తుపాను ప్రభావంపై విజయమ్మ, జగన్‌ల ఆరా | ys jaganohan reddy and ys vijayamma enquiry about cyclone effect | Sakshi
Sakshi News home page

తుపాను ప్రభావంపై విజయమ్మ, జగన్‌ల ఆరా

Published Sun, Oct 13 2013 3:55 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

ys jaganohan reddy and ys vijayamma enquiry about cyclone effect

 శ్రీకాకుళం, న్యూస్‌లైన్ : జిల్లాలో పై-లీన్ తుపాను ప్రభావంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ, అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. శనివారం నరసన్నపేట శాసనసభ్యుడు, పార్టీ జిల్లా కన్వీనర్ ధర్మాన కృష్ణదాస్‌తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. సహాయ కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు చురుకుగా పాల్గొనేలా చూడాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు పార్టీ నాయకులను సమన్వయ పరుచుకొని సహాయ కార్యక్రమాలు చేపట్టాలని సూచిం చారు. పార్టీ నేత ఎం.వి.మైసూరారెడ్డి కూడా కృష్ణదాస్‌తో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. అగ్రనేతల ఆదేశాల మేరకు జిల్లా నాయకులతో కృష్ణదాస్ పరిస్థితిని సమీక్షించి తగిన సూచనలిచ్చారు.
 
 పార్టీ నేతల సహాయ కార్యక్రమాలు
 ఇచ్ఛాపురంలో పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు ఎం.వి.కృష్ణారావు, శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి పిరియా సాయిరాజ్‌లు, పలాస నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్తలు వజ్జబాబూరావు, కణితి విశ్వనాథంలు బాధితులకు భోజన సౌకర్యం కల్పిం చారు. ఉదయం అల్పాహారం, బిస్కెట్ ప్య్యాకెట్లు పంపిణీ చేశారు. టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, సీఈసీ సభ్యురాలు ధర్మాన పద్మప్రియ, శ్రీకాకుళం నియోజకవర్గ సమన్వయకర్తలు వై.వి.సూర్యనారాయణ, వరుదు కల్యాణి, ఎచ్చెర్ల నియోజకవర్గ సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్, పార్టీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్ బల్లాడ హేమమాలినీరెడ్డి, మాజీ ఎంపీపీ బల్లాడ జనార్దనరెడ్డి లు ఆయా నియోజకవర్గాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. పునరావాస కేంద్రాల్లోని బాధితులను పరామర్శించారు. ఏ సహాయం కావాలన్నా అందుబాటులో ఉంటామని భరోసా ఇచ్చారు. వీరితోపాటు పార్టీ కార్యకర్తలు కూడా తుపాను ప్రభావిత  ప్రాంతాల్లో పర్యటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement