జీఎస్టీ నుంచి చేనేతను మినహాయించండి
చేనేత రంగంపై జీఎస్టీ భారం వేస్తే... ఆ ప్రభావం కార్మికులందరిపైనా పడుతుంద న్నారు. జీఎస్టీ వల్ల వస్త్ర దుకా ణాలను మూసివేయాల్సిన పరిస్థితి వస్తుందని వ్యాపారుల్లో ఆందోళన నెల కొందన్నారు. కేవలం మూడు, నాలుగు శాతం లాభాలతో అమ్ముకునే వ్యాపా రులపై జీఎస్టీ వల్ల అధిక శాతం పన్ను పడుతోందన్నారు. పెరిగిన రసాయనాలు, నూలు ధరలతో ఇప్పటికే కొన ఊపిరితో ఉన్న చేనేత రంగం జీఎస్టీ పన్నులతో పూర్తిగా కనుమరుగు అవు తుందన్నారు. జీఎస్టీ నుంచి మినహాయింపు ఇస్తే ఉత్పత్తులు మరింత పెరిగే వీలుందని, కార్మికులకు ఊరట కలుగుతుందని జగన్ తన లేఖలో నివేదిం చారు. వైఎస్ జగన్ రాసిన లేఖను వైఎస్సార్‌సీపీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చిల్లపల్లి మోహన్‌రావు విజయవాడలో మీడియాకు విడుదల చేశారు.