డీఎస్సీకి ముంచుకొస్తున్న గడువు | You love DSC Key expired | Sakshi
Sakshi News home page

డీఎస్సీకి ముంచుకొస్తున్న గడువు

Published Thu, Jan 15 2015 2:42 AM | Last Updated on Sat, Sep 2 2017 7:43 PM

డీఎస్సీకి ముంచుకొస్తున్న గడువు

డీఎస్సీకి ముంచుకొస్తున్న గడువు

గుంటూరు ఎడ్యుకేషన్ : సర్కారు పాఠశాలల్లో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలని కలలుగంటున్న నిరుద్యోగులకు ప్రభుత్వం చుక్కలు చూపెడుతోంది. డీఎస్సీ-2015 దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు ముంచుకొస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. డీఎస్సీలో భాగంగా ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ తదితర పోస్టులకు దరఖాస్తు చేసేందుకు ఏపీ ఆన్‌లైన్ కేంద్రాలకు వెళుతున్న అభ్యర్థులు సర్వర్ ఓపెన్ కాక గంటల కొద్దీ నిరీక్షిస్తున్నారు.
     
పరీక్ష ఫీజు చెల్లింపునకు తుది గడువు ఈనెల 16 కాగా, ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు ఈనెల 17తో గడువు ముగియనుంది. మరో వైపు సంక్రాంతి సెలవుల దృష్ట్యా గత మూడు, నాలుగు రోజుల వ్యవధిలో డీఎస్సీకి దరఖాస్తులు వెల్లువెత్తాయి.
     
ఇప్పటి వరకు అన్ని విభాగాల్లో కలిపి జిల్లాలో డీఎస్సీకి దాదాపు 18 వేల దరఖాస్తులు అందాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన తరువాత ప్రింటవుట్ కాపీని విడిగా అందజేసేందుకు నగరంపాలెంలోని స్టాల్ బాలికోన్నత పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఏర్పాటు చేసిన కౌంటర్‌కు మూడు రోజుల వ్యవధిలో రోజుకు 1500 చొప్పున దరఖాస్తులు అందాయి.
     
ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు ఈ నెల 17వ తేదీ తుదిగడువు కాగా, ప్రింటవుట్ కాపీల అందజేతకు ఈ నెలాఖరు వరకు గడువు ఉంది.
 
గడువు పొడిగింపుపై నోరు మెదపని ప్రభుత్వం ...
     డీఎస్సీ దరఖాస్తుకు గడువు పొడిగించాలని నిరుద్యోగ యువత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి విద్యాశాఖకు విజ్ఞప్తులు వెళ్లినా దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
 
మూడు రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ నిలిపివేత...
     సంక్రాంతి సెలవుల దృష్ట్యా డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను మూడు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కేవీ శ్రీనివాసులురెడ్డి మంగళవారం ప్రకటించారు. ఈనెల 14,15,16 తేదీల్లో ప్రభుత్వం సెలవులు ప్రకటించిన నేపథ్యంలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన అభ్యర్థులు ప్రింటవుట్ కాపీలను ఈనెల 17వ తేదీ నుంచి నెలాఖరులోపు సమర్పించాలని సూచించారు.


     బుధ, గురు, శుక్ర వారాల్లో ప్రింటవుట్ దరఖాస్తులను అందజేసేందుకు జిల్లా కేంద్రానికి ఎవ్వరూ రావద్దని ఆయన స్పష్టం చేశారు. మరో వైపు ప్రింటవుట్ దరఖాస్తులతో ఆన్‌లైన్ దరఖాస్తులను క్రోడీకరించేందుకు సీనియర్ ఉపాధ్యాయులతో 10 బృందాలను డీఈవో నియమించారు. ఆయా బృందాలు ఈనెల 17వ తేదీ నుంచి తమ పని ప్రారంభిస్తాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement