
నేడు కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన
గన్నవరం నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటల పరిశీలన
సాక్షి, విజయవాడ: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. గన్నవరం నియోజకవర్గంలో పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తారు.
పంట నష్టపోయిన బాధిత రైతులను కలుసుకుంటారు. ఇటీవల వైఎస్ జగన్ రాజధాని ప్రాంతంలో పర్యటనకు వచ్చినప్పుడు గన్నవరం విమానాశ్రయంలో మినుము రైతులు ఆయనను కలిశారు. తమ పంటలు దెబ్బ తిన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. స్పందించిన జగన్ వారి గ్రామాల్లో పర్యటించి, దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. రెండేళ్లుగా పంటలు పండని పొలాలను, తెగులుతో నష్టపోయిన మినుము పంటలను పరిశీలించిన అనంతరం అక్కడి రైతుల సమస్యలను వైఎస్ జగన్ అడిగి తెలుసుకుంటారు.