unhealthy
-
15 మంది బాలికలకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
సాక్షి, పాడేరు: జిల్లాలోని డుంబ్రిగుడ మండలం జామిగుడ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో మరో 15 మంది గిరిజన బాలికలు ఆదివారం అస్వస్థతకు గురయ్యారు. వారికి ఆదివారం మధ్యాహ్నం వాంతులు, కడుపునొప్పితో పాటు జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలతో కనబడ్డాయి. కిల్లోగుడ వైద్య బృందం ప్రాథమిక వైద్యసేవలు అందించి, మెరుగైన వైద్యానికి హుటాహుటిన అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.అక్కడ వైద్యపరీక్షలు నిర్వహించడంతో వారు కోలుకుంటున్నారు. అనారోగ్య పరిస్థితులు తగ్గుముఖం పట్టాయని తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకుంటున్న సమయంలో మరో 15 మంది అస్వస్థతకు గురవడంతో మిగిలిన విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. మరో వైపు కలెక్టర్ దినేశ్‌కుమార్ ఆదేశాల మేరకు జామిగుడ ఆశ్రమ పాఠశాలలో నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీటి పంపిణీ చేపట్టారు.50 మంది విద్యార్థినులు డిశ్చార్జిరెండు రోజుల నుంచి అరకు ప్రాంతీయ ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతున్న జామిగుడ పాఠశాలకు చెందిన బాధిత విద్యార్థినులు 61 మందిలో 50 మంది కోలుకున్నారు. వారిని అంబులెన్స్‌ల్లో జామిగుడ ఆశ్రమ పాఠశాలకు తరలించారు. ఆదివారం ఆస్పత్రిలో చేరిన 15 మందితో కలిపి, మొత్తం 26 మంది గిరిజన విద్యార్థులు వైద్యుల వైద్యసేవలు, తల్లిదండ్రుల పర్యవేక్షణలో అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.నూజివీడు ట్రిపుల్ ఐటీ ఫుడ్ కాంట్రాక్టర్లపై క్రిమినల్ చర్యలుసాక్షి, అమరావతి : కలుషితాహారం ఘటనపై విచారణ కమిటీ సిఫారసుల మేరకు నూజివీడు ట్రిఫుల్ ఐటీలో ప్రస్తుతం కేటరింగ్ సేవలు అందిస్తున్న పైన్ క్యాటరింగ్ సర్వీసెస్, అనూష హాస్పిటాలిటీ సేవలను తక్షణమే రద్దు చేయడంతో పాటు బాధ్యులైన వారిపై క్రిమినల్ చర్యలకు విద్య, ఐటి శాఖ మంత్రి లోకేశ్ ఆదేశాలు జారీ చేశారు. ఆ సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా మరే ఇతర టెండర్లలో పాల్గొనకుండా బ్లాక్ లిస్టులో పెట్టాలని చెప్పారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు.కొత్త కాంట్రాక్టర్లను నియమించే వరకు విద్యార్థులందరికీ ఆహారాన్ని అందించడానికి తాత్కాలికంగా కేఎంకే క్యాటరింగ్ సేవలను ఉపయోగించుకోవాలని ట్రిపుల్ ఐటి అధికారులకు సూచించారు. ‘పెండింగ్‌లో ఉన్నఫుడ్ కోర్టు అద్దెను రెండు వారాల్లోగా ఏజెన్సీ నుంచి వసూలు చేయాలి. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బయటి ఆహారాన్ని క్యాంపస్‌లోకి అనుమతించొద్దు. ఫుడ్ కోర్టుకు సంబంధించిన కొత్త టెండర్ల ప్రక్రియను వారం రోజుల్లో ప్రారంభించాలి. అప్పటి వరకు ఫుడ్ చెయిన్ల నుంచి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి. -
‘చుట్టూ చేరి కన్ఫ్యూజ్ చేయద్దు కన్ఫ్యూజన్లో ఎక్కువగా తినేస్తాం’
సాక్షి, సిటీబ్యూరో: ‘చుట్టూ చేరి కన్ఫ్యూజ్ చేయద్దు కన్ఫ్యూజన్లో ఎక్కువగా కొట్టేస్తా’ అంటాడో సినిమాలో హీరో. చుట్టూ హ్యాపీనెస్ ఉండాలి.. ఉంటే ఎక్కువ తినేస్తాం అంటున్నారు నగరవాసులు. సిటిజనుల చిరుతిళ్ల సరదాకు హ్యాపీ మూడ్ ఒకింత ఊపునిస్తున్నట్టు ఓ అధ్యయనం వెల్లడించింది. అలా హ్యాపీ–టేస్ట్‌లో మునిగి తేలుతున్న సిటిజనుల సంఖ్యలో దేశంలోనే మన హైదరాబాద్ రెండో స్థానంలో ఉందని కూడా తేల్చింది. మానసిక స్థితికి, తినే తిండికి మధ్య బలమైన సంబంధం ఉంది. నిజానికి ఒత్తిడి ఆకాశాన్నంటుతున్నప్పుడు, మానసిక స్థితి క్షీణిస్తున్నప్పుడు, ఆలోచనలు చిరుతిండి వైపు మళ్లుతాయనేది ఎప్పటి నుంచో మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నదే. సంతోషంగా ఉన్నప్పుడు కూడా చిరుతిండి అధికం అవుతున్నట్టు తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. అభి‘రుచుల’తో భావోద్వేగాలు.. అంతర్జాతీయ సంతోష దినోత్సవం (మార్చి 20) సందర్భంగా మూడ్ అప్లిఫ్టర్’ పేరిట గోద్రెజ్ యుమ్మీజ్ నిర్వహించిన ది ఇండియా స్నాకింగ్ రిపోర్ట్ ప్రకారం.. 