కడప: వైఎస్ఆర్ జిల్లా కడపలో జరిగిన ఫుడ్ అడ్వైజరీ కమిటీ సమావేశం రసాభాసగా మారింది. శనివారం జరిగిన ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ హాజరుకాకపోవడంపై వైఎస్ఆర్సీపీ కి చెందిన ఎమ్మెల్యేలు కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేశారు. అనంతరం డీఎస్వో ను సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ లింగారెడ్డి తీవ్ర పదజాలంతో విరుచుకు పడ్డారు. దీంతో లింగారెడ్డి వ్యాఖ్యలపై రెవెన్యూ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకు నిరసగా అధికారులంతా మూకుమ్మడిగా సెలవులు పెట్టేందుకు సిద్ధమవుతున్నా