పవన్ కళ్యాణ్ ఆశయాలు బాగున్నాయి | Pawan Kalyan's ambitions are very good: T.subbarami Reddy | Sakshi
Sakshi News home page

పవన్ కళ్యాణ్ ఆశయాలు బాగున్నాయి

Published Sat, Mar 15 2014 4:28 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

టి.సుబ్బరామిరెడ్డి - Sakshi

టి.సుబ్బరామిరెడ్డి

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెల్లడించిన ఆశయాలు బాగున్నాయని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి అన్నారు. పదవులకంటే ప్రజలే ముఖ్యమని చెప్పారని, అన్నయ్య చిరంజీవి గురించి  ప్రేమగా మాట్లాడారని  అది కూడా  బాగుందన్నారు. ప్రెస్క్లబ్లో ఈరోజు ఆయన  మాట్లాడారు. రాష్ట్ర విభజనకు అన్ని పార్టీలు సహకరించాయని చెప్పారు. ఒక్క కాంగ్రెస్ పార్టీపైనే నిందవేయడం మంచిదికాదన్నారు.

విభజన సరిగా జరగకపోతే బిజేపి ఎలా సహకరించిందని ప్రశ్నించారు. బిజెపి కూడా అంగీకరిస్తేనే విభజనం జరిగిందని చెప్పారు. విమర్శించడం ప్రతిపక్షాలకు అలవాటేనన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా విమర్శిస్తుందని చెప్పారు.  ప్రజాస్వామ్యంలో అది అవసరం కూడా అని ఆయన అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండబోతోందని చెప్పారు. సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారు. 18వేల కోట్ల రూపాయలు ఉచితంగా ఇస్తారు. మరో   రెండు వేల కోట్ల రూపాయలు  అప్పు ఇస్తారు అని వివరించారు.  మరో అయిదేళ్లలో భారతదేశం గర్వించేలా రాష్ట్రం అభివృద్ది చెందుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement