అనంతపురం: వైఎస్సార్సీపీ నాయకురాలు అనారోగ్యంతో కన్నుమూశారు. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం బైరసముద్రం వైఎస్సార్సీపీ గ్రామ సర్పంచ్ గుడ్ల వన్నూరమ్మ(52) శుక్రవారం ఉదయం మృతి చెందారు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను గురువారం బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందారు. ఆమె మృతిపై వైఎస్సార్సీపీ నాయకులు సంతాపం తెలిపారు.