the deadline
-
ఇన్‌కం డిక్లరేషన్ స్కీంకు నేడే తుది గడువు
-
గడువుకు ముందే ‘మిషన్’ పూర్తి
ఇంటింటికీ తాగునీరందిస్తాం.. ‘భక్త రామదాసు’ను నవంబర్‌లో రైతులకు అంకితం చేస్తాం.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూసుమంచి : 2017కు ముందే మిషన్ భగీరథ పథకం పనులు పూర్తి చేసి.. ఇంటింటికీ తాగునీరు సరఫరా చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పాలేరు రిజర్వాయర్‌లో నిర్మిస్తున్న ఇన్‌టేక్‌వెల్ పనులను మంత్రి సోమవారం పరిశీలించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం రింగ్‌బండ్ కట్ట తెగిపోయి.. ఇన్‌టేక్‌వెల్‌కు నీరు చేరిందని, దీనివల్ల ప్రమాదమేమీ లేదని, ప్రస్తుతం నీరు చేరిన ప్రాంతంలో పనులు పూర్తయ్యాయని అన్నారు. మిగిలిన పనులు అక్టోబర్ నాటికి పూర్తవుతాయని పేర్కొన్నారు. జిల్లాలో రూ.3,558కోట్లతో ఐదు సెగ్మెంట్లలో భగీరథ పనులు కొనసాగుతున్నాయని, దీంతోపాటు మరో రూ.వెయ్యి కోట్లతో గ్రామాల్లో పైపులైన్లు వేసి ఇంటింటికీ నల్లాలు బిగిస్తామని అన్నారు. జిల్లాలో డిసెంబర్ నాటికి 388 గ్రామాలకు, 2017 జనవరిలో 300 గ్రామాలకు, మార్చిలో 746 గ్రామాలకు, సెప్టెంబర్‌లో 560 గ్రామాలకు, డిసెంబర్లో 674 గ్రామాలకు తాగునీరు సరఫరా చేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. రబీకి సాగర్ నీళ్లు తెప్పిస్తా.. జిల్లాలో వచ్చే రబీ పంటకు సీఎంతో మాట్లాడి సాగురు తెప్పిస్తానని మంత్రి తుమ్మల అన్నారు. ప్రస్తుతం భారీ వర్షాలతో పాలేరు నిండిందని, దీంతో నీటిని ఎడమ కాలువకు వదిలి పలు చెరువులు నింపుతున్నామని అన్నారు. రైతులు ఇప్పుడు నాట్లు వేసుకోవటం మంచిది కాదని, నవంబర్ 15 తరువాత నాట్లు వేసుకోవాలని సూచించారు. ఎక్కడైనా రోడ్లు కోతకు గురైతే వెంటనే అధికారులు చర్యలు చేపట్టి.. రాకపోకలు పునరుద్ధరిస్తున్నారని వివరించారు. నవంబర్ నాటికి ‘భక్త రామదాసు’ నీళ్లు భక్త రామదాసు ఎత్తిపోతల పథకం పనులు పూర్తి కావొచ్చాయని, నవంబర్ మొదటి వారంలో ట్రయల్ రన్ వేసి నెలాఖరులోగా చెరువులకు సాగర్ జలాలు వదులుతామని మంత్రి తుమ్మల అన్నారు. ఎర్రగడ్డతండా వద్ద నిర్మిస్తున్న ఇన్‌టేక్‌వెల్ నిర్మాణాలను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. భక్త రామదాసు ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ. 557కోట్లు అవుతుందని, గత కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ కోసం కొన్న పైపులను, మోటార్లను ఈ పథకానికి వినియోగిస్తుండగా.. రూ.100కోట్లు వెచ్చించటంతో పథకం పూర్తవుతుందని అన్నారు. ఈ పథకం తనకు వచ్చిన ఆలోచనేనని, తాను కోరగానే సీఎం అంగీకారం తెలపటం మంచి పరిణామమన్నారు. 33 కిలోమీటర్ల పైపులైన్ పూర్తయిందని, భారీ మోటార్లు బిగించారని, మిగిలిన పనులను అక్టోబర్ నాటికి పూర్తి చేసి నవంబర్‌లో సీఎం చేతులమీదుగా రైతులకు అంకితం చేస్తామని మంత్రి ప్రకటించారు. ఆయా సమావేశాల్లో మాజీ ఎమ్మెల్యేలు కొండబాల కోటేశ్వరరావు, వేనేపల్లి చందర్రావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, జెడ్పీటీసీ రాంచంద్రునాయక్, పాలేరు సర్పంచ్ రామసహాయం మాధవీరెడ్డి, ఎంపీటీసీలు వెంకన్న, విద్యాచందన, మిషన్ భగీరథ ఎస్ఈ శ్రీనివాసరావు, భక్త రామదాసు ఎత్తిపోతల పథకం సీఈ సుధాకర్‌రావు, ఎన్నెస్పీ ఎస్ఈ కోటేశ్వరరావు, ఈఈ శ్యాంరావు, ఆర్డీఓ విజయ్‌కృష్ణారెడ్డి, తహసీల్దార్ వెంకారెడ్డి, నాగార్జున కనస్ట్రక్షన్ కంపెనీ జీఎం శ్రీనివాసరావు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -

గడువు 2 రోజులే..
మహబూబ్‌నగర్ టౌన్: పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం కలిగించే ఇళ్లస్థలాల క్రమబద్ధీకరణ (సంబంధిత వ్యక్తుల పేర చేయించుకోవడం)ప్రక్రియ జిల్లాలో ఆశించిన ఫలితాన్ని ఇవ్వడం లేదు. ముఖ్యంగా గ్రామీణస్థాయిలో చాలామందికి అవగాహన లేకపోవడంతో దరఖాస్తులు చేసుకునేందుకు ముందుకురావడం లేదు. అధికారులకు పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడం ఒకటైతే.. ప్రచారం చేయకపోవడంతో నామమాత్రపు స్పందన లభించిందని తేటతెల్లమైంది. ఈ క్రమంలో ప్రభుత్వం విధించిన గడువు ఈనెల 31వ తేదీతో ముగియనుంది. ఇళ్లస్థలాలను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం 58,59 జీఓలను జారీచేసింది. దీనికి సంబంధించి ముందుగా ఈనెల 19వ తేదీ వరకు గడువు విధించినప్పటికీ జిల్లాలోని ఐదు రెవెన్యూ డివిజన్ల పరిధిలో కేవలం 244దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. గడువును మరింత పెంచడంతో బుధవారం నాటికి 2604 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో జీఓ నెం.58 కింద క్రమబద్ధీక రణ కోసం 2549, జీఓ నెం.59 కింద 55 దరఖాస్తులు వచ్చాయి. తద్వారా ప్రభుత్వానికి రూ.39.42లక్షల ఆదాయం సమకూరింది. అత్యధికంగా మహబూబ్‌నగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోనే 1224 దరఖాస్తులు నమోదయ్యాయి. దీంతోపాటు జీఓ నెం.59కి 17దరఖాస్తులు రాగా వీటికి సంబంధించి రూ.31,83,675 ఆదాయం వచ్చింది. అత్యల్పంగా నాగర్‌కర్నూల్‌లో వచ్చాయి. క్రమబద్ధీకరణతో మేలు ఇళ్లు ఉన్నా ఇంకా క్రమబద్ధీకరించుకోలేని కుటుంబాలు జిల్లాలో 10వేల పైగా ఉన్నట్లు సంబంధిత అధికారుల అంచనా. జీఓ నెం.58ప్రకారం 125 గజాల లోపు స్థలాన్ని ఉచితంగా క్రమబద్ధీకరిస్తారు. 125 నుంచి 250గజాల వరకు అయితే మార్కెట్ ధరలో 30శాతం ప్రభుత్వానికి ఫీజు రూపేణా చెల్లించాలి. 250 నుంచి 500గజాల వరకు ఉన్న వారంతా ధరలో 75శాతం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయితే వారి స్థలాలను ఇతరులకు విక్రయించుకునే సౌలభ్యం ఉంటుంది. ఉచితంగా క్రమబద్ధీకరించుకునేవారు విక్రయించుకునేందుకు వీలుండదు. ఒకవేళ వారు విక్రయించాల్సి వస్తే ప్రభుత్వం నిర్ణయించిన ధర కచ్చితంగా చెల్లించాలి. అవగాహన లేని కారణంగానే కొందరే దరఖాస్తులు చేసుకుంటున్నారు. క్రమబద్ధీకరణకు గడువు రెండురోజులు మాత్రమే మిగిలి ఉండటంతో అర్హులంతా దరఖాస్తు చేసుకుంటారా? లేదా? అనేది తేలాల్సి ఉంది. డివిజన్ల వారీగా దరఖాస్తులు డివిజన్ పేరు జీఓ జీఓ ఆదాయం నెం. 58 నెం.59 1, మహబూబ్‌నగర్ 1224 17 రూ.31,83,675 2. గద్వాల 591 18 రూ.2,85,875 3. వనపర్తి 402 2 రూ.1.20లక్షలు 4. నాగర్‌కర్నూల్ 47 10 రూ.87వేలు 5. నారాయణపేట 285 8 రూ.2,65,750 మొత్తం: 2549 55 రూ.39,42,300 -
