
నిర్మల మృతదేహం
విజయనగరం , మెంటాడ: మండలంలోని బడేవలస గ్రామానికి చెందిన పొట్నూరు నిర్మల( 19) గురువారం రాత్రి ఇంట్లో ఉన్న ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మెంటాడ గ్రామానికి చెందిన ఒక వ్యక్తితో వివాహం చేయడానికి నిర్మల తల్లిదండ్రులు నిర్ణయించారు. ఇప్పుడే పెళ్లి వద్దని నిర్మల చెప్పినట్టు సమాచారం. పెళ్లి వద్దని చెప్పినా తల్లిదండ్రులు పెళ్లికి ఏర్పాట్లు చేస్తుండడంతో నిర్మల తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని భావిస్తున్నారు. మృతురాలు నిర్మలకు తల్లిదండ్రులు వెంకటరమణ, అప్పారావు, సోదరుడు కృపాకర్, సోదరి విజయ ఉన్నారు. మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆండ్ర ఎస్‌ఐ సుదర్శనరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment