krishna district tour
-
‘విజయవాడలోనే ఉంటానని డబ్బాలు కొట్టుకుంటారు’
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు హాయంలో రైతుల పరిస్థితి అధ్వాన్నంగా మారిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో సోమవారం ఉదయం ఆయన పర్యటన ప్రారంభమైంది. బొమ్ములూరులో నీరు అందక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించి రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. నీటి పారుదల శాఖ మంత్రి సొంత జిల్లాలోనే పంటల పరిస్థితి ఈ విధంగా ఉండడం దారుణమన్నారు. ‘ప్రతి రోజు చంద్రబాబు ఇక్కడ నుంచే ఫ్లైట్ ఎక్కుతారు. విజయవాడలోనే ఉంటానని డబ్బాలు కొట్టుకుంటారు కానీ, రైతుల కష్టాలను పట్టించుకోర’ని మండిపడ్డారు. రైతులకు నీళ్లు ఇవ్వకపోగా, బలవంతంగా భూములు లాక్కుంటున్నారని అన్నారు. నియోజకవర్గంలో 18 వేల ఎకరాలకు గాను.. వెయ్యి ఎకరాలే సాగు అవుతున్నాయన్నారు. రైతుల పరిస్థితిపై సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రాజధాని ప్రాంతంలో మూడు, నాలుగు పంటలు పండే భూములు నీరు లేక ఎండిపోతున్నాయని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. మెట్టప్రాంతాల్లో పంటలు ఎండిపోతాయని.. కానీ డెల్టా ప్రాంతంలో నీరు లేక పంటలు ఎండిపోవడం బాధకరమన్నారు. మినుము ధర క్వింటాకు రూ.12 వేల నుంచి రూ.6 వేలకు పడిపోయిందని రైతులు జగన్ దృష్టికి తీసుకువచ్చారు. కనీసం పంటను కూడా కాపాడుకోలేక పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోయారు. పంట నష్టంపై ఎలాంటి సర్వే చేయరు. ఏ అధికారి పర్యవేక్షణకు రారని జగన్ ధ్వజమెత్తారు. నష్టపోయిన పంటలకు పైసా నష్టపరిహారం కూడా ఇవ్వడం లేదన్నారు. ఈ పర్యటనలో జగన్ వెంట ఎమ్మెల్యేలు కొడాలి నాని, రక్షణనిధి, మేకా ప్రతాప్ అప్పారావు, పార్టీ నేతలు రామచంద్రరావు, జోగి రమేష్, పేర్ని నాని తదితరులు పాల్గొన్నారు. -
నేడు కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన
గన్నవరం నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటల పరిశీలన సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. గన్నవరం నియోజకవర్గంలో పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తారు. పంట నష్టపోయిన బాధిత రైతులను కలుసుకుంటారు. ఇటీవల వైఎస్ జగన్ రాజధాని ప్రాంతంలో పర్యటనకు వచ్చినప్పుడు గన్నవరం విమానాశ్రయంలో మినుము రైతులు ఆయనను కలిశారు. తమ పంటలు దెబ్బ తిన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. స్పందించిన జగన్ వారి గ్రామాల్లో పర్యటించి, దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. రెండేళ్లుగా పంటలు పండని పొలాలను, తెగులుతో నష్టపోయిన మినుము పంటలను పరిశీలించిన అనంతరం అక్కడి రైతుల సమస్యలను వైఎస్ జగన్ అడిగి తెలుసుకుంటారు. -
బుద్దాలవారి పాలెం చేరుకున్న వైఎస్ జగన్
మచిలీపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. మచిలీపట్నం పోర్టు అనుబంధ పరిశ్రమల ఏర్పాటుతో భూములు కోల్పోయిన నిర్వాసితులతో సమావేశమయ్యేందుకు ఆయన బుద్దాలవారి పాలెం చేరుకున్నారు. అక్కడ బాధితులతో సమావేశమయ్యారు. అక్కడి నుంచి కోన గ్రామానికి చేరుకుని బాధిత రైతులతో ముఖాముఖిలో పాల్గొంటారు. కాగా అంతకముందు గన్నవరం ఎయిర్‌పోర్టులో వైఎస్ జగన్ కు ఘనస్వాగతం లభించింది. పార్టీ అగ్రశేణి నాయకులు గౌతంరెడ్డితో పాటు పలువురు కార్యకర్తలు జగన్‌కు స్వాగతం పలికారు. -
వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గురువారం ఉదయం విమానాశ్రయంలో ఆయనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. వైఎస్ జగన్ ఈ రోజు కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. మచిలీపట్నం (బందరు) పోర్టు కోసం టీడీపీ ప్రభుత్వం ఏకపక్షంగా రైతుల పొలాలను లాక్కుంటున్న ప్రాంతాలను సందర్శిస్తారు. బందరు మండలంలోని బుద్దాలవారి పాలెం, కోన గ్రామాలలో ఆయన పర్యటిస్తారు. గన్నవరం విమానాశ్రయం నుంచి వైఎస్ జగన్ రోడ్డుమార్గంలో మచిలీపట్నం బైపాస్ మీదుగా బుద్దాలవారి పాలెం చేరుకుంటారు. అక్కడ రైతులతో మాట్లాడుతారు. అనంతరం అక్కడి నుంచి కోన గ్రామానికి చేరుకుని బాధిత రైతులతో ముఖాముఖి నిర్వహించి.. వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. -
గూడు చెదిరిన బాధితులకు... జగన్ భరోసా
రోజుకూలికెళితే తప్ప పూటగడవని పేదలు వారు.. చిన్న బడ్డీకొట్లు పెట్టుకొని జీవనం సాగిస్తున్నవారు మరికొందరు.. విజయవాడలో రామవరప్పాడు వద్ద రోడ్డుపక్కన నివాసాలు ఏర్పాటుచేసుకుని జీవనం సాగిస్తున్నారు.. ఆదుకోవాల్సిన ప్రభుత్వమే ఇప్పుడు వారి గూడును పీకేసింది.. దీంతో తల్లడిల్లిపోతున్న బాధితులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, శాసనసభలో ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సోమవారం పరామర్శించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులు తమ ఆవేదనను జగన్మోహన్రెడ్డికి వివరించి కన్నీరు పెట్టుకున్నారు. * పేదల తరఫున కోర్టులో కేసు వేయాలని పార్టీ నేతలకు వైఎస్ జగన్ ఆదేశం * పోరాటం చేయాలని బాధితులకు పిలుపు * గ్రీన్ జోన్‌పై జననేతకు రైతుల వినతి * నూజివీడులో ఎమ్మెల్యే మేకా ప్రతాప్ సతీమణికి నివాళి * విజయవాడలో సామినేని ఉదయభాను మాతృమూర్తికి పరామర్శ సాక్షి ప్రతినిధి, విజయవాడ : విజయవాడలో రామవరప్పాడు వద్ద ఇళ్లు కోల్పోయిన బాధితులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఉదయం పరామర్శించారు. రోడ్డు పనులు చేస్తున్న ప్రదేశాన్ని, గుడిసెలు తొలగించిన ప్రాంతాన్ని పరిశీలించారు. బాధితులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు తమ కష్టాలను ఆయన ఎదుట మొరపెట్టుకున్నారు. ప్రధానంగా మహిళలు తమ గోడు వినిపించారు. ‘అన్నా... ఇటువంటి ప్రభుత్వాన్ని మేమెప్పుడూ చూడలేదన్నా... చంద్రబాబునాయుడు రోడ్డు వెంట వెళ్లేటప్పుడు గుడిసెలు కనిపించకూడదట.. ఇంత దారుణమా’ అంటూ వాపోయారు. పోరాడండి.. అండగా నిలుస్తాం.. అన్యాయం జరిగినప్పుడు పోరాటమే మార్గం... మీ వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది.. అధైర్యపడొద్దు.. ధైర్యంగా ఉండండని జగన్మోహన్రెడ్డి బాధితులకు భరోసా ఇచ్చారు. ఇప్పటికే 120 మంది గుడిసెలు తొల గించారని, ఇంకా 600 మంది గుడిసెలు ఉన్నాయని, వాటిని కూడా తొలగిస్తారంటున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేయగా ‘మీకేం భయం లేదు.. పోరాడండి’ అని భరోసా ఇచ్చారు. పక్కనే ఉన్న మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే కొడాలి నానిలతో మాట్లాడుతూ వెంటనే కోర్టులో కేసు వేయించాలని చెప్పారు. బాధితుల తరఫున మనం పోరాడదామని తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు దారుణంగా వ్యవహరిస్తున్నారని, పేదలపై కనీసం కనికరం కూడా చూపకుండా, ప్రత్యామ్నాయం చూడకుండా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఉదయభాను మాతృమూర్తికి పరామర్శ... అనంతరం ఆంధ్ర హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సామినేని ఉదయభాను మాతృమూర్తి పద్మావతిని వైఎస్ జగన్ పరామర్శించారు. ఉదయభానుతో పాటు కుటుంబ సభ్యుల నుంచి ఆమె యోగక్షేమాలను తెలుసుకున్నారు. నూజివీడులో ఎమ్మెల్యే సతీమణికి నివాళి నూజివీడులో ఎమ్మెల్యే మేకా ప్రతాప్ సతీమణి సుజాతాదేవి భౌతికకాయాన్ని జగన్మోహన్రెడ్డి సందర్శించి నివాళులర్పించారు. సోమవారం ఉదయం ఎమ్మెల్యే ఇంటికి విజయవాడ నుంచి నేరుగా చేరుకున్న జగన్.. పలువురు బంధువులు, ఎమ్మెల్యే అప్పారావును పరామర్శించారు. మధ్యాహ్నం తరువాత అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ బయలుదేరారు. మార్గం మధ్యలో జి.కొండూరు మండలంలోని వెంకటాపురంలో స్థానికులు ఆపి జననేతకు ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్ విగ్రహానికి స్థానిక నాయకులతో పూలమాల వేయించారు. అనంతరం జి.కొండూరులో స్థానిక నాయకులు జగన్‌కు ఘనస్వాగతం పలికారు. వైఎస్ జగన్ వెంట పార్టీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కేపీ సారథి, ఎమ్మెల్యేలు కొడాలి నాని, ఉప్పులేటి కల్పన, రక్షణనిధి, జలీల్‌ఖాన్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దుట్టా రామచంద్రరావు, పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్, రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తాఫా, కైకలూరు నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి ఆర్.వెంకటేశ్వరరావు, వైఎస్సార్ టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాదు శివరామకృష్ణ ఉన్నారు. రైతుల వినతి... ఆ తరువాత ఇబ్రహీంపట్నం వెళ్లిన జగన్మోహన్రెడ్డి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్ ఇంటి వద్ద కాసేపు ఆగారు. అక్కడ ఆయనను జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల రైతులు కలిశారు. సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్‌జోన్ పేరుతో రైతుల పొలాలపై పెత్తనం చేసేందుకు వ్యూహం పన్నారని, దీనిని ఎలాగైనా ఆపాలంటూ రైతులు వినతిపత్రం సమర్పించారు. భూమిని అమ్మేందుకు భూ యజమానికే హక్కు లేకుండా చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై జగన్ స్పందిస్తూ.. దీనిపై తప్పకుండా చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు. ఈ సమస్యను పరిశీలించి ఆందోళన ఉధృతం చేయాలని పార్టీ వారికి సూచించారు. -
పేదలకు అండగా దీక్షలు చేస్తాం
► వైఎస్ఆర్సీపి అధినేత, ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి ► రామవరప్పాడు రోడ్డు బాధితులకు అండగా ఉంటాం ► కోర్టు తలుపులు తడతాం, నిరాహార దీక్షలు చేస్తాం ► అభివృద్ధి పేరుతో పేదల కడుపులు కొడుతున్నారు ► చంద్రబాబు చేస్తున్న దారుణాలు ఎండగడతాం సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో ఇళ్లు కోల్పోతున్న పేదల పక్షాన నిలబడి పోరాడతామని, వారికి న్యాయం చేసేంతవరకు రిలే నిరాహార దీక్షలు చేస్తామని, కోర్టు తలుపులు తడతామని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసానిచ్చారు. ఆయన సోమవారం కృష్ణాజిల్లా నూజివీడు వెళుతూ మార్గమధ్యలో విజయవాడ నగర శివారులోని రామవరప్పాడులో ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో గుడిసెలు కోల్పోయిన బాధితులను పరామర్శించారు. ‘‘అన్నా... టీడీపోళ్లు అభివృద్ధి పేరుతో దారుణాలు చేస్తున్నారు. ఆడోళ్లకు న్యాయం చేయాలని కూడా లేదు. ఈ ప్రభుత్వం ఏమి ప్రభుత్వం?’’ అంటూ బాధిత మహిళలు జగన్‌తో తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి ఆవేదన చూసి చలించిన జగన్ రోడ్డు కోసం పేదల గుడిసెలను తొలగిస్తున్న ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా విలేకర్లతో జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ... ఇక్కడ టీడీపీ కార్పొరేటర్ హోటల్‌ను కాపాడేందుకు ఫ్లై ఓవర్ అలైన్‌మెంట్‌ను మార్చేసి 120 ఇళ్లను తొలగించారని చెప్పారు. ఇప్పుడు మరో 500 ఇళ్లను తొలగించేందుకు నోటీసులు ఇచ్చారని ధ్వజమెత్తారు. నలభై, యాభై ఏళ్లుగా ఇక్కడ ఉంటున్న పేదలకు ముందుగా నోటీసులు ఇవ్వకుండా, కనీసం ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం ఇవ్వకుండా వారి కడుపులు కొడుతున్నారని దుయ్యబట్టారు. వారికి ఇష్టంలేకపోయినా బలవంతంగా వారి ఇళ్లు బుల్డోజర్లు పెట్టి తీసేస్తున్నారని, వారి మసీదులు కొట్టేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘చంద్రబాబు ఇలా వెళుతుంటే ఎక్కడా గుడిసెలు కనపడకూడదట. చిన్న చిన్న షాపులు కనపడకూడదట. పెద్దపెద్ద మాల్స్ మాత్రమే కనిపించాలట. అందుకే తమ ఇళ్లు కూల్చేస్తున్నారని పేదలు చెబుతున్నారు’’ అని వివరించారు. ఇదే కృష్ణా జిల్లాలో సనత్‌నగర్, తాడిగడప, యనమలకుదురు, రామవరప్పాడు, నిడమానూరు, నైనవరం అన్నిచోట్ల భూములు లాకుంటున్నారని, బాధితులకు ఒక రూపాయి కూడా నష్టపరిహారం ఇవ్వడం లేదని తెలిపారు. ప్రత్యామ్నాయం చూపించకుండా పేదల ఇళ్లు కూల్చడం ఏమిటని ప్రశ్నించారు. తమ చేతిలో అధికారం ఉందని దారుణాలు చేస్తున్న చంద్రబాబును ప్రజలు క్షమించరని, తాము పేదల పక్షాన నిలబడి పోరాడతామని, వారికి న్యాయం చేసేందుకు కోర్టులకు వెళతామని హెచ్చరించారు. మేకా సుజాతదేవికి నివాళులు సాక్షి, నూజివీడు: సతీవియోగంతో బాధపడతున్న నూజివీడు శాసనసభ్యుడు మేకా వెంకటప్రతాప్ అప్పారావుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రతాప్ సతీమణి మేకా సుజాతదేవి గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలుసుకున్న జగన్ ముందుగా ఫోన్లో పరామర్శించారు. అనంతరం విజయవాడ నుంచి సోమవారం ఉదయం 11.30 గంటలకు నూజివీడు చేరుకుని సుజాతదేవి పార్ధివ దేహంపై పూలమాలలు ఉంచి నివాళులర్పించారు. ప్రతాప్‌ను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రతాప్ కుమారుడు మేకా వేణుగోపాల అప్పారావు(చంటినాయన)ను, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని, ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఆ తరువాత 12.15 గంటలకు నూజివీడు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరివెళ్లారు. ముస్తాక్ అంత్యక్రియలకు హాజరు కానున్న జగన్ సాక్షి ప్రతినిధి, కర్నూలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం కర్నూలు జిల్లాకు రానున్నారు. సియాచిన్ ఘటనలో అమరుడైన కర్నూలు జిల్లా పార్నపల్లెకు చెందిన భారత జవాను ముస్తాక్ అహ్మద్(30) అంత్యక్రియల్లో ఆయన పాల్గొంటారు. అనంతరం ముస్తాక్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. అంత్యక్రియలకు ఎంపీ బుట్టా రేణుక, పార్టీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ఇతర జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా హాజరుకానున్నారు. -
కరగ్రహారం రైతులతో వైఎస్ జగన్ భేటీ
విజయవాడ: ప్రజల ఇష్టం లేకుండా బలవంతంగా భూములు తీసుకోలేరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వమే భూసేకరణ ఆర్డినెన్స్‌ను వెనక్కి తీసుకుందని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం కరగ్రహారంలో భూములు కోల్పోతున్న రైతులతో వైఎస్ జగన్ మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుబంధ పరిశ్రమల పేరుతో పంట భూములను లాక్కోవాలని ప్రయత్నిస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తామని వైఎస్ జగన్ అన్నారు. పోర్టు భూములకు పరిహారం ఎంతిస్తుందో ప్రభుత్వం స్పష్టం చేయాలని చెప్పారు. రైతులకు తాము అండగా ఉంటామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. -
రేపు కృష్ణా జిల్లాకు వైఎస్ జగన్