ఉప్పు విక్రయిస్తున్న రైతులు
ఉప్పు సత్యాగ్రహానికి నాంది పలికిన గడ్డ అల్లూరు. బ్రిటిష్ వారినే గడగడలాడించిన ఉప్పు రైతులు ఆనాటి పాలకుల దుర్మార్గ పాలనకు అప్పుల పాలయ్యారు. దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో కీలక ఉద్యమ పాత్ర పోషించిన ఉప్పు రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలులేదు. ఈ దశలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కావడంతో ఉప్పు రైతుల కష్టాలు తీర్చేందుకు ఉదారంగా నడుంబిగించారు. ఉప్పు రైతులకు పెనుభారంగా మారిన విద్యుత్ చార్జీలను మూడింతలు తగ్గించి, పాత బకాయిలను సైతం మాఫీ చేసి, మెరుగైన మార్కెట్ సౌకర్యాన్ని కల్పించిన ఘతన ఆయనదే. వైఎస్సార్ మరణించి పదేళ్లు అయినా ఉప్పు రైతులు ఇప్పటికీ ఆయన్ను గుర్తు చేసుకుంటున్నారు.
విడవలూరు: జిల్లాలో అల్లూరు, విడవలూరు, ముత్తుకూరు తీర గ్రామాలు ఉప్పు ఉత్పత్తికి అనుకూలమైన ప్రాంతాలు. విడవలూరు మండలంలోని రామతీర్థం, అల్లూరు మండలంలోని ఇస్కపల్లి, గోగులపల్లి, ముత్తుకూరు మండలాల్లో సుమారు 4000 ఎకరాల్లో సొసైటీలు ద్వారా ఈ ఉప్పు ఉత్పత్తిని చేస్తుంటారు. వ్యవసాయాధారిత ప్రాంతాలైన ఈ మూడు తీర మండలాల్లో ఉప్పు ఉత్పత్తిది రెండో స్థానంగా నిలుస్తోంది. 2004 నాటికి ముందున్న ప్రభుత్వాల పాలనలో ఉప్పు రైతులు అప్పులు పాలయ్యారు. ఉప్పు ఉత్పత్తిలో కీలమైన విద్యుత్ చార్జీలు పెనుభారంగా ఉండేవి. అప్పట్లో యూనిట్ విద్యుత్ ధర రూ.4 ఉండేది. మరో పక్క మార్కెట్ సౌకర్యం లేక.. ప్రకృతి ప్రతికూల పరిస్థితుల్లో నష్టపోయి విద్యుత్ చార్జీలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉండేవారు. ఈ దశలో వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక ఉప్పు ఉత్పత్తిదారులు కష్టాలను తెలుసుకున్నారు.
రూపాయికి తగ్గిన విద్యుత్ చార్జీలు
ఉప్పు ఉత్పత్తి చేసే రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్న తరుణంలో వారికి కొంత మేలు చేయాలన్న ధేయ్యంతో వైఎస్సార్ రైతులు చెల్లిస్తున్న విద్యుత్ చార్జీలను భారీగా తగ్గించారు. 2008 మార్చి 23వ తేదీన ఉప్పు రైతులకు విద్యుత్ యూనిట్ రూ.4 నుంచి రూపాయికి తగ్గించారు. ఇది ఉప్పు రైతులకు వరంగా మారింది. అయితే వైఎస్సార్ మరణాంతరం ఉప్పు రైతులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. దీంతో మళ్లి విద్యుత్ చార్జీలు యథావి«ధిగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment