
వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవానికి పిలుపు
పాడేరు రూరల్: ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతున్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి తడబారికి సురేష్‌కుమార్ అన్నారు. ఈ నెల 12న వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని వాడవాడలా నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ఐదేళ్లలో ప్రజల పక్షాన నిలిచి ఎన్నో పోరాటాలు చేసిన ఘనత పార్టీకి దక్కుతుందన్నారు. రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలు, ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం విద్యార్థి విభాగం పోరాటాలు కొనసాగిస్తున్నదన్నారు.