ఇంటిలో శవమై కనిపించిన యువతి
డెంకాడ: ప్రేమికుడు మోసం చేశాడని మనస్తాపం చెందిందో? మరేదైనా బలమైన కారణం ఉందో స్పష్టంగా తెలియనప్పటికీ ఓ యువతి తన ఇంట్లోనే శవమై కనిపించింది. డెంకాడ మండలంలోని బొడ్డవలస పంచాయతీ కృష్ణాపురం గ్రామానికి చెందిన జొన్నాడ కనకమ్మ(26) అనే యువతి ఆమె ఇంటిలో చీరతో ఉరివేసుకుని దూలానికి వేలాడుతూ కనిపించడం సంచలనం సృష్టించింది. గ్రామంలోని ఇంటిలో యువతి మృతదేహాన్ని ఆమె తండ్రి శనివారం గుర్తించడంతో విషయం బయటకు వచ్చింది. పోలీసులు, స్థానికులు తదితరులు అందించిన వివరాలిలా ఉన్నాయి. ఇంటిలో కనకమ్మతో పాటు తండ్రి పైడతల్లి ఉంటాడు. పైడితల్లి కోళ్లఫారంలో పని చేస్తుంటాడు. పనిలో భాగంగా ప్రతిరోజూ ఉదయం వెళ్లి రాత్రి ఇంటికి వస్తాడు.గురువారం ఉదయ కూతురిని చూసిన తండ్రి పనిలోకి వెళ్లి యథావిధిగా రాత్రి వచ్చాడు. అయితే తలుపు కొట్టినా కుమార్తు తీయకపోవడంతో నిద్రిస్తోందని భావించి పైడితల్లి పడుకున్నాడు.
శుక్రవారం కూడా ఇదే పరిస్థితి. శనివారం ఉదయం పైడితల్లి తలు పుకొట్టడంతో అప్పటికీ కనకమ్మ ఆమె తీయలేదు. దీనికి తోడు వాసన వస్తుండడంతో అనుమానం వచ్చిన తండ్రి పైడితల్లి తలుపులు విరగ్గొట్టి చూసే సరికి కూతురు కనకమ్మ చీరతో ఉరిపోసుకున్న విధంగా శవమై వేలాడుతూ కనిపించింది. దీంతో గ్రామంలోకొ పరుగుపెట్టి కొందరికి పరిస్థితి వివరించి వారి సహాయంతో పోలీసులకు సమాచారాన్ని అందించారు. దీంతో భోగాపురం సీఐ వైకుంఠరావు, డెంకాడ ఎస్సై జి.కళాధర్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి వివరాలు సేకరించారు. మనస్తాపంతో యువతి ఆత్మహత్యకు పాల్పడి మృతి చెంది ఉంటుందని అనుమానించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అయితే చలుమూరి సురేంద్ర అనే యువకుడు తనను ప్రేమించి, వంచించి ఇప్పుడు పెళ్లికి ఒప్పుకోవడం లేదని కనకమ్మ గత నెలలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కనకమ్మ తనకు సురేంద్రతో పెళ్లి చేయాలని తండ్రితో పాటు బావను కూడా కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ యువతి శవమై కనిపించడంతో స్థానికుల నుంచి రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవాలు ఏమిటన్నది పోస్ట్‌మార్టం నివేదికలో తేలనున్నాయి.
ఏమైందో ఏమో?
Published Sun, Mar 15 2015 3:03 AM | Last Updated on Wed, Aug 1 2018 2:15 PM
Advertisement
Advertisement