జగన్ అంటే ఓ నమ్మకం
నక్కపల్లి,న్యూస్‌లైన్:
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల సాధనకు కార్యకర్తలంతా సైనికుల్లా పని చేయాతని వైఎస్సార్‌సీపీ నేత గుడివాడ అమర్‌నాథ్ పిలుపునిచ్చారు. వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారన్న నమ్మకం ప్రజల్లో గాఢంగా ఉందని, ప్రస్తుతం పార్టీ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. పార్టీలో చేరిన తర్వాత తొలిసారిగా ఆయన మంగళవారం నక్కపల్లి వచ్చారు. పార్టీ నాయకులు వీసం నానాజీ,సర్పంచ్ దేవవరపు దివాణం స్వాగతం పలికారు. మండలపరిషత్ వద్ద నామినేషన్ వేసేందుకు వచ్చిన కార్యకర్తలతో ఆయన ముచ్చటించారు.
ఈ సందర్భంగా అమర్ మాట్లాడుతూ ఎన్ని పార్టీలు కుట్రపన్నినా తమ విజయాన్ని అడ్డుకోలేవన్నారు. అన్ని పల్లెల్లోనూ పార్టీ జెండాలు రెపరెపలాడాలని, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలన్నింటినీ గెల్చుకుని తద్వారా సార్వత్రిక ఎన్నికల్లోనూ సత్తా చాటాలన్నారు. రాష్ట్రాన్ని సమర్థంగా పాలించే సత్తా జగన్‌కే ఉందన్నారు. ప్రజలంతా ఆయన సీఎం కావాలని కోరుకుంటున్నారన్నారు. దివంగత వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తమపార్టీకి శ్రీరామరక్ష అన్నారు.
చంద్రబాబునాయుడువన్నీ బూటకపు హామీలేనని, వాటిని నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. చంద్రబాబుకు వెన్నుపోటుతప్ప ప్రజాసంక్షేమం తెలియదన్నారు. ఆయన వెంట లొడగల చంద్రరావు, వెలగా ఈశ్వరరావు, పోతంశెట్టి బాబ్జి, కరణం ఈశ్వరరావు, లచ్చబాబు, ఎల్లేటి సత్యనారాయణ, బంగార్రాజు, కొల్నాటి తాతాజీ, తోట సత్తిబాబు, నాగేశ్వరరావు, కనకేశ్వరరావు పాల్గొన్నారు.