ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ‘కిట్లు’ | YS Jagan Review Meeting With Education Ministry Officials | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ‘కిట్లు’

Published Fri, Nov 29 2019 5:02 AM | Last Updated on Fri, Nov 29 2019 5:02 AM

YS Jagan Review Meeting With Education Ministry Officials - Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు స్కూలు బ్యాగు, నోట్‌ బుక్స్, టెక్ట్స్‌ బుక్స్, 3 జతల యూనిఫారాలు, జత బూట్లు, సాక్సులతో కూడిన కిట్లు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి వీటిని సమకూరుస్తారు. గతంలో ప్రకటించిన దానికంటే అదనంగా స్కూలు బ్యాగు, నోట్‌ బుక్స్‌ కిట్‌లో చేర్చారు. యూనిఫారాల కుట్టుకూలీ, జత షూస్, సాక్సుల కొనుగోలు కోసం డబ్బులు ఇవ్వనున్నారు. మిగిలిన వాటిని కిట్ల రూపంలో అందిస్తారు. పాఠశాల విద్య, మధ్యాహ్న భోజన పథకంపై సీఎం వైఎస్‌ జగన్‌ గురువారం విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పాఠశాలలు ప్రారంభించేనాటికి వీటిని విద్యార్థులకు అందించాలని ఆదేశించారు.  

విద్యార్ధులకు తొలుత బ్రిడ్జి కోర్సులు
వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా నూతన పాఠ్యప్రణాళిక రూపకల్పనపై ముఖ్యమంత్రి జగన్‌ అధికారులతో చర్చించారు. ఆంగ్ల మాధ్యమంలోకి పిల్లలను సన్నద్ధం చేసేందుకు తొలుత బ్రిడ్జి కోర్సులను నిర్వహిస్తామని అధికారులు వివరించారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన మొదటి నెల రోజుల పాటు విద్యార్థులకు బ్రిడ్జి కోర్సులు చేపట్టాలని అధికారులు ప్రతిపాదించగా పకడ్బందీగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. టీచర్లకు శిక్షణ, పిల్లలకు బ్రిడ్జి కోర్సులపై పూర్తిస్థాయి వివరాలతో ప్రజంటేషన్‌ ఇవ్వాలని సీఎం ఆదేశించారు.

దేశమంతా మనవైపు చూస్తోంది
పటిష్ట పాఠ్యప్రణాళిక, అంతర్జాతీయ విద్యాసంస్థల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ప్రమాణాలు నెలకొల్పుతామని సీఎం పేర్కొన్నారు. గణితాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి చికాగో యూనివర్శిటీ రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామి కానుందని చెప్పారు. ఉపాధ్యాయులకు శిక్షణ, ఆంగ్ల మాధ్యమంలో బోధన తదితర అంశాల్లో బ్రిటిష్‌ కౌన్సిల్‌  సహకారం అందిస్తుందని వివరించారు. విద్యావ్యవస్థలో తెస్తున్న మార్పులతో దేశమంతా ఏపీ వైపు చూస్తోందన్నారు.


మధ్యాహ్న భోజనం జాగ్రత్త!
మధ్యాహ్న భోజనం నాణ్యత దెబ్బ తినకూడదని సమీక్ష సందర్భంగా సీఎం స్పష్టం చేశారు. ‘మధ్యాహ్న భోజన బకాయిలు లేకుండా చూస్తున్నాం. ఈ పథకంలో తల్లిదండ్రుల కమిటీలకు భాగస్వామ్యం కలి్పంచాలి. నాడు –నేడు కార్యక్రమం, స్కూళ్ల నిర్వహణలో తల్లిదండ్రుల కమిటీలకు భాగస్వామ్యం కలి్పస్తున్నాం’ అని పేర్కొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement