గళమెత్తిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు
జిల్లావ్యాప్తంగా ఆందోళనలు
ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు
రాజీనామా చేయాలని డిమాండ్
సీబీఐ విచారణకు సిద్ధపడాలన్న నేతలు
ఓటుకు నోటు వ్యవహారంలో ఆధారాలతో సహా ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబుకు పాలించే అర్హత లేదని వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు నినదించాయి. అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునందుకుని పార్టీ శ్రేణులు జిల్లావ్యాప్తంగా కదంతొక్కాయి. అక్రమాల ఊబిలో పీకల్లోతు కూరుకుపోయిన చంద్రబాబు తక్షణం గద్దె దిగాలని డిమాండ్ చేస్తూ ఆయా నియోజకవర్గాల్లో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు మంగళవారం నిరసన ప్రదర్శనలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు.
సాక్షి ప్రతినిధి, కాకినాడ :వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ నాయకత్వంలో పార్టీ శ్రేణులు చంద్రబాబు అవినీతి బాగోతాన్ని నిలదీశాయి. జగ్గంపేటలో జేవీఆర్ కాంప్లెక్స్ నుంచి నెహ్రూ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, సెంటర్‌లో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. బాబు తీరును నెహ్రూ తూర్పారబట్టారు. ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ ఆధ్వర్యాన రామచంద్రపురం గాంధీపేటలోని పార్టీ కార్యాలయం నుంచి కార్యకర్తలు, నాయకులు మెయిన్ రోడ్డులో భారీ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. రాష్ట్ర కార్యదర్శి వట్టికూటి రాజశేఖర్, బీసీ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వాసంశెట్టి శ్యాంకుమార్, వైద్య విభాగం జిల్లా కన్వీనర్ డాక్టర్ యనమదల మురళీకృష్ణ, గీత దంపతులు, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ పెట్టా శ్రీనివాస్, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి సత్తి శంకర్‌రెడ్డి పాల్గొన్నారు.
ప్రత్తిపాడులో ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆధ్వర్యాన మహాధర్నా జరిగింది. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ముదునూరి మురళీకృష్ణంరాజు, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కాకరాపల్లి వీరంశెట్టి, రైతు విభాగం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భేరి అరవిందకుమార్, పార్టీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి అలమండ చలమయ్య పాల్గొన్నారు. కొత్తపేట పాత బస్టాండ్ సెంటర్‌లో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యాన ధర్నా, రాస్తారోకో చేశారు. సంయుక్త కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్‌రాజు, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు మార్గన గంగాధరరావు, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి బండారు సత్తిరాజు(రాజా), రాష్ట్ర ప్రచార విభాగం కార్యదర్శి ముసునూరి వెంకటేశ్వరరావు, సేవాదళ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చల్లా ప్రభాకర్రావు పాల్గొన్నారు.
అమలాపురం హైస్కూల్ సెంటర్లో జరిగిన ఆందోళనలో వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యులు పినిపే విశ్వరూప్, కుడుపూడి చిట్టబ్బాయి, రాష్ట్ర కార్యదర్శులు మిండగుదిటి మోహన్, చెల్లుబోయిన శ్రీనివాసరావు, బొమ్మి ఇజ్రాయిలు, దంగేటి రాంబాబు, డీసీసీబీ డెరైక్టర్లు దంగేటి దొరబాబు, యిళ్ల గోపాలకృష్ణ పాల్గొన్నారు. హైస్కూల్ సెంటర్లోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ధర్నా, గడియారస్తంభం సెంటర్‌లో మానవహారం నిర్వహించారు.
కడియం బొబ్బిలి బ్రిడ్జి సెంటర్‌లో రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ గిరజాల స్వామినాయుడు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. నియోజకవర్గం నలుమూలల నుంచీ కార్యకర్తలు ర్యాలీగా బొబ్బిలి బ్రిడ్జి సెంటర్‌కు తరలివచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి నక్కా రాజబాబు, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరజాల బాబు, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి దాసరి శేషగిరి పాల్గొన్నారు. రాజోలు బస్టాండ్ ఎదుట కో ఆర్డినేటర్ అల్లూరు కృష్ణంరాజు ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. మల్కిపురం సెంటర్‌లో లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి మంగెన సింహాద్రి, ఎస్సీ సెల్ కార్యదర్శి నల్లి డేవిడ్ రాస్తారోకో చేశారు.
బాబు దిష్టిబొమ్మ దహనం
పిఠాపురంలోని పార్టీ కార్యాలయం నుంచి వైఎస్సార్‌సీపీ కో ఆర్డినేటర్ పెండె దొరబాబు ఆధ్వర్యంలో చంద్రబాబు దిష్టిబొమ్మను ఊరేగించారు. ఉప్పాడ సెంటర్‌లో రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. బాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ గండేపల్లి బాబి, రాష్ట్ర కార్యదర్శులు వెంగలి సుబ్బారావు, కొత్తపల్లి రమణబాబ్జీ, మాజీ ఎంపీపీ కురుమళ్ళ రాంబాబు, తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్‌సీపీ కాకినాడ రూరల్ కో ఆర్డినేటర్ చెల్లుబోయిన వేణు ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకుని సర్పవరం జంక్షన్‌వద్ద భారీ ఎత్తున ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర నాయకులు గట్టి రవి, లింగం రవి, కాళ్ల లక్ష్మణరావు రెండు గంటల పాటు ఆందోళన చేపట్టారు. మండపేటలో పార్టీ కార్యాలయం నుంచి కలువపువ్వు సెంటర్ వరకూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. కో ఆర్డినేటర్ వేగుళ్ళ పట్టాభిరామయ్య చౌదరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ, యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దూలం వెంకన్నబాబు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పెంకే వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
అనపర్తిలో అర్ధనగ్న ప్రదర్శన
అనపర్తి దేవీచౌక్ సెంటర్‌లో పార్టీ కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యాన అర్ధనగ్న ప్రదర్శన చేశారు. పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శి ఎరకారెడ్డి సత్య, రాష్ట్ర ఎస్సీ సెల్ సంయుక్త కార్యదర్శి మోకా సూరిబాబు, పార్టీ రైతు విభాగం రాష్ర్ట సంయుక్త కార్యదర్శి లంక చంద్రన్న, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సబ్బెళ్ల కృష్ణారెడ్డి, కె.ఇజ్రాయిల్ తదితరులున్నారు. రాజమండ్రి దేవీచౌక్ సెంటర్‌లో పార్టీ శ్రేణులు ధర్నా చేపట్టాయి. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి, ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు తక్షణం రాజీనామా చేసి తన నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. రాష్ర్ట వాణిజ్య విభాగం సహాయ కార్యదర్శి మంచాల బాబ్జీ, దొండపాటి సత్యంబాబు, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి పోలు కిరణ్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యుడు ఇసుకపల్లి శ్రీనివాస్, మైనార్టీ విభాగం కార్యదర్శి అహ్మద్ పాల్గొన్నారు. ముమ్మిడివరం తహశీల్దార్ కార్యాలయం వద్ద పార్టీ కో ఆర్డినేటర్ గుత్తుల సాయి ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో చేశారు. పార్టీ ఫ్లోర్‌లీడర్ కాశి మునికుమారి పాల్గొన్నారు. పి.గన్నవరంలో పార్టీ కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యాన పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు. మూడు రోడ్ల కూడలిలో చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసి పోలీస్ స్టేషన్ వరకూ ప్రదర్శన నిర్వహించారు.
జిల్లా అధికార ప్రతినిధి దొంగ రామ సత్యనారాయణ, రాష్ట్ర యూత్ సంయుక్త కార్యదర్శి జక్కంపూడి వాసు, పార్టీ సీనియర్ నాయకులు విప్పర్తి వేణుగోపాలరావు పాల్గొన్నారు. రాజానగరం గాంధీబొమ్మ సెంటర్‌లో మండల కమిటీ కన్వీనర్ మండారపు వీర్రాజు ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్ర కమిటీ సభ్యులు అనదాత సాయిరామ్, కొల్లి వీర్రాజు, వలవల రాజా, జిల్లా నేత అక్కిరెడ్డి మహేష్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కంటే వీరరాఘవులు ఆధ్వర్యాన పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కాటంశెట్టి వీరరాఘవ, కౌన్సిలర్లు ఆవాల లక్ష్మీనారాయణ, కాళ్ల లక్ష్మీనారాయణ, వాసంశెట్టి గంగ తదితరులు ఆర్డీఓ విశ్వేశ్వరరావుకు వినతి పత్రం సమర్పించారు.
తునిలో పోటెత్తిన నిరసన
తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనకు నియోజకవర్గం నలుమూలల నుంచీ పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. దీంతో గొల్ల అప్పారావు సెంటర్ కిక్కిరిసిపోయింది. పురవీధుల్లో భారీ ర్యాలీ చేసి, గొల్ల అప్పారావు సెంటర్‌కు చేరుకుని మానవహారం నిర్వహించారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. రూ.వెయ్యి కోట్లు పెట్టుబడులు పెట్టిన జీఎంఆర్ సంస్థ 2 శాతం నిధులు అంటే.. రూ.20 కోట్లను మండలాభివృద్ధికి కాకుండా యనమల ఫౌండేషన్‌కు తరలించడం ఎంతవరకూ సమంజసమని రాజా నిలదీశారు. మూడు దశాబ్దాలు తునిలో అవినీతికి పాల్పడి, ఇప్పుడు ఇతరులపై విమర్శలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. పార్టీ రైతు విభాగం ప్రధాన కార్యదర్శి మాకినీడి గాంధీ, బీసీ విభాగం కార్యదర్శులు కొయ్యా శ్రీనుబాబు, గోర్లి అచ్చియ్యనాయుడు, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మోతుకూరి వేంకటేష్, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి లాలం బాబ్జీ పాల్గొన్నారు.
తప్పు చేశావ్.. తప్పుకో బాస్
Published Wed, Jun 10 2015 12:19 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement
Advertisement