
సాక్షి, తాడేపల్లి : శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రజలు భౌతిక దూరాన్ని పాటిస్తూ శ్రీరామనవమి వేడుకలు ఇంటింటా జరుపుకోవాలని కోరారు. శ్రీసీతారాముల దీవెనలతో రాష్ట్ర ప్రజలకు శుభాలకు కలగాలని సీఎం వైఎస్ జగన్ అభిలాషించారు.
తెలుగు ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. కరోనా నేపథ్యంలో ఈ పండుగను ప్రజలందరూ ఇళ్లల్లోనే ఉంటూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, శ్రీరాముడి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా.
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 2, 2020