చిత్తూరు జిల్లాలో 'పోరుబాట' | YSR Congress Party poorubata In Chittoor District | Sakshi
Sakshi News home page

చిత్తూరు జిల్లాలో 'పోరుబాట'

Published Wed, Nov 5 2014 1:46 PM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

చిత్తూరు జిల్లాలో 'పోరుబాట' - Sakshi

చిత్తూరు జిల్లాలో 'పోరుబాట'

హైదరాబాద్ : ఎన్నికల సమయంలో హామీలు గుప్పించి ... అధికారాన్ని చేపట్టిన తర్వాత ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనను ఎండగట్టేందుకు ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని టీడీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు చిత్తూరు జిల్లాలో పోరుబాట నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా నిర్వహించిన ఈ ధర్నా కార్యక్రమాలలో డ్వాక్రా మహిళలు, రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాటి వివరాలు....

చిత్తూరు: ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి ఆధ్వర్యంలో మదనపల్లి ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో రైతులు, మహిళలు, పార్టీ కార్యకర్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తిరుపతి: నగర ఆర్డీవో కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ నాయకుడు భూమన కరుణాకర్రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రైతులు, డ్వాక్రా సంఘాల మహిళలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
శ్రీకాళహస్తి: వైఎస్ఆర్సీపీ నేత బియ్యప్పు మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
నగరి: నగరిలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా ఆధ్వర్యంలోధర్నా నిర్వహించారు.
పీలేరు: పీలేరులో వైఎస్ఆర్ సీపీ ఎంపీ మిధున్రెడ్డి, ఎమ్మెల్యే  సీహెచ్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
పుంగనూరు: స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు
చంద్రగిరి: చంద్రగిరిలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
సత్యవేడు: సత్యవేడులో వైఎస్ఆర్ సీపీ నేత ఆదిమూలం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement