రాజ్‌భవన్‌లో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో భేటీ అయిన సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో గంటన్నరపాటు సమావేశమయ్యారు. రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. కరోనా వైరస్ సాకుతో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.
ఎన్నికలను వాయిదా వేయాల్సినంతటి తీవ్ర పరిస్థితి లేదని వివరించారు. కనీసం సీఎస్, వైద్య, ఆరోగ్య శాఖకార్యదర్శులను సంప్రదించకుండానే ఎన్నికల కమిషనర్ ఈ నిర్ణయం ఏకపక్షంగా తీసుకున్నారని వెల్లడించారు. మార్చి 31లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోతే 14వ ఆర్థిక సంఘం నిధులు దాదాపు రూ.5 వేల కోట్లు రాష్ట్రానికి రాకుండాపోయే ప్రమాదం ఉందని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను పిలిపించి, ఈ అంశంపై మాట్లాడి, వెంటనే ఎన్నికలు నిర్వహించేలా చూడాలని గవర్నర్‌ను సీఎం కోరారు. దీనిపై గవర్నర్ సానుకూలంగా స్పందించి, తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment