
'దద్దవాడ'ను దత్తత తీసుకున్న వైవీ సుబ్బారెడ్డి
ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ, వైఎస్ఆర్ సీపీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి కొమరవోలు మండలం దద్దవాడ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. శుక్రవారం జిల్లా ఉన్నతాధికారులతో కలసి సుబ్బారెడ్డి ఆ గ్రామాన్ని సందర్శించారు. దేశంలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోడీ ... లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ జయంతి (అక్టోబర్ 11) సందర్బంగా సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఇప్పటికే దేశంలోని పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు దేశవ్యాప్తంగా గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పీఆర్ కండ్రీగ గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం విదితమే.