సాక్షి, నర్సీపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 241వ రోజు షెడ్యూలు ఖరారైంది. రాజన్న బిడ్డ చేపట్టిన పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. సోమవారం ఉదయం జననేత నర్సీపట్నం నియోజకవర్గం ధర్మసాగరం క్రాస్ శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి పాయకరావుపేట నియోజకవర్గంలోని యండ్లపల్లి మీదుగా జల్లూరు వరకు పాదయాత్ర కొనసాగుతుంది. అక్కడ వైఎస్ జగన్ లంచ్ విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో పాదయాత్ర పునః ప్రారంభమవుతుంది. పాత తంగేడు, తంగేడు క్రాస్, కోటవూరట్ల మీదుగా కైలాసపురం వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.
ముగిసిన పాదయాత్ర: వైఎస్ జగన్ 240వ రోజు పాదయాత్ర ఆదివారం నర్సీపట్నం నియోజకవర్గంలోని ధర్మాసాగరం క్రాస్ వద్ద ముగిసింది. నేడు సుబ్బరాయుడు పాలెం, చంద్రయ్య పాలెం, వజ్రగడ క్రాస్, తమ్మయ్య పాలెం, జోగివాని క్రాస్ మీదుగా ధర్మసాగరం క్రాస్ వరకు జననేత పాదయాత్ర కొనసాగింది. టీడీపీ పాలనలో గత నాలుగేళ్లుగా తాము పడుతున్న ఇబ్బందులను ప్రజలు వైఎస్ జగన్‌కు దృష్టికి తీసుకువచ్చారు. 108, 104 ఉద్యోగులు జననేతను కలిసి తమ సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment