
కరగ్రహారం రైతులతో వైఎస్ జగన్ భేటీ
విజయవాడ: ప్రజల ఇష్టం లేకుండా బలవంతంగా భూములు తీసుకోలేరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వమే భూసేకరణ ఆర్డినెన్స్ను వెనక్కి తీసుకుందని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం కరగ్రహారంలో భూములు కోల్పోతున్న రైతులతో వైఎస్ జగన్ మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అనుబంధ పరిశ్రమల పేరుతో పంట భూములను లాక్కోవాలని ప్రయత్నిస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తామని వైఎస్ జగన్ అన్నారు. పోర్టు భూములకు పరిహారం ఎంతిస్తుందో ప్రభుత్వం స్పష్టం చేయాలని చెప్పారు. రైతులకు తాము అండగా ఉంటామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.