సాక్షి, కర్నూలు : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 24వరోజు ప్రజాసంకల్పయాత్ర ముగిసింది. ఆయన ఇవాళ మొత్తం 15.6 కిలోమీటర్లు నడిచారు. శనివారం ఉదయం పత్తికొండ మండల కేంద్ర శివారులో ప్రారంభమైన పాదయాత్ర.....భోజన విరామ సమయానికి తుగ్గలి మండలం రాతల గ్రామానికి చేరుకుంది. ఆ తర్వాత తుగ్గలి, గిరిగిట్ల గ్రామాల మీదుగా సాగిన పాదయాత్ర.. మదనంతపురం వద్ద ముగిసింది. కాగా పత్తికొండ నియోజకవర్గంలో సాగిన ప్రజాసంకల్పయాత్రలో ప్రతిపక్షనేతకు ప్రతిచోట ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
తమ గ్రామాలకు వస్తున్న జగన్‌కు పలుచోట్ల ప్రజలు కష్టాలు, బాధలను చెప్పుకున్నారు. తుగ్గలివద్ద మాదాసి , మాదారి కురువలు జగన్ను కలిసి తమను ఎస్సీల్లో చేర్చాలని వినతిపత్రం సమర్పించారు. పత్తిరైతులు, రైతు కూలీలు, నర్సరీల కూలీలు, వికలాంగులు, వృద్ధులు ఇలా ప్రతిఒక్కరూ జగన్ ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. అందరి కష్టాలు ఒపికగా విన్న జగన్.. వచ్చేది రాజన్న రాజ్యమేనని...అందరి కష్టాలు తొలిగిపోతాయంటూ భరోసా నిచ్చారు.
25వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
వైఎస్ జగన్ 25వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్ ఖరారు అయింది. ఆదివారం ఉదయం ఆయన పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలం మదనంతపురం నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. జొన్నగిరి, ఎర్రగుడి మీద తుగ్గలి చేరుకుంటారు. అక్కడ భోజన విరామం తీసుకుంటారు. భోజన విరామం అనంతరం తుగ్గలి నుంచి యాత్రను పున: ప్రారంభిస్తారు. అక్కడ నుంచి చెరువు తొండకు చేరుకుని, రాత్రికి అక్కడే బస చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment