ప్రజా సమస్యలపై వైఎస్సార్‌సీపీ పోరుబాట | ysrcp agitations on people's problems | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యలపై వైఎస్సార్‌సీపీ పోరుబాట

Published Tue, May 5 2015 6:30 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM

ysrcp agitations on people's problems

- రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు


విజయవాడ బ్యూరో: ప్రజాసమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. ఇందులోభాగంగా రాష్ట్రవ్యాప్తంగా సోమవారం తహశీల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళన నిర్వహించింది. ఎన్నికల హామీల్ని  టీడీపీ ప్రభుత్వం అమలు చేయాలనే డిమాండ్‌తోపాటు ఆయా మండలాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కారించాలంటూ ఆ పార్టీ శ్రేణులు ఈ సందర్భంగా నినదించాయి.

శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం,పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కష్ణా, గుంటూరు, ప్రకాశం, వైఎస్సార్ జిల్లా, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు వివిధ ప్రజా సమస్యలను ఎలుగెత్తాయి. ఆయా ప్రాంతాల్లోని ఎమ్మార్వో కార్యాలయాల వద్ద వినతి పత్రాలు సమర్పించారు. ఈ ఆందోళనల్లో ఎమ్మెల్యేలు, పార్టీ ప్రతినిధులు పాల్గొని ప్రసంగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement