాకరం. భారతీయ సినిమాకు ఇది తీరని లోటు. వారి విశేష ప్రతిభ, ఆయన చిత్రాల ద్వారా ఎప్పటికీ గుర్తుంటారు. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నా' అని పేర్కొన్నారు. (చాకొలెట్ బాయ్ రిషి కపూర్...) -
పవన్ కళ్యాణ్ ఆశయాలు బాగున్నాయి
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెల్లడించిన ఆశయాలు బాగున్నాయని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి అన్నారు. పదవులకంటే ప్రజలే ముఖ్యమని చెప్పారని, అన్నయ్య చిరంజీవి గురించి ప్రేమగా మాట్లాడారని అది కూడా బాగుందన్నారు. ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజనకు అన్ని పార్టీలు సహకరించాయని చెప్పారు. ఒక్క కాంగ్రెస్ పార్టీపైనే నిందవేయడం మంచిదికాదన్నారు. విభజన సరిగా జరగకపోతే బిజేపి ఎలా సహకరించిందని ప్రశ్నించారు. బిజెపి కూడా అంగీకరిస్తేనే విభజనం జరిగిందని చెప్పారు. విమర్శించడం ప్రతిపక్షాలకు అలవాటేనన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా విమర్శిస్తుందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో అది అవసరం కూడా అని ఆయన అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండబోతోందని చెప్పారు. సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారు. 18వేల కోట్ల రూపాయలు ఉచితంగా ఇస్తారు. మరో రెండు వేల కోట్ల రూపాయలు అప్పు ఇస్తారు అని వివరించారు. మరో అయిదేళ్లలో భారతదేశం గర్వించేలా రాష్ట్రం అభివృద్ది చెందుతుందన్నారు. -
కాంగ్రెస్ పెద్దలు ముగ్గురే
కేవీపీ, సుబ్బరామిరెడ్డి, ఎం.ఎ.ఖాన్లకు మళ్లీ రాజ్యసభ చాన్స్ నంది ఎల్లయ్య, రత్నాబారుుకి దక్కని అవకాశం నాలుగో సీటుకు టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు! సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా రాష్ట్రం నుంచి కేవీపీ రామచంద్రరావు, టి.సుబ్బరామిరెడ్డి, ఎం.ఎ.ఖాన్‌లను ఆ పార్టీ ఖరారు చేసింది. ఈ ముగ్గురూ రాజ్యసభ సిట్టింగ్ సభ్యులే కావడం విశేషం. మరో ఇద్దరు సిట్టింగ్ సభ్యులు నంది ఎల్లయ్య, రత్నాబారుులకు ఈసారి అవకాశం కల్పించలేదు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ‘సమైక్య’ అభ్యర్థిని రంగంలోకి దింపుతామని పార్టీలోని అసంతృప్త ఎమ్మెల్యేలు బహిరంగ ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో.. బలమైన అభ్యర్థులుగా భావించి సీమాంధ్ర ప్రాంతం నుంచి టి.సుబ్బరామిరెడ్డి, కేవీపీలను కాంగ్రెస్ బరిలోకి దింపినట్లు చెబుతున్నారు. ఇక తెలంగాణ నుంచి ఎం.ఎ.ఖాన్‌ను ఎంపికచేశారు. సుబ్బరామిరెడ్డి ఇప్పటికే రెండుసార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక వ్యవహారంపై సోమవారం సాయంత్రం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్, సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్‌లు పార్టీ అధ్యక్షురాలితో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం రాత్రి 7.20 ప్రాంతంలో మొత్తం 9 రాష్ట్రాలకు సంబంధించిన 12 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ ప్రకటించింది. రాష్ట్రంలో ఆ పార్టీకి చెందిన మొత్తం ఐదు స్థానాలు ఖాళీ అవుతుండగా వీటిలో ప్రస్తుతం మూడుస్థానాలు గెలుచుకునేందుకే పూర్తి బలం ఉంది. ఇత ర పార్టీలు సహకరిస్తే మరోస్థానం గెలుచుకునే అవకాశం ఉంది. అయితే టీఆర్ఎస్ తరఫున కె.