డీఎస్సీకి ముంచుకొస్తున్న గడువు
గుంటూరు ఎడ్యుకేషన్ : సర్కారు పాఠశాలల్లో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలని కలలుగంటున్న నిరుద్యోగులకు ప్రభుత్వం చుక్కలు చూపెడుతోంది. డీఎస్సీ-2015 దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు ముంచుకొస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. డీఎస్సీలో భాగంగా ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ తదితర పోస్టులకు దరఖాస్తు చేసేందుకు ఏపీ ఆన్లైన్ కేంద్రాలకు వెళుతున్న అభ్యర్థులు సర్వర్ ఓపెన్ కాక గంటల కొద్దీ నిరీక్షిస్తున్నారు. పరీక్ష ఫీజు చెల్లింపునకు తుది గడువు ఈనెల 16 కాగా, ఆన్లైన్లో దరఖాస్తుకు ఈనెల 17తో గడువు ముగియనుంది. మరో వైపు సంక్రాంతి సెలవుల దృష్ట్యా గత మూడు, నాలుగు రోజుల వ్యవధిలో డీఎస్సీకి దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇప్పటి వరకు అన్ని విభాగాల్లో కలిపి జిల్లాలో డీఎస్సీకి దాదాపు 18 వేల దరఖాస్తులు అందాయి. ఆన్లైన్లో దరఖాస్తు చేసిన తరువాత ప్రింటవుట్ కాపీని విడిగా అందజేసేందుకు నగరంపాలెంలోని స్టాల్ బాలికోన్నత పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఏర్పాటు చేసిన కౌంటర్‌కు మూడు రోజుల వ్యవధిలో రోజుకు 1500 చొప్పున దరఖాస్తులు అందాయి. ఆన్లైన్లో దరఖాస్తుకు ఈ నెల 17వ తేదీ తుదిగడువు కాగా, ప్రింటవుట్ కాపీల అందజేతకు ఈ నెలాఖరు వరకు గడువు ఉంది. గడువు పొడిగింపుపై నోరు మెదపని ప్రభుత్వం ... డీఎస్సీ దరఖాస్తుకు గడువు పొడిగించాలని నిరుద్యోగ యువత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి విద్యాశాఖకు విజ్ఞప్తులు వెళ్లినా దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మూడు రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ నిలిపివేత... సంక్రాంతి సెలవుల దృష్ట్యా డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను మూడు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కేవీ శ్రీనివాసులురెడ్డి మంగళవారం ప్రకటించారు. ఈనెల 14,15,16 తేదీల్లో ప్రభుత్వం సెలవులు ప్రకటించిన నేపథ్యంలో ఆన్లైన్లో దరఖాస్తు చేసిన అభ్యర్థులు ప్రింటవుట్ కాపీలను ఈనెల 17వ తేదీ నుంచి నెలాఖరులోపు సమర్పించాలని సూచించారు. బుధ, గురు, శుక్ర వారాల్లో ప్రింటవుట్ దరఖాస్తులను అందజేసేందుకు జిల్లా కేంద్రానికి ఎవ్వరూ రావద్దని ఆయన స్పష్టం చేశారు. మరో వైపు ప్రింటవుట్ దరఖాస్తులతో ఆన్లైన్ దరఖాస్తులను క్రోడీకరించేందుకు సీనియర్ ఉపాధ్యాయులతో 10 బృందాలను డీఈవో నియమించారు. ఆయా బృందాలు ఈనెల 17వ తేదీ నుంచి తమ పని ప్రారంభిస్తాయి.