వైఎస్సార్ సీపీ శ్రేణుల సమైక్య దీక్ష
Published Tue, Oct 8 2013 4:13 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
సాక్షి, ఏలూరు : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని.. తెలంగాణ నోట్‌ను ఆమోదిస్తూ కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయూన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన సమైక్య దీక్షలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ సోమవారం పార్టీ శ్రేణులు వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి. ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంట ర్‌లో చేపట్టిన వైసీపీ సమైక్య దీక్షలో వెంకటాపురం గ్రామానికి చెందిన 20 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెనుగొండలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎస్‌ఎస్ రెడ్డి ఆమరణ దీక్ష చేపట్టారు.
మార్టేరులో వైసీపీ కార్యకర్తల దీక్షలు కొనసాగుతున్నాయి. భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షల్లో భీమవరం మండలం కొత్తపూసలమర్రు గ్రామానికి చెందిన వైసీపీ జిల్లా స్టీరింగ్ సభ్యుడు తిరుమాను ఏడుకొండలు, 30 కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన చేసి జాతీయ రహదారిని దిగ్బంధించారు. వీరవాసరంలో నందమూరుగరువు గ్రామానికి చెందిన 20 మంది దీక్ష చేశారు. ఉండిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు 25 మంది కూర్చున్నారు. తణుకులో తేతలి గ్రామానికి చెందిన సుమారు 30 మంది కార్యకర్తలు దీక్షల్లో పాల్గొన్నారు. దీక్షా శిబిరం నుంచి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త చీర్ల రాధయ్య ఆధ్వర్యంలో కార్యకర్తలు చెవిలో పువ్వులు పెట్టుకుని ర్యాలీగా ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ఇంటికి చేరుకున్నారు.
ఆయన ఇంటిముందు ధర్నా చేసి పదవికి రాజీనామా సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే నివాసం ఉంటున్న పొడవునా, ఇంటి ముందు భారీ సంఖ్యలో పోలీసులు మోహరించి వైఎస్సార్ సీపీ నాయకులను, కార్యకర్తలను, సమైక్యవాదులను అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఉద్రిక్తత పరిస్థితులకు దారితీ సింది. ఇరగవరం మండలం రేలంగిలో ఉపసర్పంచ్ వడ్డి మార్కండేయులు, న్యాయవాది గాజుల అప్పాజీ రెండురోజులుగా చేస్తున్న ఆమరణ దీక్షలను ఆదివారం అర్ధరాత్రి పోలీసులు భగ్నం చేశారు. పాలకొల్లు పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్షలు కొనసాగుతున్నాయి.
ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యే అల్లు వెంకటసత్యనారాయణ, పార్టీ నాయకులు గుణ్ణం నాగబాబు, ఆకెన వీరాస్వామి(అబ్బు), ముచ్చర్ల శ్రీరామ్, యడ్ల తాతాజీ తదితరులు సంఘీబావం తెలిపారు. కొవ్వూరులో మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, నాయకులు పరిమి హరిచరణ్, బండి పట్టాభి రామారావు (అబ్బులు), ముదునూరి నాగరాజు, ముప్పిడి విజయరావు, మైపాల రాంబాబు, ముళ్లపూడి కాశీవిశ్వనాథ్, బొర్రా కృష్ణ, కొమ్మిరెడ్డి వెంకటేశ్వరరావులు దీక్షలో పాల్గొన్నారు. నిడదవోలు పట్టణంలో 15 కార్యకర్తలు, నాయకులు దీక్ష చేపట్టగా నియోజకవర్గ సమన్వయకర్త రాజీవ్‌కృష్ణ సంఘీభావం తెలిపారు. చేబ్రోలులో కైకరం గ్రామానికి చెందిన 16 మంది మహిళలు కూర్చున్నారు. జంగారెడ్డిగూడెంలో ఆమరణ దీక్ష చేపట్టిన కాగితాల రామారావు పల్స్‌రేట్ తగ్గడంతో వైద్యుల సూచన మేరకు స్థానిక పార్టీ నాయకులు దీక్షను విరమింపజేశారు. రిలే దీక్షలో కార్యకర్తలు కూర్చున్నారు.
Advertisement
Advertisement