మీ ఓటుతోనే మీ రాత మార్పు: సీఎం వైఎస్‌ జగన్‌ | CM Jagan Public Interaction Speech At Tuggali Memantha Siddham | Sakshi
Sakshi News home page

మీ ఓటుతోనే మీ రాత మార్పు: సీఎం వైఎస్‌ జగన్‌

Published Sun, Mar 31 2024 2:58 AM | Last Updated on Sun, Mar 31 2024 7:19 AM

CM Jagan Public Interaction Speech At Tuggali Memantha Siddham - Sakshi

కళ్లెదుట కనిపిస్తున్న అభివృద్ధిని ఇంటింటా వివరించండి

పత్తికొండ నియోజకవర్గం తుగ్గలిలో ప్రజలతో ముఖాముఖిలో సీఎం వైఎస్‌ జగన్‌ 

ఈ 58 నెలల పాలనలో ఊరూరా సంక్షేమాభివృద్ధి

ఇదివరకెన్నడూ లేని విధంగా ఇంటింటికీ లబ్ధి

సచివాలయ, వలంటీర్‌ వ్యవస్థ ద్వారా విప్లవాత్మక మార్పులు

రైతులు, అవ్వాతాతలకు అండగా నిలిచాం

అక్కచెల్లెమ్మల నుంచి విద్యార్థుల వరకు అందరికీ మంచి చేశాం..  మీ ఊళ్లో సచివాలయం, ఆర్బీకే, విలేజ్‌ క్లినిక్‌లు నిర్మించి పాలన మీ ఇంటికే తెచ్చాం

మరింత మంచి చేసేందుకు మీ బిడ్డను ఆశీర్వదించండి

సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘గత ప్రభుత్వానికి, మనందరి ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడా ఏమిటో ఊరూరా స్పష్టంగా కనిపిస్తోంది. విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మార్పులు కొనసాగడం చాలా అవసరం. ఈ ఎన్నికల్లో ఓటు వేసేది కేవలం ఎంపీ, ఎమ్మెల్యేను ఎన్నుకునేందుకు మాత్రమే కాదు. జరుగుతున్న మార్పును కొనసాగించేందుకే అన్నది ప్రధానం. ఈ మార్పులు కొనసాగితేనే పేదవాడి బతుకులు మారతాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.

నేను చెప్పిన మాటల్లో వాస్తవం ఉందనుకుంటేనే మీ బిడ్డకు అండగా నిలిచి ఓటు వేయాలని కోరుతున్నా. జరిగిన మేలును ఇంటింటా చెప్పాలి’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘మేమంతా సిద్ధం’ పేరుతో నిర్వహిస్తున్న బస్సు యాత్ర నాలుగో రోజు శనివారం కర్నూలు జిల్లాలోని పత్తికొండ నియోజకవర్గంతో పాటు అనంతపురం జిల్లాలోనూ కొనసాగింది. తుగ్గలిలో తుగ్గలి, రాతన గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వం అందించిన సంక్షేమాభివృద్ధిపై రెండు గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేసి ఆశీస్సులు తెలిపారు. ‘మళ్లీ ముఖ్యమంత్రిగా నువ్వే రావాలన్నా.. మళ్లీ సీఎంగా ఇక్కడికి రావాలి’ అంటూ మహిళలు, రైతులు, విద్యార్థులు హర్షధ్వానాల మధ్య మూకుమ్మడిగా నినదించారు. ‘రెండు గ్రామాల పరిధిలో 10 వేల జనాభా ఉన్నారు. గ్రామస్తులంతా కలిసికట్టుగా ఏకమయ్యారు. అందరినీ ఒకటే కోరుతున్నా. ఇంతకు ముందు ప్రభుత్వాలను చూశారు.



ఇవాళ మన ప్రభుత్వాన్నీ చూస్తున్నారు. మీరు ఇంతకు ముందు చూడని విధంగా మన ప్రభుత్వ హయాంలోని 58 నెలల్లో ప్రస్ఫుటమైన మార్పులు కన్పింస్తున్నాయి. ఇలాంటి విప్లవాత్మక మార్పులు గత ప్రభుత్వాల్లో ఎందుకు కన్పింంచలేదు? తుగ్గలి, రాతన సచివాలయ పరిధిలోని గ్రామాల్లో కూడా గొప్ప మార్పు కన్పింస్తుండటం పట్ల ప్రతి ఒక్కరూ ఆలోచించాలి’ అని సీఎం కోరారు. ఈ ముఖాముఖిలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..  

రెండు గ్రామాల అక్క చెల్లెమ్మలకు రూ.56.24 కోట్లు   
► తుగ్గలి సచివాలయ పరిధిలో 1,748, రాతన సచివాలయ పరిధిలో 1,569 ఇళ్లు ఉన్నాయి. తుగ్గలిలో 1,666 ఇళ్లకు, రాతనలో 1,486 ఇళ్లకు అంటే 95 శాతం ఇళ్లకు మీ బిడ్డ బటన్‌ నొక్కి అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పంపారు. ఎక్కడా లంచాలు, వివక్ష, కులం, రాజకీయం, చివరకు గత ఎన్నికల్లో మనకు ఓటు వేయకపోయినా ఫర్వాలేదనుకుని.. అర్హత ఉన్న వారందరికీ మేలు చేశాం. రెండు గ్రామాల అక్క చెల్లెమ్మలకు రూ.56.24 కోట్లు లబ్ధి కలిగించాం. 

► గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు రాజ్యమేలుతున్న పరిస్థితుల్లో చివరకు మరుగుదొడ్లు కావాలన్నా లంచాలు అడిగే పరిస్థితి. చివరకు పింఛన్, సబ్సిడీ రుణాలు కావాలన్నా లంచాలే. ఆ రోజుల్లో ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూపాయి లంచాలు లేకుండా మీకు అందిందని ఎవరైనా చెబుతారా? (లేదు...లేదు అని జనాలు చేతులు అడ్డంగా ఊపారు) తుగ్గలిలో 5,200 జనాభా ఉన్న సచివాలయ పరిధిలో ఈ 58 నెలల్లో రూ.29.65 కోట్లు ఇచ్చాం. ఈ సంఖ్యలు చెబుతుంటే ఆశ్చర్యంగా లేదా.. అని అడుగుతున్నా. రాతనలో 4,888 జనాభా ఉంటే రూ. 26.59 కోట్లు ఇచ్చాం. ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా నా ఆడబిడ్డల ఖాతాల్లో నగదు జమ చేశాం.   

► అమ్మఒడి పథకం ద్వారా తుగ్గలిలో రూ.2.91 కోట్లు, రాతనలో రూ.2.50 కోట్లు.. రెండింటికీ కలిపి రూ.5.41 కోట్లు ఇచ్చాం. చేయూత ద్వారా తుగ్గలిలో రూ.2.30 కోట్లు, రాతనలో రూ.2.19 కోట్లు.. రెండు గ్రామాల్లో కలిపి రూ.4.49 కోట్లు అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్లాయి. విద్యాదీవెన ద్వారా తుగ్గలిలో రూ.1.16 కోట్లు, రాతనలో రూ.1.26 కోట్లు.. మొత్తంగా రూ.2.42 కోట్లు జమ చేసి, పిల్లలు మంచి చదువులు చదవాలని, తల్లిదండ్రులపై భారం పడకుండా చూశాం.  

► జగనన్న వసతి దీవెన ద్వారా తుగ్గలిలో రూ.51 లక్షలు, రాతనలో రూ.54 లక్షలు.. ఆసరా ద్వారా తుగ్గలిలో రూ.1.95 కోట్లు, రాతనలో రూ.65 లక్షలు ఇచ్చాం. మన ప్రభుత్వం రాక ముందు పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల పరిస్థితి దారుణం. అప్పట్లో 18 శాతం నాన్‌ పర్ఫార్మెన్స్‌ అసెట్స్, అవుట్‌ స్టాండింగ్‌ లోన్లు ఉండి అక్క చెల్లెమ్మల బతుకులు కుదేలైన పరిస్థితుల్లో ఆసరా ద్వారా అదుకున్నాం. ఈ ఒక్క పథకం ద్వారానే ఈ గ్రామాలకు రూ.2.60 కోట్లు ఇచ్చాం. సున్నా వడ్డీ ద్వారా రాతనలో రూ.15 లక్షలు, తుగ్గలిలో రూ.60 లక్షలు ఇచ్చి మంచి చేశాం. ఇళ్ల విషయానికొస్తే తుగ్గలిలో 66, రాతనలో 122 ఇళ్లు ఇచ్చాం. వైఎస్సార్‌ కళ్యాణమస్తు, షాదీతోఫా ద్వారా తుగ్గలిలో రూ.3 లక్షలు, రాతనలో రూ.4.8 లక్షలు ఇచ్చాం. 

► అవ్వాతాతలకు రాతనలో రూ.7.54 కోట్లు, తుగ్గలిలో రూ.7.58 కోట్లు పింఛన్ల ద్వారా అందించాం. రైతులకు వైఎస్సార్‌ రైతు భరోసా ద్వారా తుగ్గలిలో రూ.6.15 కోట్లు, రాతనలో రూ.5.49 కోట్లు ఇచ్చాం. ఇలా అన్ని పథకాల ద్వారా మేలు చేశాం. గాంధీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం ప్రతీ గ్రామంలో చూపిస్తామని, ప్రతి 60–70 ఇళ్లకు వలంటీర్‌ను పెట్టాం. 

వారు ప్రతి పథకాన్ని నేరుగా మీ చేతుల్లో పెట్టి వెళుతున్నారు. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీలో గతానికి భిన్నంగా మార్పు జరుగుతోంది. తుగ్గలిలో ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా ద్వారా రూ.98 లక్షలు ఇచ్చాం. ఉచితంగా వైద్యం అందించాం. రాతనలో రూ.84 లక్షలు ఇచ్చాం. ఈ మార్పులను అందరూ గమనించాలి.  

మన వద్దే రూ.3 వేల పింఛన్‌
మన ప్రభుత్వం రాక ముందు చంద్రబాబు పాలనలో పింఛన్‌ రూ.వెయ్యి మాత్రమే ఇచ్చాడు. మీ బిడ్డ హయాంలో పింఛన్‌ రూ.3 వేలు. ఇంత పింఛన్‌ ఇచ్చే రాష్ట్రం దేశంలో మరొకటి లేదు. పింఛన్ల కు ఏడాదికి రూ.24 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. మన తర్వాత తెలంగాణ రూ.12 వేల కోట్లు ఇస్తోంది. ఆపై 3, 4 స్థానాల్లో ఉన్న రాష్ట్రాల్లో ఏడాదికి పింఛన్‌ కోసం రూ.8 వేల కోట్లు, రూ.6 వేల కోట్లు ఇస్తున్నారు.

ఒడిశా, యూపీలో రూ.500 పింఛన్‌ ఇస్తున్నారు. మీ బిడ్డ ప్రభుత్వానికి అవ్వాతాతలు, వితంతువులపై ఎంత ప్రేమ ఉందో చెప్పేందుకు ఇది ఉదాహరణ మాత్రమే. మనం రాకముందు రాష్ట్రంలో పింఛన్‌లు 39 లక్షలు ఉంటే మీ బిడ్డ ప్రభుత్వం వచ్చాక 66 లక్షలకు తీసుకెళ్లాం. ఇందులో ఏకంగా 45 లక్షల పింఛన్లు నా అక్కచెల్లెమ్మలు, అవ్వలకే ఇస్తున్నాం. ఇంకా లోటుపాట్లు సవరించుకుని మంచి పాలన అందించేందుకు సలహాల కోసం మీ వద్దకు వచ్చాను. 

ఆరోగ్యశ్రీతో పేదవాడికి పెద్ద వైద్యం
రెండేళ్ల కిందట మా నాన్న రెండు కిడ్నీలు ఫెయిల్‌ అయ్యాయి. డయాలసిస్‌ చేయాలని చెప్పారు. కర్నూలులోని గౌరీగోపాల్‌ హాస్పిటల్‌కు వెళ్లండని చెప్పారు. ఎంతో డబ్బు ఉంటేనే అక్కడ వైద్యం చేయించుకోగలరు. అలాంటి ఆస్పత్రిలో మా నాన్నకు ఉచితంగా డయాలసిస్‌ జరిగింది. అది ఆరోగ్యశ్రీ వల్లే సాధ్యమైంది. ఆ తర్వాత మా నాన్నకు కిడ్నీ మార్పిడి చికిత్సను కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చేయించుకోగలిగాం. ఆరోగ్యశ్రీ తర­ఫున అధికారులు మాకు వెన్నంటి ఉండి ఎంతో సాయం చేశారు. మీరు మా ఇంటి పెద్దగా మాకు అన్నీ చేశారు. అందుకే మిమ్మల్ని మా పెద్దన్నగా భావిస్తున్నాం.  
– జనార్ధన్‌రెడ్డి, చెన్నంపల్లి, అవుకు, నంద్యాల జిల్లా 

పాలనలో తేడాను గుర్తించాలి
మా నాన్నకు రెండు లంగ్స్‌ దెబ్బతిన్నాయి. పెద్ద ఆస్పత్రికి వెళ్తే రూ.4 లక్షలు ఖర్చు అవుతాయి అన్నారు. కానీ ఆరోగ్యశ్రీ ద్వారా మా నాన్నకు ట్రీట్‌మెంట్‌ జరిగింది. ఇప్పుడు మా నాన్న ఆరోగ్యంగా ఉన్నాడు. మీ పాలనలో అందరికీ అన్ని పథకాలూ అందుతున్నాయి. బాబు పాలనకు, జగనన్న పాలనకు తేడా గమనించాలని రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.                   
– నరేష్, రాతన గ్రామం  

రెండు గ్రామాల అభివృద్ధి ఇలా.. 
► గ్రామంలో అడుగు పెడుతూనే సచివాలయం కన్పింంచింది. గతంలో ఇది లేదు. ఈ 58  నెలల కాలంలోనే వచ్చింది. వలంటీర్లు సేవలు అందిస్తున్నారు. మరో నాలుగు అడుగులు ముందుకేస్తే ఆర్బీకే ఉంది. ఓ అగ్రికల్చర్‌ గ్రాడ్యుయేట్‌ అక్కడే ఉంటున్నారు. విత్తనం నుంచి పంట కొనుగోలు దాకా ప్రతి దశలో రైతన్నకు అండగా నిలుస్తున్నారు. ఇంతకు ముందు రైతన్నలు బ్యాంకుకు వెళ్లి క్రాప్‌లోన్‌ తీసుకుంటేనే పంటలకు ఇన్సూ్యరెన్స్‌ చేసేవారు. లోన్లో రూ.లక్షకు రూ.5వేలు కట్‌ చేసి ఇచ్చేవారు.  

► ఇవాళ ప్రతి ఎకరా ఈ క్రాప్‌ చేశాం. ఉచితంగా పంటల బీమా అమలు చేస్తున్నాం. పెట్టుబడి సాయంగా రైతు భరోసా ఇస్తూ రైతన్నకు సాయంగా ఉంటున్నాం. ఇక్కడే ప్రభుత్వ బడి కన్పింస్తోంది. తొలిసారి నాడు–నేడుతో రూపురేఖలు మారాయి. ఇంగ్లిష్‌ మీడియం వచ్చింది. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు ఇచ్చాం. 6వ తరగతి నుంచి ఐఎఫ్‌బీ ప్యానల్‌ ద్వారా డిజిటల్‌ బోధన కల్పించాం. కార్పొరేట్‌ స్కూళ్లు కూడా ప్రభుత్వంతో పోటీ పడాల్సిన పరిస్థితులు గ్రామంలో కన్పింస్తున్నాయి.  

► ప్రజలు ఏ ఒక్కరూ వైద్యం కోసం అప్పులపాలు కాకూడదని మార్పులు తెచ్చాం. విలేజ్‌ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్‌్టతో అనుసంధానం చేశాం. 15 రోజులకు ఒకసారి వచ్చి చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్య సురక్ష ప్రతి ఆర్నెళ్లకు ఓసారి జరుగుతోంది. ప్రతి ఇంటిని జల్లెడ పట్టి వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఉచితంగా మందులు ఇస్తున్నారు. ఆరోగ్యశ్రీ పరిధిని వెయ్యి రోగాల నుంచి 3,330 దాకా పెంచాం. ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందిస్తున్నాం. ఈ మార్పులన్నింటికీ మనందరి ప్రభుత్వమే కారణం అని గమనించాలి.  

పింఛన్‌ కోసం పడిగాపులు లేవు 
పింఛన్‌ కోసం రెండు, మూడు రోజులు బయట ఉండేవాళ్లం. గతంలో మా వికలాంగుల్లోనే వైకల్యానికి పర్సెంటేజీ ప్రకారం తేడా చూపించేవాళ్లు. జగనన్న వచ్చాక ఆ తేడా లేకుండా రూ.3 వేల పింఛన్‌ ఇస్తున్నారు. ఇప్పుడు నేరుగా ఇంటికే పింఛన్‌ అందిస్తున్నారు. పడిగాపులు అసలే లేవు. అందుకు జగనన్నకు ధన్యవాదాలు. జై జగన్‌. 
– రంగమ్మ, రాతన, తుగ్గలి మండలం, కర్నూలు జిల్లా  

మీ సాయం మరువలేం  
అన్నా.. నేను ట్రాన్స్‌కో­లో పనిచేసేవాడిని. ప్రమాదంలో పైనుంచి పడి నడుం విరిగింది. డోన్‌ సభలో నన్ను పిలిచి మీరు రూ.5 లక్షలు సాయం చేశారు. మా నాన్నకు రూ.3 వేలు పింఛన్‌ అందిస్తున్నారు. మీ మేలు మరచిపోలేను. మిమ్మల్ని చూసేందుకే నా కుటుంబం అంతా ఉదయం 6 గంటలకే ఇక్కడకు వచ్చి ఎదురు చూస్తున్నాం. మీతో ఒక్క ఫొటో తీసుకుని మా ఇంట్లో పెట్టుకోవాలన్నా.     
– బలరాం నాయక్, దివ్యాంగుడు, తుగ్గలి 

మా స్కూల్‌ భలే బావుంది 
జగన్‌ మామా.. నాడు–నేడు ద్వారా మా స్కూల్‌ను మీరు ఎంతో బాగా తయారు చేయించారు. మధ్యాహ్నం భోజనంలో కోడిగుడ్డు, చిక్కీ బాగా పెడుతున్నారు.  (బాబు తండ్రి లాల్‌బాషా మాట్లాడుతూ..) ‘నాకు హార్ట్‌స్ట్రోక్‌ వచ్చిందన్నా.. మా ఎమ్మెల్యే శ్రీదేవమ్మ సాయంతో ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్‌ చేయించుకుని బయటపడ్డాను.
 – జుబేర్, 7వ తరగతి విద్యార్థి, హోసూరు, పత్తికొండ మండలం 

మా ఊళ్లో జెండా ఎగరేస్తాం 
అన్నా.. నీ ఓదార్పు యాత్ర మొదలు నేటి ‘మేమంతా సిద్ధం’ యాత్ర వరకు 100 కార్యక్రమాల్లో నేను పాల్గొన్నా. పోలీసులు అడ్డుపడినా ఆగలేదు. నాకు కళ్లు లేవు. ఒక్కసారి నీ చేయి తాకాలని ఆశ పడుతున్నా. మా శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థిగా వీరాంజనేయులు అనే ఓ టిప్పర్‌ డ్రైవర్‌ను పెట్టారని చంద్రబాబు అంటున్నాడు. టిప్పర్‌ వచ్చి గుద్దితే సైకిల్‌ ఉంటుందా.. చంద్రబాబూ!  శింగనమలలో జూన్‌ 4వ తేదీన గెలిచి,మా జెండా ఎగరేస్తాం.
– వినోద్‌ కుమార్, అమ్మవారి పేట, అనంతపురం జిల్లా  

మీరు నా సోదరుడు 
అన్నా.. నా భర్త ఆరోగ్యమిత్రలో ఉద్యో­గిగా చేస్తూ మరణించాడు. నాకు మీ పాలనలో అన్ని పథకాలు వచ్చాయి. అమ్మ ఒడి, విద్యా దీవెన, రైతు భరోసా పథకాలు అన్నీ అందాయి. డిగ్రీ చదివిన నాకు ఓ చిన్న ఉద్యోగం ఇప్పిస్తే మీ కెంతో రుణ పడి ఉంటానన్నా. మిమ్మల్ని నా అన్నగా అనుకొని ఈ సాయం అర్థిస్తున్నాను.  
 – సరస్వతి, తుగ్గలి  

ఎప్పటికీ మీరే సీఎం  
జగన్‌ సార్‌.. నేను పేదరాలిని. నాకు రైతు భరోసా, చేయూత, ఆసరా, ఇంటి పట్టా అన్ని పథకాలు వచ్చాయి. జగనన్న తోడు కూడా వచ్చింది. మా కలలన్నీ నిజమయ్యాయి. మాకు ఎవరూ వద్దు.. మీరే మళ్లీ సీఎంగా రావాలి. అందరికీ ఎంతో మేలు చేసిన మీరే సీఎంగా ఉండాలి. 
– శ్యామల, రాతన, కర్నూలు జిల్లా   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement