
పారాలింపిక్స్ విజేతలకు వైఎస్ జగన్ కంగ్రాట్స్
హైదరాబాద్: రియో పారాలింపిక్స్ లో పతకాలు సాధించిన అథ్లెట్లకు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. దీపా మలిక్, మరియప్పన్ తంగవేలు, వరుణ్ సింగ్ భటిలకు ఆయన అభినందనలు చెప్పారు. తృటిలో కాంస్య పతకం కోల్పోయినప్పటికీ పవర్ లిఫ్టర్ ఫర్మాన్ భాషా మంచి ప్రయత్నం చేశాడని ప్రశంసించారు. ‘దీపా మలిక్, మరియప్పన్ తంగవేలు, వరుణ్ సింగ్ భటిలకు అభినందనలు. ఫర్మాన్ మంచి ప్రయత్నం చేశాడు. పారాలింపిక్స్ లో మన అథ్లెట్లు చూపిన దృఢత్వం, అంకితభావం మనందరికీ గర్వకారణమ’ని వైఎస్ జగన్ మంగళవారం ట్వీట్ చేశారు.
ఇప్పటివరకు రియో పారాలింపిక్స్‌లో భారత్‌కు మూడు పతకాలు లభించాయి. పురుషుల హైజంప్‌లో మరియప్పన్ తంగవేలు స్వర్ణం, వరుణ్ సింగ్ భటి కాంస్యం నెగ్గారు. మహిళల షాట్‌పుట్ (ఎఫ్-53) ఈవెంట్‌లో భారత క్రీడాకారిణి దీపా మలిక్ రజత పతకాన్ని సొంతం చేసుకుంది. పురుషుల 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఫర్మాన్ నాలుగో స్థానంలో నిలిచి కొద్దిలో పతకం కోల్పోయాడు.
Congrats DipaMalik,Thangavelu,Bhati. Good attempt Farman. Proud of the grit & determination shown by all our athletes #ParalympicsRio2016
— YS Jagan Mohan Reddy (@ysjagan) 13 September 2016