ఏలూరు(ప.గో.జిల్లా): వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల అరెస్టును ఏలూరు పార్లమెంట్ ఇంచార్జి డా.తోట చంద్రశేఖర్ ఖండించారు. సమైక్య రాష్ట్రం అన్నందకు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం, ఆపై అరెస్టు చేయడం తగదని సూచించారు. ఇటువంటి చర్యలకు పాల్పడటం నీతి మాలిన చర్యలు గాక మరేంటని ప్రశ్నించారు. ప్రస్తుతం మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నట్టు లేదని, రాజకీయ వ్యవస్థలో ఉన్నట్లుందని ఆయన విమర్శించారు. గత ఎన్నికల్లో రాష్ట్ర విభజన చేస్తారని ముందుకు వెళ్లారా?అని చంద్రశేఖర్ నిలదీశారు.
రాష్ట్రాన్ని విభజించే హక్కు ఎవ్వరికీ లేదని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర విభజనపై ప్రజల రెఫరెండం తీసుకోవాలన్నారు. వెంటనే అసెంబ్లీని రద్దు చేసి, ఎన్నికలు నిర్వహించాలన్నారు.