అగ్నిగుండం
Published Sat, Oct 5 2013 3:53 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
సీమాంధ్ర ప్రజల భావోద్వేగాలను ఏమాత్రం పట్టించుకోకుండా తెలంగాణ నోట్‌ను కేంద్ర మంత్రివర్గం ఏకపక్షంగా ఆమోదించడంపై జిల్లా వాసులు ఆగ్రహోదగ్రులయిరు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 72 గంటల బంద్ పిలుపును అందుకుని ఎక్కడికక్కడ రోడ్డెక్కారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యకలాపాలను స్తంభింపచేశారు. రహదారులను దిగ్బంధించారు. వాహనాలను నిలిపివేశారు. ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో జిల్లా అగ్నిగుండంగా మారింది. ఆందోళన కార్యక్రమాల సందర్భంగా పలుచోట్ల కార్యాలయాల అద్దాలు పగిలాయి. అనేక చోట్ల వాహనాలు, ఇతర వస్తువులను తగులబెట్టడంతో మంటలు ఎగసిపడ్డాయి.
సాక్షి, ఏలూరు : తెలంగాణ నోట్‌ను ఆమోదించడం ద్వారా తెలుగుజాతిని నిలువునా చీలుస్తూ కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపై ‘పశ్చిమ’ వాసుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. విభజన నిర్ణయూన్ని నిరసిస్తూ.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని నినదిస్తూ 72 గంటలపాటు బంద్ నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపునందుకున్న పార్టీ శ్రేణులు, ప్రజలు రోడ్లపైకి వచ్చి పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఉద్యమజ్వాలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డారుు. వీధివీధినా నిరసనలు వెల్లువెత్తాయి. ఉద్యోగ సంఘాలు, విద్యార్థులు, సామాన్య ప్రజలు వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలసి బంద్‌లో పాలుపంచుకున్నారు. ఆందోళన కార్యక్రమాలకు ఆర్టీసీ ఉద్యోగులు సంపూర్ణ మద్దతు తెలి పారు. వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్, ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పోలవరంలో రాష్ట్ర రహదారిపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు.
సోనియాగాంధీ దిష్టిబొమ్మను ఊరేగించి దహనం చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమాలు కేంద్ర ప్రభుత్వానికి వినిపించడం లేదని, కనిపించడం లేదని నినదిస్తూ కళ్లు, చెవులు, నోరు మూసుకుని నిరసన తెలిపారు. ఏలూరులో పార్టీ శ్రేణులు తొలిరోజు బంద్‌ను విజయవంతం చేశారుు. నగరంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. బ్యాంకింగ్ సేవలు, రవాణా పూర్తిగా నిలిచిపోయాయి. ఆటోవాలాలు బంద్‌కు మద్దతు పలికారు. అక్కడక్కడా తెరిచి వున్న కార్యాలయూలను, దుకాణాలను వైఎస్సార్ సీపీ నాయకులు మూయించివేశారు. స్ధానిక జూట్ మిల్లును మూసివేసి బంద్‌కు సహకరించాలని ఎన్జీవోలు, వైఎస్సార్ సీపీ నేతలు కోరారు. నరసాపురంలో పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో చిరంజీవి. బొత్స, సోనియా దిష్టిబొమ్మలను ఊరేగించి దహనం చేశారు. మంత్రి పితాని సత్యనారాయణను అడ్డుకున్న వారిపై కేసులు నమోదు చేసినందుకు నిరసగా పోలీస్‌స్టేషన్ వద్ద పార్టీ కార్యకర్తలు ధర్నా నిర్వహిం చారు.
గోపాలపురం బస్‌స్టాండ్ వద్ద రోడ్డుపై టెంట్‌వేసి నిరసనలు తెలి పారు. మాజీ ఎమ్మెల్యే తానేటి వనిత, పార్టీ సమన్వయకర్తలు తలారి వెంకట్రావు, డి సువర్ణరాజు, మండల కన్వీనర్ జగదీష్ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. టీడీపీ నాయకుడు మాగం టి మురళీమోహన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయగా, వైసీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. ఈ సందర్భంలో వివాదం ఏర్పడగా, పోలీసులు నచ్చచెప్పి పంపించి వేశారు. బుట్టాయగూడెంలో పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ ప్రశాం తంగా జరిగింది. టైర్లకు నిప్పుపెట్టి విభజన ప్రకటనపై నిరసన తెలిపిన కార్యకర్తలు రోడ్డుపైనే నిరాహార దీక్షలు చేశారు. కొయ్యలగూడెంలో కార్యకర్తలు సెల్‌టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. అర్ధనగ్న ప్రదర్శనలు జరిపారు. టి.నరసాపురం మెరుున్ సెంటర్, వైఎస్సార్ విగ్రహం సెం టర్లలో రాస్తారోకో చేశారు. పాలకొల్లులో ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
పోడూరు మండలం కవి టంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. తాడేపల్లిగూడెంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తోట గోపీ ఆధ్వర్యంలో మోటారు సైకిళ్ల ర్యాలీ నిర్వహించి దుకాణాలను మూయించారు. ఉంగుటూరు, నిడమర్రు, భీమడోలు, గణపవరం మండలాల్లో రాస్తారోకోలు చేశారు. భీమడోలులో జాతీయ, రాష్ట్ర రహదారులను దిగ్బంధించి ఆందోళన వ్యక్తం చేశారు. ఆచంటలో బంద్ సం పూర్ణంగా జరిగింది. వ్యాపారసంస్థలు, విద్యాసంస్థలు, థియేటర్లు మూతపడ్డాయి. పెనుగొండ పోలీస్ స్టేషన్ వద్ద వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మల్లుల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మంత్రు లు బొత్స సత్యనారాయణ, పితాని సత్యనారాయణ ఫ్లెక్సీలను దహనం చేశారు. చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త మద్దాల రాజేష్ ఆధ్వర్యంలో చింతలపూడి, జంగారెడ్డిగూడెం మండలాల్లో బంద్ విజయవంతమైంది. లింగపాలెం మండలంలో రాస్తారోకోలు, ధర్నాలు, సోనియా దిష్టిబొమ్మ దహనం, ర్యాలీలు నిర్వహించారు.
టెక్కినవారిగూడెం, లక్కవరం, పేరంపేట గ్రామంలో నిర్వహించిన కార్యక్రమాల్లో చింతల పూడి నియోజకవర్గ సమన్వయకర్త కర్రా రాజారావు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ సమన్వయకర్త చీర్ల రాధయ్య ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. దుకాణాలు, విద్యా, వ్యాపార,వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి, ఆటోలను సైతం తిరగనివ్వలేదు. తేతలి వద్ద జాతీయ రహదారిని దిగ్బంధించి రాస్తారోకో చేశారు. అత్తిలి, ఇరగవరం మండలాల్లో బంద్ విజయవంతమైంది. భీమవరంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలతో పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి దుకాణాలను మూయించారు. భీమవరం, వీరవాసరంలలో సంపూర్ణ బంద్ నిర్వహించారు. కాళ్లలో రాష్ట్ర రహదారిపై టైర్లకు నిప్పంటించారు. ఆకివీడులో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
ఉండిలో వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే సర్రాజు నిరసన కార్యక్రమం చేపట్టారు. దెందులూరు నియోజకవర్గం లోని గోపన్నపాలెం, వేగవరం, సోమవరప్పాడు గ్రామాల్లో వైసీపీ శ్రేణులు రాస్తారోకో చేశారుు. ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు బైఠాయించి ఆందోళన చేశారు. కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి మండలంలో నిరసనలు మిన్నం టాయి. అన్నిచోట్లా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ యూపీఏ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
కొనసాగిన దీక్షలు
రాష్ట్ర విభజన నిర్ణయూన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు చేపట్టిన నిరాహార దీక్షలు శుక్రవారం మూడో రోజుకు చేరాయి. పాలకొల్లు కెనాల్‌రోడ్డులో వైఎస్సార్ విగ్రహం వద్ద వైఎస్సార్ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, పార్టీ నాయకుడు ముచ్చర్ల శ్రీరామ్ గురువారం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను మాజీ ఎంపీ, పార్టీ నాయకుడు చేగొండి వెంకటహరరామజోగయ్య శుక్రవారం విరమింపచేశారు. అయితే, వారిద్దరూ రిలే నిరహార దీక్షను కొనసాగించారు. పాల కొల్లు మండలం ఆగర్రు, చందపర్రు గ్రామాలకు చెందిన 25మంది పార్టీ కార్యకర్తలు దీక్షల్లో కూర్చున్నారు.
తాడేపల్లిగూడెం పోలీస్ ఐలండ్ సెంటర్‌లో వైసీపీ దీక్షా శిబిరంలో పెదతాడేపల్లి గ్రామానికి చెందిన కార్యక ర్తలు కూర్చున్నారు. చేబ్రోలులో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు నౌడు వెంకట రమణ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. జంగారెడ్డిగూడెంలో దీక్ష చేపట్టిన మద్దాల రాజేష్‌కుమార్‌కు ఉద్యోగ, ఉపాధ్యాయ, వ్యాపార వర్గాలతోపాటు విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, జేఏసీ ప్రతినిధులు సంఘీభావం తెలిపారు. దీక్షా శిబిరం వద్ద విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి కేసీఆర్, సోనియా, చిరంజీవి, కావూరి సాంబశివరావు ఫ్లెక్సీలను కోడిగుడ్లు, టమాటాలతో కొట్టి నిరసన వ్యక్తం చేశారు. రాజేష్ దీక్షను సాయంత్రం 5 గంటలకు పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు విరమింపజేశారు.
Advertisement
Advertisement