కేశవరావు బరిలోకి దిగుతుండడంతో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఆ పార్టీకి అవకాశం ఇస్తూ.. నాలుగోస్థానాన్ని వదులుకోవడానికి కాంగ్రెస్ సిద్ధమైనట్టు అభ్యర్థుల జాబితాను బట్టి అర్థమవుతోంది. దిగ్విజయ్ మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ బరిలో నిలుస్తున్నట్టు పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల జాబితా ఆంధ్రప్రదేశ్: టి.సుబ్బరామిరెడ్డి, కేవీపీ రామచంద్రరావు, ఎం.ఎ.ఖాన్ ఛత్తీస్‌గఢ్: మోతీలాల్ వోరా గుజరాత్: మధుసూదన్ మిస్త్రీ హిమాచల్‌ప్రదేశ్: విప్లవ్ ఠాకూర్ మధ్యప్రదేశ్: దిగ్విజయ్‌సింగ్ మహారాష్ట్ర: మురళీ దేవ్రా, హుస్సేన్ ఉమర్ దాల్వే మణిపూర్: హజీ అబ్దుల్ సలాం మేఘాలయ: వాన్సుక్ సయ్యం ఒడిశా: రణ్జిబ్ బిశ్వత్. నన్ను పార్టీ నమ్మింది: సుబ్బరామిరెడ్డి రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక కావడంపై సుబ్బరామిరెడ్డి స్పందించారు. ‘సంప్రదాయాన్ని పక్కనబెట్టి నాకు మూడోసారి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కాంగ్రెస్‌కు నేను పూర్తిగా విధేయుడిని. ఎలాం టి పరిస్థితి ఉన్నా పార్టీ మాట జవదాట లేదు. నేను అజాత శత్రువునని పార్టీ నమ్మింది’ అని అన్నారు. -
తిరుమలలో కాలుష్యం తక్కువ
యూనివర్సిటీ క్యాంపస్, న్యూస్‌లైన్: తిరుమలలో పర్యావరణ కాలుష్యం ప్రమాదకర స్థాయిలో లేదని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ టీ.సుబ్బిరామిరెడ్డి అన్నారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సోమవారం తిరుపతిలోని పద్మావతి అతిథిగృహంలో సమీ క్ష సమావేశం నిర్వహించింది. తిరుమల తిరుపతిలో వాతావరణ కాలుష్యం, ని వారణ చర్యలు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం ఈ కమిటీ చైర్మన్ టీ. సుబ్బిరామిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. వాతావరణ కాలుష్యం 60 క్యూబిక్ మీటర్లకు చేరితే ప్రమాదమన్నారు. తిరుమలలో ఈ స్థాయి 40 క్యూబిక్ మీటర్లుగా ఉందన్నారు. తిరుమలలో అన్నదానానికి ఉపయోగించే కూరగాయలు, బియ్యం నిలువ ఉంచే పద్ధతులు భేషుగ్గా ఉన్నాయన్నారు. రోజుకు 50 వేల మందికి పైగా భక్తులు అన్నప్రసాదాలు స్వీకరిస్తున్నప్పటికీ, అరటి ఆకులను ఉపయోగించడం హర్షించదగ్గ అంశమన్నారు. తిరుమల ఫారెస్ట్‌లో 3 వేల హెక్టార్లు టీటీడీ పరిధి లో ఉందన్నారు. ఇలాంటి పర్యావరణం ఎక్కడా లేదన్నారు. తిరుమలలో ప్రస్తుతం 115 పబ్లిక్ టాయ్లెట్లు ఉన్నాయని, వీటిని 200కు పెంచాల్సి ఉందన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో మరుగుదొడ్లకు ప్రతి యేటా మర మ్మతులు చేయాలన్నారు. పారిశుద్ధ్యం మెరుగుకు టీటీడీ చేపడుతున్న చర్యలు బాగున్నాయన్నారు. దీనిని మరింత మెరుగు పరచడానికి సిబ్బంది సంఖ్యను పెంచాల్సి ఉందన్నారు. తిరుమలకు చేరే బస్సుల నుంచి వస్తున్న కాలుష్యం కూడా ప్రమాదకర స్థాయిలో లేదన్నారు. అయితే భవిష్యత్‌ను దృష్టి లో ఉంచుకుని వ్యక్తిగత వాహనాలను అనుమతించాలా? వద్దా? అన్న అం శాన్ని టీటీడీ పునఃసమీక్షించుకోవాలని కోరారు. తిరుమలకు యేడాదికి 5 లక్షల యూనిట్ల విద్యుత్ ఖర్చువుతుందన్నా రు. ప్రస్తుతం పవన విద్యుత్ ద్వారా 1.5 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసుకోబోతున్నామన్నారు. రాబోయే రోజుల్లో మరో 1.5 లక్షల యూనిట్లకు పెంచుకోవడానికి చర్యలు తీసుకోవాలని సూచిం చారు. తిరుమలలో రోజుకు 40 టన్నుల చెత్త పోగవుతుందని, దీన్ని సమర్థవంతంగా తొలగిస్తున్నారన్నారు. అలానే ఎన్ ఏఆర్ఎల్(గాదంకి)లో చేపడుతున్న వాతావరణ పరిశోధనలపై కూడా ఈ సమావేశంలో చర్చించామన్నారు. తిరుమలలో భవిష్యత్ నిర్మాణాలకు స్థలాలు లేనందువల్ల తిరుపతిలోనే భక్తులకు వసతి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని టీటీడీ అధికారులను కోరారు. పార్లమెంటరీ కమిటీ సభ్యులు విజయ జవహర్లాల్, రవి నారాయణ, రామకృష్ణ యాదవ్, ఫణి మనోజ్ పాండియన్, ప్రదీప్ తంతా, రంజన్ ప్రసాద్, రాం శంకర్ రాజ్‌బార్, ఎంబీ.రాజేష్, మణియన్, జయప్రకాష్, సెల్వ గణపతి, టీటీడీ ఈవో ఎంజీ. గోపాల్, తిరుమల, తిరుపతి జేఈవోలు శ్రీనివాసరాజు, పోలా భాస్కర్, చీఫ్ ఇంజినీర్ చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. -
'సీమాంధ్ర' సమావేశానికి దూరంగా పలువురు మంత్రులు, ఎంపిలు
హైదరాబాద్: పలువురు కేంద్ర మంత్రులు, ఎంపిలు ఈ ఉదయం జరిగిన సీమాంధ్ర నేతల సమావేశానికి హాజరుకాలేదు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాలు, తెలంగాణపై కేంద్రం ముందుకు వెళుతున్న నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ నేతలు శనివారం మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని క్లబ్ హౌజ్‌లో సమావేశమైన విషయం తెలిసిందే. కేంద్రమంత్రులు కిషోర్ చంద్రదేవ్, పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణితోపాటు ఎంపీలు రాయపాటి సాంబశివరావు, చింతా మోహన్, హర్షకుమార్ సబ్బం హరి, టి.సుబ్బరామిరెడ్డి, నేదురమల్లి జనార్ధన రెడ్డి, బొత్స ఝాన్సీ, రత్నాబాయి సమావేశానికి దూరంగా ఉన్నారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు,జేడీ శీలం, పల్లంరాజు, పురంధేశ్వరి, ఎంపీలు లగడపాటి రాజగోపాల్, అనంతవెంకట్రామిరెడ్డి, కనుమూరి బాపిరాజు, కేవీపీ రామచంద్ర రావు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. -
విశాఖలో టి.సుబ్బిరామిరెడ్డికి సమైక్య సెగ
కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డికి మంగళవారం విశాఖపట్నంలో చేదు అనుభవం ఎదురైంది. ఆంధ్రప్రదేశ్ విభజనపై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ సుబ్బిరామిరెడ్డి తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని సమైక్య వాదులు డిమాండ్ చేశారు. నగరంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనను సమైక్యవాదులు అడ్డుకున్నారు. అందులోభాగంగా వేదికపై ఆయన ప్రసంగించేందుకు యత్నించగా, వేదికపై ఏర్పాటు చేసిన హ్యాండ్ ను విశాఖపట్నం నగర సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భాస్కరరావు ఆగ్రహం విర్గగొట్టారు. దాంతో సుబ్బిరామిరెడ్డి మిన్నకుండి పోయారు.