
చిత్తూరు, సాక్షి: ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభానికి ముందు.. తరువాత అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. ఇప్పుడు వైఎస్ జగన్ కూడా ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభానికి ముందు, తరువాత శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ‘అచ్చం నాన్నలానే’ అంటూ గుర్తు చేసుకుంటున్నారు. అప్పుడు, ఇప్పుడు కూడా చంద్రబాబే సీఎంగా ఉన్నారు. (కాలిబాటన కొండపైకి..)
2003లో చేవెళ్ల నుంచి ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభమైంది. మండుటెండలో 1475 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. 68 రోజుల పాటు 640 గ్రామాల గుండా వైఎస్సార్ పాదయాత్ర చేశారు. పాదయాత్ర అనంతరం వైఎస్సార్ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత పేదలకు ఎన్నో మంచి పథకాలు అమలు చేసి వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేశారని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు జగన్ చేసిన పాదయాత్ర వల్ల కూడా తప్పక ముఖ్యమంత్రి పదవి చేపడతారని ప్రజలు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment