బందరు రోడ్డులో విజయమ్మ సమరభేరీ దీక్ష | YS Vijayamma's fast unto death protest from Bandar Road in Vijayawada | Sakshi
Sakshi News home page

బందరు రోడ్డులో విజయమ్మ సమరభేరీ దీక్ష

Published Fri, Aug 16 2013 1:56 PM | Last Updated on Fri, May 25 2018 9:10 PM

బందరు రోడ్డులో విజయమ్మ సమరభేరీ దీక్ష - Sakshi

బందరు రోడ్డులో విజయమ్మ సమరభేరీ దీక్ష

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఈ నెల 19వ తేదీన విజయవాడలో చేపట్టనున్న ఆమరణ దీక్షకు వేదిక ఖరారు అయింది. బందరు రోడ్డులోని పీవీపీ కాంప్లెక్స్ ఎదురుగా వైఎస్ విజయమ్మ ఆమరణ దీక్ష చేపడతారని ఆ పార్టీ నేతలు సామినేని ఉదయభాను, జలీల్ఖాన్, గౌతమ్రెడ్డిలు శుక్రవారం విజయవాడలో వెల్లడించారు.

 

రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలనే ఏకైక లక్ష్యంతో వైఎస్ విజయమ్మ సమరభేరీ దీక్ష చేపట్టనున్నారని వారు తెలిపారు. ఓట్లు, సీట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించి, సీమాంధ్ర ప్రజలకు చులకనగా చూస్తోందని వారు ఆరోపించారు. సీమాంధ్రుడిగా చంద్రబాబుకు పౌరుషం ఉంటే తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.

 

అలాగే సమైక్యాంధ్ర ఉద్యమంలో చంద్రబాబు పాల్గొనాలని వారు సూచించారు. తెలుగుదేశం నుంచి వలసలు నిరోధించి, పార్టీని కాపాడేందుకే బాబు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ నేతలు ఉదయభాను, జలీల్ఖాన్, గౌతమ్రెడ్డిలు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement