యడవల్లి (ముదిగొండ), న్యూస్‌లైన్: దివంగత ముఖ్యమంత్రి, జననేత వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు.. ఆయనను జనం గుండెల్లో శాశ్వతంగా నిలిపాయని వైఎస్‌ఆర్ సీపీ నేత, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన గురువారం రాత్రి యడవల్లి గ్రామంలో వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి, పూలమా ల వేసి నివాళులర్పించా రు. అనంతరం, పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మోర్తాల నాగార్జునరె డ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పొంగులేటి మాట్లాడుతూ.. జిల్లాలోని తాగునీరు తదితర సమస్యలను బాధ్యతగల ప్రజాప్రతినిధి పట్టించుకోకుండా ‘మధురోత్సవా లు’ పేరుతో సంబరాలు చేసుకోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
రానున్న ఎన్నికల్లో వైఎస్‌ఆర్ సీపీకి అనుకూలంగా ప్రజలు తీర్పునిస్తారని అన్నారు. అనంత రం, అనారోగ్యంతో బాధపడుతున్న విశ్రాం త వీఆర్‌ఓ ఎరకల రామయ్యను పొంగులేటి పరామర్శించారు. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో, సమావేశంలో పార్టీ రాష్ట్ర సేవాదళ్ నాయకుడు దారెల్లి అశోక్‌కుమార్, మండల కన్వీనర్ మరికంటి గురుమూర్తి, కార్మిక విభాగం కన్వీనర్ పాదర్తి రాంప్రసా ద్, బీసీ కన్వీనర్ గడ్డం అంజయ్య గౌడ్, సేవాదళ్ కన్వీనర్ మరికంటి సత్యనారాయణ, సర్పంచులు బత్తుల వీరారెడ్డి, పడిశాల భద్ర య్య, శెట్టిపల్లి రమాదేవి, జిల్లా నాయకులు అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, కత్తుల శ్యామలరావు, లంకె ల బ్రహ్మారెడ్డి, ఆకుల మూర్తి, జూల కంటి సంజీవరెడ్డి, మట్టా గోవిందరెడ్డి,రాయల శ్రీను పాల్గొన్నారు.
వర్ష బాధిత రైతులను ఆదుకోవాలి
మామునూరు (ఎర్రుపాలెం): వర్ష బాధిత రైతులను ఆదుకోవాలని, పంట నష్ట పరిహారం ఇవ్వాలని వైఎస్‌ఆర్ సీపీ ఖమ్మం పార్లమెంట రీ నియోజకవర్గ సమన్వ య్య కర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన గురువారం మామునూరు గ్రామం లో విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. వర్షాలతో ఎర్రుపాలెం మండలంలో పత్తి, మొక్కజొన్న, వరి తదితర పంటలకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. నష్టాన్ని అంచనా వేసి పరిహారం ఇవ్వాలని ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు. ‘కృష్ణా జిలా ్లలో పంట నష్టాన్ని గుర్తించిన ప్రభుత్వం.. దాని సరిహద్దును ఆనుకున్న ఎర్రుపాలెం మండలానికి పరిహా రం మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోకపోవడంసరికాదు’ అన్నారు.
జనం మదిలో జననేత శాశ్వతం
Published Fri, Nov 22 2013 5:07 AM | Last Updated on Tue, Aug 21 2018 5:36 PM
Advertisement
Advertisement