సంపూర్ణం.. స్వచ్ఛందం
Published Sun, Dec 8 2013 1:11 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM
సాక్షి, కాకినాడ :రాష్ట్ర విభజన బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాం గ్రెస్ పిలుపు మేరకు జిల్లాలో జరిగిన 48 గంట ల బంద్‌లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేశారు. ఏపీ ఎన్జీఓలు, కార్మికులు, న్యాయవాదులు, ఇతర వర్గాలకు చెందినవారు బంద్‌లో పాల్గొని సమైక్యవాణిని చాటారు. పలుచోట్ల రహదారులపై టైర్లకు నిప్పుపెట్టి నిరసన తెలిపారు. తొలిరోజు ఆర్టీసీ బస్సులు పూర్తిగా డిపోలకే పరిమితం కాగా, రెండోరోజు అక్కడక్కడా నడిపినా వైఎస్సార్‌సీపీ శ్రేణులు అడ్డుకున్నారు. రెండోరోజూ వ్యాపారసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, విద్యాసంస్థలు మూతపడ్డాయి.కాకినాడలో పార్టీ నగర కన్వీనర్ ఆర్‌వీజేఆర్ కుమార్, జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ రావూరి వెంకటేశ్వరరావు, ద్వారంపూడి వీరభద్రారెడ్డిలతోపాటు వందలాది మంది బైక్ ర్యాలీ నిర్వహించి, టూటౌన్ సెంటర్‌లో బైఠాయించి రాస్తారోకో చేశారు.
నగరపాలక సంస్థ కార్యాల యంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను బయటకు రప్పించి నిరసన తెలిపారు. రాజ మండ్రిలో నగర కన్వీనర్ బొమ్మన రాజ్‌కుమార్, ట్రేడ్‌యూనియన్ రాష్ర్టకార్యదర్శి టీకే విశ్వేశ్వరరెడ్డి, సేవాదళ్ రాష్ర్ట కార్యదర్శి సుంకర చిన్నిల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిపి, బంద్ నిర్వహించారు. యువజన విభాగం నగర కన్వీనర్ గుర్రం గౌతమ్ ఆధ్వర్యంలో యువకులు బైక్ ర్యాలీ చేసి బంద్ నిర్వహించారు. తునిలో రాస్తారోకోతో బస్సుల రాకపోకలను అడ్డుకున్న కో ఆర్డినేటర్ దాడిశెట్టి రాజా, మహిళా విభాగం జిల్లా కన్వీనర్ రొంగలి లక్ష్మిలతో పాటు 40 మందిని అరెస్టు చేశారు.
ఎంపీ హర్షకుమార్ క్యాంప్ కార్యాలయం ముట్టడి
అమలాపురంలో పార్లమెంటరీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ గొల్ల బాబూరావు, మాజీ ఎంపీ ఎ.జె.వి.బి. మహేశ్వరరావు,పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంపీ హర్షకుమార్ క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు. విభజనను అడ్డుకోలేని ఎంపీలు తమ పదవులను పట్టుకొని వేలాడుతున్నారని ధ్వజమెత్తారు. బస్టాండ్ వద్ద బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు. నియోజకవర్గ కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు ఆధ్వర్యంలో పిఠాపురంలో 216 జాతీయరహదారిపై రాస్తారోకో చేశారు. కాకినాడ రూరల్ కో ఆర్డినేటర్ చెల్లుబోయిన వేణు, నాయకులు కర్రి సత్యనారాయణ తదితరుల ఆధ్వర్యంలో సర్పవరం జంక్షన్‌లో రాస్తారోకో చేశారు.
రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో బుర్రిలంక వద్ద 16వ నంబరు జాతీయ రహదారిని దిగ్బంధించారు.
మండపేటలో కో ఆర్డినేటర్ రెడ్డి ప్రసాద్, కిసాన్‌సెల్ జిల్లా కన్వీనర్ రెడ్డి రాధాకృష్ణల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించి, కలువపువ్వు సెంటర్లో రాస్తారోకో చేశారు. ఏలేశ్వరం బాలాజీచౌక్‌లో రాస్తారోకో చేశారు. ముమ్మిడివరంలో కో ఆర్డినేటర్ గుత్తుల సాయి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించి, పోలీస్ స్టేషన్ ఎదుట రాస్తారోకో చేశారు. మామిడికుదురులో 216 జాతీయ రహదారిపై బైఠాయించారు. పి.గన్నవరం సెం టర్‌లో రాస్తారోకో చేశారు. అంబాజీపేట, అయినవిల్లిలలో బంద్ విజయవంతమైంది. పార్టీ నేతలు జక్కంపూడి తాతాజీ, విప్పర్తి వేణుగోపాల రావు, కొండేటి చిట్టిబాబు, మందపాటి కిరణ్ కుమార్, మిండగుదిటి మోహన్ పాల్గొన్నారు. కొత్తపేటలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి గొల్లపల్లి డేవిడ్‌రాజు ఆధ్వర్యంలో బంద్ జరిగింది. కో ఆర్డినేటర్లు మత్తి జయప్రకాష్, బొంతు రాజేశ్వరరావుల ఆధ్వర్యంలో రాజోలులో రాస్తారోకో చేశారు. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా పార్టీ శ్రేణులు బంద్ నిర్వహించారు.
టీడీపీ ఆధ్వర్యంలో...
టీడీపీ జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయల చిన రా జప్ప, మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణరా వుల ఆధ్వర్యంలో అమలాపురంలో బంద్ నిర్వహించారు. రాజమండ్రి మోరంపూడి సెంటర్లో మురళీమోహన్ ఆధ్వర్యంలో రాస్తారోకో చే శా రు. మండపేటలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరా వు, ఏలేశ్వరంలో ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు ఆ ధ్వర్యంలో బైక్ ర్యాలీలు జరిగాయి. జ్యోతుల చంటిబాబు ఆధ్వర్యంలో జగ్గంపేటలో నిరసన ప్రదర్శన, మానవహారం జరిగాయి. యనమల కృష్ణుడు ఆధ్వర్యంలో తునిలో బంద్ జరిగింది. కాకినాడలో మాజీ ఎమ్మెల్యే కొండబాబు, పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి పోతుల విశ్వంల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు.
ఇప్పటికైనా పదవులను వదలండి..
సీమాంధ్ర కేంద్ర మంత్రులు పదవీ వ్యామోహాన్ని విడనాడి ఇప్పటికైనా రాజీనామా చేయాలని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక జేఏసీ డిమాండ్ చేసింది. జిల్లా జేఏసీ చైర్మన్ బూరిగ ఆశీర్వాదం, కన్వీనర్ పితాని త్రినాథ్, కలెక్టరేట్ ఉద్యోగుల సంఘం జేఏసీ చైర్మన్ సుబ్బారావుల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద రోడ్డుపై బైఠాయించి నల్ల జెండాలతో నిరసన తెలిపారు. కలెక్టరేట్ ఎదుట రిలేనిరాహారదీక్ష చేపట్టారు. ఆశీర్వాదం, కన్వీనర్ త్రినాథ్‌లు మాట్లాడుతూ సీమాంధ్ర కేంద్ర మంత్రులు చేతకాని వారుగా మిగిలారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రజల మనోభావాలకు తలవంచి తక్షణం రాజీనామాలు చేయాలన్నారు. ఈనెల 9న హైదరాబాద్‌లో రాష్ట్ర చైర్మన్ అశోక్‌బాబు నేతృత్వంలో జరిగే సమావేశంలో భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించిన అనంతరం ప్రత్యక్ష పోరుకు వెళతామన్నారు.
Advertisement
Advertisement