
సాక్షి, శ్రీకాకుళం : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో గురువారం హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. దీనికి నిరసన పలు జిల్లాలో నిరసన జ్వాలలు భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని పాలకొండలో ముగ్గురు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను అరెస్ట్ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారన్న నెపంతో కడగల వెంకట రమణ, నీలాపు శ్రీనివాసరావు, తుమ్మగుంట శంకర్‌రావుతో పాటు పార్టీ నేత దుంపల రమేష్‌ను అరెస్ట్ చేశారు. వీరందరిపై సెక్షన్151 ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment