టీడీపీ ప్రభుత్వం 18 నెలల కాలంలో ప్రజలకు చేసిందేమీ లేదని ఎర్రగొండపాలెం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు విమర్శించారు. ఎర్రగొండపాలెంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..టీడీపీ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికే జన్మభూమి - మాఊరు కార్యక్రమం నిర్వహిస్తోందని అన్నారు. రెండో జన్మభూమి కార్యక్రమ సమయంలో ప్రజలు ఇచ్చిన అర్జీలను పరిష్కరించకుండా తిరిగి మూడో జన్మభూమి కార్యక్రమాలు నిర్వహిస్తూ సమయం వృథా చేస్తున్నారని టీడీపీ నాయకులపై మండిపడ్డారు.