వైసీపీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు | Laugh protect towards YSR CP | Sakshi
Sakshi News home page

వైసీపీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు

Published Mon, Oct 21 2013 4:25 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

జంగారెడ్డిగూడెం, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర పరిరక్షణే ధ్యేయంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 26న హైదరాబాద్‌లో తలపెట్టిన సమైక్య శంఖారావం సభకు రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆ పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పిలుపునిచ్చారు.

జంగారెడ్డిగూడెం, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర పరిరక్షణే ధ్యేయంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 26న హైదరాబాద్‌లో తలపెట్టిన సమైక్య శంఖారావం సభకు రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆ పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఢిల్లీ పెద్దలకు కనువిప్పు కలిగేలా సమైక్య శంఖారావం సభ నిర్వహించనున్నట్టు చెప్పారు.  
 
 రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి  చెందుతాయనే ఉద్దేశంతోనే పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమైక్య శంఖారావాన్ని పూరిస్తున్నారని చెప్పారు. సమైక్యాంధ్రప్రదేశ్ ఒక్కటే సభ లక్ష్యమని, సమైక్యవాదాన్ని గట్టిగా వినిపించేందుకు ఎన్జీవోలు, ఇతర జేఏసీల సభ్యులు, సమైక్యవాదులు పెద్దెత్తున తరలిరావాలని కోరారు. 
 
 సభకు జిల్లా నుంచి అధిక సంఖ్యలో హాజ రయ్యేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. నరసాపురం, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రజల సౌలభ్యార్థం రెండు రైళ్లు ఏర్పాటుచేశామని, అన్ని నియోజకవర్గాల పరిధిలో బస్సులతో పాటు ఇతర వాహనాలు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమైక్య శంఖారావానికి ప్రజలు, సమైక్యవాదులు తరలివచ్చేలా పార్టీశ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement