
సాక్షి, అమరావతి: ఎన్నికల నిబంధనలకు తూట్లు పొడుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరింది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై నిరాధారమైన ఆరోపణలు, ఆయన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చేలా ప్రసంగాలు చేస్తున్న చంద్రబాబుపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి ఫిర్యాదు చేశారు.
ఎన్నికల్లో ఒక వ్యక్తిని కించపర్చేలా మాట్లాడడం ఎన్నికల నియమావళి ప్రకారం క్రిమినల్ నేరమే కాకుండా ప్రజా ప్రాతినిధ్య చట్టం–1951ని ఉల్లంఘించడం కిందకే వస్తుందన్నారు. చంద్రబాబు దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారని, ఇది ఐపీసీ 171జీ ప్రకారం ఎన్నికల ఉల్లంఘన కిందకు వస్తుందని నాగిరెడ్డి తెలిపారు. చంద్రబాబు వ్యాఖ్యలకు ఆధారాలుగా ఆంగ్ల, తెలుగు దినపత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్‌లను ఈ ఫిర్యాదుకు జత చేశారు.
Comments
Please login to add a commentAdd a comment