72 శాతం భారతీయులు తమ అభిరుచులను భావోద్వేగాలతో అనుసంధానిస్తున్నారు. తాము సంతోషంగా ఉన్నప్పుడు ఎక్కువ స్నాక్స్ తీసుకుంటున్నారు. చిరుతిళ్లు మానసిక ఆనందపు స్థాయిని మరింత పెంచే సాధనంగా అత్యధికులు భావిస్తున్నారు. చిరుతిండిని వారి మానసిక స్థితితో అనుసంధానిస్తున్న వారిలో 70 శాతం స్నాక్స్ తిన్న తర్వాత మరింత సంతృప్తిగా, ఉత్సాహంగా ఉన్నారని నివేదిక స్పష్టం చేసింది. తూర్పు భారతంలో ఎక్కువ.. ప్రాంతాలవారీగా పోల్చినప్పుడు, తూర్పు భారతంలో 75 శాతం మంది సంతోషంగా ఉన్నప్పుడు ఎక్కువ అల్పాహారం తీసుకుంటారని నివేదిక తేల్చింది. ఇక పశ్చిమ, ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల్లో ఇది 72, 67, 74 శాతాలుగా లెక్కగట్టారు. నగరాల వారీగా చూసినప్పుడు ఢిల్లీ, చైన్నె, హైదరాబాద్, కోల్‌కతా ప్రజలు సంతోషాన్ని బట్టి ఎక్కువ స్నాక్స్ తినేస్తారు. ఈ విషయంలో ఢిల్లీ 81 శాతంతో అగ్రస్థానంలో ఉండగా, చైన్నె, హైదరాబాద్‌లు ఒక్కొక్కటి 77 శాతం, కోల్‌కతా 75 శాతంతో టాప్‌లో ఉన్నాయి, ఈ నగరాల్లోని స్థానికులు స్నాక్స్‌ను మూడ్ అప్లిఫ్టర్లుగా భావిస్తున్నారని నివేదిక వెల్లడించింది. అదే క్రమంలో ముంబై సగటు 68 శాతంగా అహ్మదాబాద్ 67 శాతం. దీని తర్వాత పుణె, బెంగళూరు 66, లక్నో 62, జైపూర్ 61 శాతాల చొప్పున ఉన్నాయి. నివేదికలో మరో విశేషం.. సంతోషంగా ఉన్నప్పుడు ఎక్కువ స్నాక్స్ తీసుకునేవారిలో మహిళలే కొంచెం అధికంగా ఉన్నారు. ఫుడ్– మూడ్ కనెక్షన్‌కు సంబంధించి 74 శాతం మహిళలు 70 శాతం పురుషులు ఉన్నారు. అధికమైతే అనారోగ్యమే.. చిరుతిళ్లు అధికంగా తినడం అనారోగ్యకారకంగా మారుతుందని నగరానికి చెందిన ఫిజిషియన్ డా.రమేష్ చెప్పారు. సంతోషంగా లేదా కొంత ఒత్తిడిలో ఉన్నప్పుడు స్నాక్స్ తీసుకునే క్రమంలో పరిమితి తప్పే అవకాశాలు హెచ్చుగా ఉన్నాయని తద్వారా ఊబకాయం సహా పలు రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు సోషల్ మీడియా తోడుగా... సంతోషాన్ని పంచుకోవడానికి తాము ప్రాధాన్యమిచ్చే వాటిలో సోషల్ మీడియా తొలి స్థానంలో ఉందని ఆధునికులు అంటున్నారు. యూగోవ్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ముఖ్యంగా స్నాప్ చాట్ ను తాము హ్యాపీ నెస్ షేరింగ్ వేదికగా ఎక్కువగా వినియోగిస్తామని 87 శాతం నెటిజనులు వెల్లడించారు.. -
సిర్రోసిస్‌తో బాధపడేవారు తీసుకోవాల్సిన ఆహారం
సిర్రోసిస్ అన్నది ఆరోగ్యకరమైన కాలేయ కణజాలం స్థానంలో అనారోగ్యకరమైన (ఫైబ్రస్ స్కార్ టిష్యూ) పెరగడం వల్ల వచ్చే సవుస్య. విపరీతంగా వుద్యం తాగేవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. అంతేకాదు... హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, ఫ్యాటీలివర్ అనే వ్యాధుల వల్ల కూడా రావచ్చు. కొన్ని సందర్భాల్లో దీనికి ఎలాంటి కారణం తెలియకపోవచ్చు కూడా. ఇలాంటి కండిషన్‌ను క్రిప్టోజెనిక్ అంటారు. సిర్రోసిస్ వల్ల కడుపులో నీరు చేరడం, కాలేయ–వుూత్రపిండాల సవుస్యలు లాంటి ఎన్నో సవుస్యలు వస్తాయి. సిర్రోసిస్ వచ్చినప్పుడు దానివల్ల వచ్చే కాంప్లికేషన్లను బట్టి ఆహార నియవూలు పాటించాల్సి ఉంటుంది. సిర్రోసిస్ సవుస్య వచ్చినవాళ్లకు సాధారణ సవుతుల ఆహారం ఇవ్వాలి. అంటే... అన్ని రకాల పోషకాలు సమంగా అందేలా... ఆహారంలో పళ్లు, కూరగాయలు, పాలు, పాల ఉత్పాదనలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. లివర్ సిర్రోసిస్ వచ్చినవాళ్లలో కడుపులో ద్రవాలు చేరడం, కాలేయవాపు, పోర్టల్ రక్తనాళంలో ప్రెషర్ ఉన్నట్లయితే... అలాంటివారికి ఉప్పు (సోడియం) ఎక్కువగా ఉండే పదార్థాలు ఇవ్వకూడదు. అంటే వారికి ఆహారంలో పచ్చళ్లు, అప్పడాలు, బేకరీ ఐటమ్స్, ఉప్పు ఎక్కువగా ఉండే చిప్స్ (సాల్టెడ్ చిప్స్), ఉప్పులో వేయించిన జీడిపప్పు (సాల్టెడ్ నట్స్), సాస్‌లు, జామ్‌లు వంటివాటిని పూర్తిగా అవాయిడ్ చేయాలి. సిర్రోసిస్వల్ల హెపాటిక్ ఎన్‌కెఫలోపతి అనే వూనసిక సవుస్య వస్తే నాన్వెజిటేరియన్ ప్రోటీన్స్ ఇవ్వడం సరికాదు. -
ఆరోగ్యం ‘దుమ్ము’కొట్టుకుపోతోంది.. తాండూరులో రోజూ 100 మంది..
Unhygienic Hotels And Roadside Foods: హోటల్ ఫుడ్ తింటున్నారా.. అయితే అంతే సంగతి.. ఫుడ్ పాయిజన్ అయి ఆస్పత్రిలో చేరాల్సిందే. ఇటీవలి కాలంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో నమోదవుతున్న కేసులే ఇందుకు నిదర్శనం. ఆహార భద్రతాప్రమాణాలను పాటించకుండా ఫ్రిజ్‌లో నిల్వ చేసిన పదార్థాలను, రోడ్డుపై చేసిన పదార్థాలను తిని జనాలు రోగాలబారిన పడుతున్నారు. హోటళ్ల నిర్వాహకులు కుళ్లిన, కలుషిత ఆహారాన్ని రుచికరంగా అందించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. చర్యలు తీసుకోవాల్సిన ఫుడ్ సెఫ్టీ అధికారులు, మున్సిపల్, రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు. తాండూరు మున్సిపాలిటీలోని హోటళ్లు, రోడ్‌సైడ్ ఫుడ్‌పై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. సాక్షి, వికారాబాద్: జిల్లాలోనే పారిశ్రామిక పట్టణంగా పేరున్న తాండూరు మున్సిపాలిటీలో హోటళ్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. వ్యాపార పరంగా ప్రతిరోజు వేల సంఖ్యలో ప్రజలు ఇతర ప్రాంతాల నుంచి పట్టణానికి వస్తుంటారు. వచ్చిన వారు తాండూరు ప్రాంతంలోని ఏదో ఒక హోటల్లో కడుపు నింపుకోవాలి. అయితే హోటల్ నిర్వాహకులు వారికి పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారం అందించడంలేదంటూ విమర్శలు ఉన్నాయి. కలుషిత ఆహారం తిన్న ఎంతోమంది ఫుడ్ పాయిజన్ బారిన పడి అనారోగ్యానికి గురవుతున్నారు. తాండూరు పట్టణంలోని బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ ప్రాంతాలతో పాటు ప్రధాన కూడళ్లలో ఉన్న హోటళ్లలో కలుషిత ఆహారం అందించి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. గతంలో మున్సిపల్ అధికారులు హోటళ్లను తనిఖీ చేయగా కుళ్లిన పదార్థాలతో పాటు కుళ్లిపోయిన చికెన్, మటన్‌ను గుర్తించారు. అప్పట్లో పలు హోటళ్లను సీజ్ చేశారు. అలాగే రోడ్‌సైడ్ ఉండే టిఫిన్ సెంటర్లు, చాట్ భండార్లలో సైతం నాణ్యమైన పదార్థాలను అందించడం లేదనే విమర్శలున్నాయి. ( చదవండి: తవ్వకాల్లో బయటపడ్డ 4500 ఏళ్ల నాటి సూర్యదేవాలయం.. ఎక్కడంటే? ) రెండేళ్లుగా పర్యవేక్షణ కరువు జిల్లాలో ఆహార భద్రత ప్రమాణాలను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు జిల్లాకు ఫుడ్ సేఫ్టీ అధికారి ఉండాలి. అయితే జిల్లా ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు ఫుడ్ సెఫ్టీ అధికారిని నియమించలేదు. దీంతో తాండూరు పట్టణంలో మున్సిపల్ అధికారులే హోటళ్లలో తనిఖీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే రెండేళ్లుగా మున్సిపల్ అధికారులు కూడా హోటళ్లను తనిఖీ చేయడం లేదు. మున్సిపాలిటీలో ఇన్చార్జి కమిషనర్ ఉండటంతో సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. రోగాలబారిన పడుతున్న ప్రజలు తాండూరు ప్రాంతంలో ఉన్న హోటళ్లలో కలుషిత ఆహారం తిని ప్రతిరోజు 100 మందికి పైగా అనారోగ్యానికి గురవుతున్నారు. పట్టణంలో అధికంగా రోడ్లపైనే టిఫిన్ సెంటర్లు, చాట్ బంఢార్లను నిర్వహిస్తున్నారు. పట్టణంలో దుమ్ము, కాలుష్యం అధికంగా ఉంది. గాలిలో ఉన్న దుమ్ము మొత్తం ఆహార పదార్థాలపై పడి కలుషితం అవుతోంది. అది తిన్నవారు ఫుడ్ పాయిజన్‌కు గురై ఆస్పత్రుల పాలవుతున్నారు. అధికారులు ఆహార భద్రతపై దృష్టి సారించకపోతే రానున్న రోజుల్లో ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్యులు అంటున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. ఇప్పటికైనా ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు, మున్సిపల్ అధికారులు హోటళ్లపై దాడులు చేసి నాణ్యతా ప్రమాణాలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. చదవండి: ‘అత్యాచారం చేసి.. పెళ్లి చేసుకుంటే కేసు కొట్టేయాలా?’ -
మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం కన్నుమూత
బూర్గంపాడు: మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం(65) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. గత 50 రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా శనివారం బ్రెయిన్ స్ట్రోక్ రావటంతో మృతి చెందారు. బూర్గంపాడు నియోజకవర్గ శాసనసభ్యుడిగా 1989, 1994 ఎన్నికల్లో సీపీఐ తరఫున పోటీచేసి విజయం సాధించారు. పదేళ్లపాటు ఎమ్మెల్యేగా బూర్గంపాడు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు. ఆ తర్వాత కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆదివాసీ సమస్యలపై కుంజా భిక్షం నిరంతర పోరాటాలను కొనసాగించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సమయంలో రెండేళ్లు పార్టీలో పని చేశారు. అనంతరం బీజేపీలో చేరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం మరణం పట్ల సీఎం కె.చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తంచేశారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. చదవండి: అందరికీ ఉచితంగా టీకా: సీఎం కేసీఆర్ చదవండి: దొరక్క దొరికిన ఆస్పత్రి బెడ్.. అంతలోనే -
కే4 పులికి ఒంట్లో బాగోలేదా.. ?
సాక్షి, భీమారం(చెన్నూర్): రెండేళ్లుగా భీమారం, చెన్నూర్, కోటపల్లి మండలాల్లోని అడవుల్లో సంచరిస్తూ పశువులపై దాడి చేసి హతమార్చిన కే4 పెద్దపులి ఆరోగ్యం వేటకు సహకరించట్లేదు. దీంతో మరో పులి దానికి ఆహారం అందిస్తోంది. శనివారం భీమారం మండలంలోని కాజిపల్లి అడవుల్లో మేత కోసం వెళ్లిన పశువుల మందపై దాడి చేసిన సమయంలో రెండు పెద్ద పులులు ఉన్నాయని పశువుల కాపరులు పేర్కొనడంతో అటవీశాఖ అధికారుల అనుమానాలు నిజమయ్యాయి. రెండేళ్ల క్రితం ఈప్రాంతానికి వచ్చిన ఆడపులికి వేటగాళ్లు అమర్చిన ఇనుపవైర్లు శరీరం చుట్టూ ఉండి తీవ్ర గాయాలయ్యాయి. పులి ఉచ్చుని తొలగించేందుకు అటవీశాఖ తీసుకున్న చర్యలు ఫలించలేదు. పెద్దపులిని బంధించి దానికి ఉన్న ఇనుప వైర్లు తొలగించేందుకు అడవుల్లో బోన్లు ఏర్పాటు చేసి ఎరగా దూడలు కట్టేసి ఉంచినా అధికారుల పాచికలు పారలేదు. అనేక నెలల పాటు ఈ ఆపరేషన్ నిర్వహించినా పులి చిక్కలేదు. దీంతో పులికి చికిత్స చేయించాలనే ఆలోచనని అటవీశాఖ పక్కకు పెట్టింది. (భూపాలపల్లి అడవుల్లో మగ పులి) గొల్లవాగు ప్రాజెక్ట్ కేంద్రంగా భీమారం సమీపంలోని గుట్టల మధ్య నిర్మించిన గొల్లవాగు ప్రాజెక్ట్ నీటివనరులు పెద్దపులికి అనుకూలంగా మారాయి. ప్రాజెక్ట్‌కు అతి సమీపంలో ఉన్న పులిఒర్రెలో పెద్దపులి నివాసం ఏర్పర్చుకొని అక్కడనుంచి చెన్నూర్ మండలం బుద్దారం, కోటపల్లి మండలంలోని అడవుల్లో సంచరిస్తోంది. అయితే సంవత్సరం క్రితం వచ్చిన మగపులి ఆడపులిని అక్కున చేర్చుకుంది. కొన్నాళ్ల పాటు రెండు వేర్వేరుగా తిరిగి వచ్చి ఆవాసానికి చేరుకునేవి. ప్రతిరోజు వేర్వేరుగా ఆహారం వేటాడి తినేవి. రెండు నెలల క్రితం ఏ2 మగపులి మరొకటి ఈప్రాంతానికి వచ్చినా ఆవాసం లభించకపోవడంతో తిరిగి వెళ్లిపోయింది. క్షీణిస్తున్న ఆరోగ్యం ఆడపులి శరీరం చుట్టూ ఉన్న ఇనుప వైరు కారణంగా అది ఇంతవరకూ గర్భం దాల్చడం లేదని అటవీశాఖ అధికారులు అంటున్నారు. ఆరునెలల నుంచి కే4 ఆడపులి ఆరోగ్యం క్షీణిస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. కనీసం ఆహారం కోసం వేట కూడా చేయలేని స్థితికి అది చేరుకుంది. తోడుగా ఏ1.. క్షీణిస్తున్న ఆరోగ్యంతో వేటాడలేని పరిస్థితుల్లో ఉన్న ఆడపులికి మగ పులి తోడుగా ఉంటూ అడవిజంతువులతో పాటు పశువులపై దాడి చేసి ఆహారం అందిస్తుందని అటవీశాఖ అధికారులు అంటున్నారు. కాజిపల్లి వద్ద రెండు పశువులను చంపిన పులి వెంట ఉన్న దానికి మరొక దానిని అప్పగించిందని వారు తెలిపారు. దాడి తరువాత భీమారానికి కాజిపల్లి వద్ద రెండు గేదెలను హతమార్చిన పులులు సాయంత్రం గొల్లవాగు ప్రాజక్ట్ సమీపంలోని వాగుకి వచ్చాయని చేపల వేటకు వెళ్లిన వారు పేర్కొన్నారు. చేపలు పడుతుండగా పులుల గాండ్రింపులు వినబడ్డాయని.. దాంతో పరుగెత్తుంటూ గ్రామానికి చేరుకున్నామని తెలిపారు. భయంభయం గతంలో వేర్వేరుగా సంచరించిన పులులు ఇప్పుడు జతకట్టి తిరుగుతుండటంతో భీమారం, నర్సింగాపూర్, కాజిపల్లి తదితర గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. గ్రామానికి కిలోమీటరు దూరంలోనే అడవి ఉంటుందని పశువులను ప్రతి రోజూ అడవికి పంపిస్తుంటామని ఆందోళన చెందుతున్నారు. -
అక్షర యోధునికి ‘అనంత’ అశ్రునివాళి
అనంతపురం కల్చరల్ : అక్షరాలకు నడకలు నేర్పుతూ.. కవిగా అత్యంత ప్రతిష్టాత్మాక జ్ఞానపీఠ అవార్డును దక్కించుకున్న సరస్వతీ పుత్రుడు డాక్టర్ సి. నారాయణరెడ్డికు ‘అనంత’ సాహితీ లోకం అశ్రునివాళులర్పించింది. సినారెగా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయిన నారాయణరెడ్డికు జిల్లాతో ప్రత్యేక అనుబంధముంది. 1994లో జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ కళాశాల వేదికగా ప్రారంభమైన ‘బ్రహ్మశ్రీ కల్లూరు వేంకటనారాయణరావు కళానికేతన్’ కళాభవనాన్ని సినారె ప్రారంభించారు. అనంత కళాపీఠం వ్యవస్థాపకులు ఆంజనేయులు గౌడ్, జనప్రియ కవి ఏలూరు ఎంగన్న స్వయంగా ఆయనతో పాటు అక్కినేని నాగేశ్వరరావును ఆహ్వానించి నగరంలో అప్పట్లో సాహితీ సభ నిర్వహించారు. అనంతరం లలితకళాపరిషత్తులో సినారెను అనంత కవులు, కళాకారులు ఘనంగా సత్కరించారు. కవిత్వవేది బిరుదాంకితులైన జిల్లా వాసి కల్లూరు వేంకటనారాయణరావు రచించిన ‘శ్రీమదశోక చరిత్రము’ కావ్యం తాను ఎంఏ చదివేరోజుల్లో ప్రత్యేక పాఠ్యాంశంగా ఉండేదంటూ ఆ రోజుల్లో సినారె పేర్కొన్నారు. అనంత కవులు ఎవరికి తీసిపోని ఘనాపాటీలని నాటి సభలో సినారె ప్రత్యేకంగా ప్రస్తావించారు. అనంతర కాలంలో కూడా రాష్ట్రస్థాయిలో పలు వేదికలపై సాగిన సాహితీసభల్లో సినారె అనంత వాసులతో ప్రత్యేకంగా చర్చలు సాగించిన సందర్భాలెన్నో ఉన్నాయని ఎంగన్న కవి గుర్తు చేసుకున్నారు. సినారె మృతికి సంతాపం సోమవారం ఉదయం సినారె మృతి వార్త వినగానే పలు సాహితీ, కళా సంస్థలు ఆయనకు శ్రద్ధాంజలి ఘటించాయి. డాక్టర్ ఉమర్ ఆలీషా సాహితీ సమితి జిల్లా నిర్వాహకులు రియాజుద్దీన్, చింతా వెంకటేశ్వర్లు, రఘురామయ్య, ద్విభాషా కవి జూటూరు షరీఫ్, ఎల్ఆర్ వెంకటరమణ తదితరులు సంతాపం తెలిపారు. తెలుగు భాషా వికాస ఉద్యమ సారధులు జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి, దాసరి హరిశ్చంద్రరామ, సాహితీ స్రవంతి నిర్వాహకులు పిళ్లా కుమారస్వామి, రవిచంద్ర, విశాలాంధ్ర మేనేజర్ చెట్ల ఈరన్న సంతాప సభలు నిర్వహించి సినారె విశిష్టతను గుర్తుకు చేసుకున్నారు. ప్రసిద్ధ కథా రచయితలు డాక్టర్ శాంతినారాయణ, సింగమనేని నారాయణ, మధుర కవి మల్లెల నరసింహ మూర్తి, నాట్యాచార్యులు పట్నం శివప్రసాద్, పద్మనాభరెడ్డి, లలితకళాపరిషత్తు అధ్యక్ష, కార్యదర్శులు మేడా సుబ్రహ్మణ్యం, నారాయణస్వామి, రాము తదితరులు సినారె మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన సాహితీ సేవలు చిరస్మరణీయమని, సాహితీలోకానికి తీరని లోటన్నారు. సినారె సాహితీ సేవలు చిరస్మరణీయం ప్రఖ్యాత కవి సి.నారాయణరెడ్డి తెలుగు సాహిత్యానికి చేసిన సేవలు చిరస్మరణీయమని మంత్రులు కాలువ శ్రీనివాసులు, పరిటాల సునీత,, కలెక్టర్ వీర పాండియన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సినారె మృతి వార్త వినగానే దిగ్భ్రాంతికి గురయ్యామని, తెలుగు భాషా వికాసానికి సినారె అనన్యమైన సేవలందించారని వారు కొనియాడారు. అదేవిధంగా అభ్యుదయ రచయితల సంఘం (అరసం) అధ్యక్షులు రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, కవి నానీల నాగేంద్ర ప్రగాఢ సంతాపం తెలిపారు. అజరామర సేవలతో సినారె చేసిన సాహితీ కృషి ప్రతి తెలుగు వాడి హృదయంలో నిలిచిపోతుందని అభిప్రాయపడ్డారు. -
జయలలితకు ఇంటి భోజనం
సాక్షి, చెన్నై: తమిళనాడు సీఎం జయలలితకు ఇంటి భోజనం అందిస్తున్నట్లు తెలిసింది. రవ్వతో తయారు చేసిన కిచిడీని ఆమె స్వీకరించినట్లు సమాచారం. ఆమె గత 46 రోజులుగా చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. సోమవారం అపోలో ఆవరణలోని వినాయకస్వామి ఆలయంలో పూజల అనంతరం ఆమెను ప్రత్యేక వార్డుకు మార్చనున్నారు. దీంతో సీఎంకు అన్ని వసతులతో కూడిన ప్రత్యేక గదిని సిద్ధం చేసినట్లు అన్నాడీఎంకే వర్గాలు తెలిపాయి -
పది రోజుల్లో ఇంటికి జయలలిత
అరుణగిరినాథర్ వెల్లడి సాక్షి, చెన్నై: తమిళనాడు సీఎం జయలలిత పది రోజుల్లో సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరుకుంటారని మధురై ఆధీనం అరుణగిరినాథర్ పేర్కొన్నారు. శనివారం అపోలో ఆసుపత్రిలో సీఎం జయలలిత ఆరోగ్యంపై విచారించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జయలలిత ఆరోగ్యంగా ఉన్నారని, సంపూర్ణ ఆరోగ్యంతో మరో పది రోజుల్లో ఇంటికి చేరుకుంటారని చెప్పారు. తమిళ సినీ సంగీత దర్శకుడు శంకర్ గణేషన్ కూడా జయలలిత ఆరోగ్య పరిస్థితిని అపోలో ఆసుపత్రి వర్గాలతో కనుక్కున్నారు. అమ్మ ఆరోగ్యం మెరుగుపడిందని, ఆమె మళ్లీ ప్రజాసేవకు అంకితం కానున్నారని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి ఆనందం వ్యక్తం చేశారు. జయలలిత 45 రోజులుగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. -
పది రోజుల్లో ఇంటికి జయలలిత
-
‘అమ్మ’ డిశ్చార్జికి సన్నాహాలు
స్వయంగా ఆహారం తీసుకుంటున్న జయలలిత సాక్షి, చెన్నై: తమిళనాడు సీఎం జయలలిత దాదాపుగా కోలుకున్న నేపథ్యంలో అపోలో ఆస్పత్రి నుంచి ఆమెను డిశ్చార్జి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. జయలలిత అనారోగ్యానికి గురై గత నెల 22వ తేదీ నుంచి చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. దేశ, విదేశీ వైద్యులు అందించిన చికిత్సలతో ఆమె పూర్తిగా కోలుకుని, స్వయంగా ఆహారం తీసుకుంటున్నారు. చికిత్స చేస్తున్న వైద్యులతో సంభాషిస్తున్నారు. లండన్ నుంచి వచ్చిన డాక్టర్ రిచర్డ్ మంగళవారం కూడా సీఎంకు జరుగుతున్న చికిత్సను పర్యవేక్షించి సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. దీపావళి పండుగలోగా అమ్మ ఇంటికి చేరుకోవాలని అన్నాడీఎంకే శ్రేణులు ఆశిస్తున్న తరుణంలో జయలలిత డిశ్చార్జ్ పై ఈనెల 27లోగా అపోలో ఆస్పత్రి నుంచి ఒక ప్రకటన విడుదల అవుతుందని సమాచారం. కాగాజయలలిత సంపూర్ణ ఆరోగ్యవంతురాలు కావాలని కోరుతూ తిరువణ్ణామలైలో అన్నాడీఎంకే కార్యకర్తలు నిర్వహించిన పాలబిందెల ఊరేగింపులో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ వృద్ధురాలు మృతి చెందగా మరో 16 మంది సొమ్మసిల్లారు. -
విధి వంచితులు
– అనారోగ్యంతో తల్లి మత్యువాత – పదేళ్ల క్రితమే తండ్రి – అనాథలైన ఇద్దరు బాలికలు గుండ్రాంపల్లి(చిట్యాల) ఆలనాపాలన చూడాల్సిన తండ్రి పదేళ్ల క్రితమే తనువుచాలించాడు.. కాయకష్టం చేసి బిడ్డలకు అండగా ఉన్న తల్లి కూడా అనారోగ్యంతో మత్యుఒడికి చేరింది. నా అనేవారు లేక ఇద్దరు బాలికలు విధి వంచితులయ్యారు. ఈ విషాదకర ఘటన చిట్యాల మండలం గుండ్రాపల్లిలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గాదిరి లింగస్వామి, యాదమ్మ దంపతులకు ఇద్దరు బాలికలు విజయ, తులసి.పదేళ్ల క్రితం భర్త లింగస్వామి మతిచెందాడు. దీంతో యాదమ్మ కూలిపనులు చేస్తూ పిల్లలను పోషించుకుంటోంది. ఆమె కూడా అనారోగ్యంతో గురువారం మతిచెందింది. దీంతో ఆమె ఇద్దరు పిల్లలు విజయ, తులసిలు అనాథలయ్యారు. పెద్దకూతురు విజయ తల్లి యాదమ్మకు తలకొరివి పెట్టి అంత్యక్రియలు పూర్తి చేసింది. అనాథలుగా మారిన బాలికలను ప్రభుత్వం అదుకోవాలని ఆ గ్రామ ఎంపీటీసీ బండ గిరిజ, అంజయ్య కోరారు. -
కాలం చెల్లిన బిస్కెట్లు
జోగిపేట: కాలం చెల్లిన బిస్కెట్లను విక్రయిస్తుండటంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. పార్లే కంపెనీకి చెందిన హైడ్ అండ్ సీక్ అనే బిస్కట్ (33 గ్రాములు)లను పట్టణంలో విక్రయిస్తున్నారు. ఈ బిస్కెట్లను జనవరి 20, 2016లో తయారు చేశారు. బిస్కెట్ ప్యాకెట్‌పై ఎక్స్పైరీ తేదీ ఆరు మాసాలు అని ఉంది. అయినా స్థానిక డీలర్లు యథావిధిగా బిస్కెట్ ప్యాకెట్లను పట్టణంలోని కిరాణం, బేకరీ, జనరల్ స్టోర్స్, మెడికల్షాప్లకు విక్రయిస్తున్నారు. దుకాణ యజమానులు కూడా వాటిని చూసుకోకుండానే విక్రయాలు జరుపుతున్నారు. శనివారం మండల అభివృద్ధి కార్యాలయ ఉద్యోగి రామకృష్ణారెడ్డి బిస్కెట్ల కోసం పట్టణమంతా తిరిగారు. అందరి దగ్గర ఉన్నా కాలం చెల్లిన బిస్కెట్లే ఉన్నాయి. దీంతో విషయం వెలుగుచూసింది. -
పట్టాలపై తల పెట్టి రైల్వేఉద్యోగి..దారుణం
అడ్డగుట్ట: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ రైల్వే ఉద్యోగి రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. సికింద్రాబాద్ రైల్వే పోలీస్‌స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ కథనం ప్రకారం...లాలాగూడ వర్క్‌షాప్‌లో కళాసిగా పని చేస్తున్న రామోళ్ల రాజేశ్వర్‌రావు కొంత కాలం క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో ఉద్యోగానికి కూడా సరిగ్గా వెళ్లలేకపోతున్నాడు. ఈ క్రమంలో జీవితం పై విరక్తి చెందిన రాజేశ్వర్ ఆదివారం ఉదయం లాలాగూడ రైల్వే స్టేషన్ సమీపంలో ట్రైన్ వస్తుండగా పట్టాలపై తలపెట్టి పడుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. -
తలలు వాల్చేస్తున్నారు
చినకాపవరం(ఆకివీడు): ఆకివీడు మండలం చినకాపవరం పాఠశాలలో మరికొందరు విద్యార్థులు అస్వస్థత బారినపడ్డారు. బుధవారం గంట వ్యవధిలోనే 24 మంది విద్యార్థులు తలలు వాల్చేసి కళ్లుతిరిగి పడిపోయారు. వీరిలో కొందరు కడుపునొప్పి, కళ్లమంటలు, కాళ్లు,చేతులు మెలితిరిగిపోవడంతో కుప్పకూలిపోయారు.దీంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తోటి విద్యార్థులు కలవరపడ్డారు. ఇంటి వద్ద నుంచి చెంగు చెంగున పాఠశాలకు వచ్చిన విద్యార్థులు తరగతి గదిలో కూర్చున్న కొద్దిసేపటికే ఇలా అస్వస్థతకు గురికావడం ఆందోళన కలిగిస్తోంది. ఇదే పాఠశాలలో మంగళవారం కూడా నలుగురు విద్యార్థులు అస్వస్థత బారిన పడిన విషయం తెలిసిందే. గత కొన్నిరోజులుగా రోజుకు నలుగురైదుగురు అస్వస్థతకు గురవుతున్నారని స్థానికులు చెబుతున్నారు. చిన్నారులు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నట్టు చెబుతున్నారు. బుధవారం విద్యార్థులు ఎం.త్రివేణి, ఎన్.దుర్గాభవాని, కె.భవాని, భువనేశ్వరి, పి.రూపశ్రీ, డి.కావేరి, ఒ.పద్మ, వి.ఓంకార్ సత్య, సిహెచ్.దేవిక, పి.శిరీష, జి.లక్ష్మణసాయి,జి.రాజ్యలక్ష్మి, జి.కళతోపాటు మరో 12 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఏడుగురిని భీమవరం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, మరికొందరికి పాఠశాలలోనే బల్లలపై పడుకోబెట్టి వైద్యులు చికిత్స చేశారు. కొందరిని తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకువెళ్లిపోయారు. పెదకాపవరం పీహెచ్సీ వైద్యాధికారి టి.రవికిరణ్‌రెడ్డి విద్యార్థుల ఆరోగ్యపరిస్థితిని పరిశీలించారు. ప్రథమ చికిత్స చేశారు. ప్రత్యేక వైద్య బృందం .. చినకాపవరం హైస్కూల్లో విద్యార్థుల అస్వస్థత గురవుతున్న విషయాన్ని ఎమ్మెల్యే వి.వి.శివరామరాజు కలెక్టర్ కె.భాస్కర్‌కు వివరించారని ఏఎంసీ చైర్మన్ మోటుపలి ప్రసాద్ విలేకర్లకు తెలిపారు. గురువారం పాఠశాలకు జిల్లా నుంచి ప్రత్యేక వైద్య బృందాన్ని పంపుతామని కలెక్టర్ చెప్పారని వివరించారు. విద్యార్థులకు సహకారం అస్వస్థతకు గురైన విద్యార్థులకు పాఠశాల అభివృద్ధి కమిటీ బాసటగా నిలిచింది. విద్యార్థులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఓఆర్ఎస్ ఆపిల్ జ్యూస్, పళ్ల రసాలు, మందులు అందజేసింది. కాళ్లు చేతులు వంకర్లు తిరిగిన విద్యార్థులకు జెడ్పీటిసీ సభ్యులు మన్నే లలితాదేవి, ఎంపీపీ నౌకట్ల రామారావు, ఏఎన్ఎంలు సపర్యలు చేశారు. అభివృద్ధి కమిటీ ప్రతినిధులు ఐఎస్ఎన్.రాజు, మర్రివాడ వెంకట్రావులు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులతో పరీక్షలు చేయించి మందులు అందజేస్తున్నారు. అంతు చిక్కడంలేదు చినకాపవరం ఉన్నత పాఠశాలలోని విద్యార్థులు ఎందుకు అస్వస్థతకు గురవుతున్నారన్నది విషయం అంతుచిక్కడంలేదు. ఇది వేస్సేవ్గల్ సింకోష్ అనే రకమైన వ్యాధిగా భావిస్తున్నాం. మానసిక వత్తిడి వల్ల ఇది వస్తుంది. న్యూరాలజిస్ట్ పరీక్షిస్తే బాగుంటుంది. ఇది అంత ప్రమాదకరం కాదు. ఇదొక మానసిక వ్యాధి లాంటిది. – టి.రవికిరణ్‌రెడ్డి, ప్రభుత్వ వైద్యాధికారి, పెదకాపవరం. లోపం ఎక్కడుందో పరిశీలించాలి చినకాపవరం హై స్కూల్ విద్యార్థులు అస్వస్థతకు గురికావడానికి కారణాలు అంతుచిక్కడంలేదు. లోపం ఎక్కడుందో పరిశీలించాలి. పాఠశాల ఆవరణ, ఆహారంలో లోపాలు లేవు. స్థానికులు సెల్ టవర్ వల్లే ఇది వస్తుందని చెబుతున్నారు. దీనిపై కూడా పరిశీలన జరపాలి. పది రోజులుగా విద్యార్థులు అస్వస్థతకు గురవుతుంటే దీనిని నిలుపుదల చేయాల్సిన అవసరం ఉంది. –మద్దూరి సూర్యనారాయణమూర్తి, డివైఇఓ, భీమవరం భీమవరంలో చికిత్స భీమవరం టౌన్ : భీమవరం తరలించిన కాటిక హేమలత 7వ తరగతి (చినకాపవరం), గుబ్బల రాజ్యలక్ష్మి 7వ తరగతి (చినకాపవరం), గోడి కళ 7వ తరగతి(రామయ్యగూడెం), బొడ్డిచర్ల వెంకటలక్ష్మి 6వ తరగతి(దండగర్ర), పొనమండి శిరీష 7వ తరగతి (గుమ్ములూరు), కోట భవాని 10వ తరగతి (గుమ్ములూరు), మామిడిపల్లి వరలక్ష్మి 10వ తరగతి (తరటావ)కి ఇక్కడి వైద్యులు కృష్ణ కిశోర్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించారు. సిలైన్లు ఎక్కించారు. రెండు రోజులుగా చేరిన విద్యార్థినులకు వైద్య పరీక్షలు చేశామని ల్యాబ్ నుంచి రిపోర్ట్ రావాల్సి ఉందని వారు చెప్పారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వెల్లడించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుని ఆందోళనకు గురయ్యారు. చినకాపవరం జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులు ఆస్పత్రి వద్ద విద్యార్థులకు, వారి కుటుంబ సభ్యులకు అల్పాహారాలు ఏర్పాటు చేశారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. -
బాలిక ఆత్మహత్య
సదాశివనగర్ : అనారోగ్యంతో బాధపడుతున్న ఓ బాలిక జీవితంపై విరక్తి చెంది ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సదాశివనగర్ మండలం ఉప్పల్వాయిలో బుధవారం జరిగింది. హెడ్‌కానిస్టేబుల్ సుబ్రహ్మణ్య చారి, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్వాయికి చెందిన కుమ్మరి రేఖ(16)కు పుట్టినప్పటి నుంచి మూర్చ వ్యాధి ఉంది. ఆస్పత్రుల్లో చూయించినా నయం కాలేదు. పేదకుటుంబానికి చెందిన రేఖ ఆమె తండ్రి బాలయ్య ఇద్దరు కలిసి గుడిసెలో నివాసం ఉంటున్నారు. బాలయ్యకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య రాజవ్వకు ముగ్గురు కుమార్తెలు లక్ష్మి, మణెమ్మ, స్వప్నలు ఉన్నారు. కాగా ఆ ముగ్గురి వివాహాలు జరిగాయి. అనంతరం అనారోగ్యంతో 18 ఏళ్ల క్రితం రాజవ్వ మృతి చెందింది. అనంతరం పిట్లం మండలం చిల్లర్గ నుంచి రెండో భార్యగా హన్మవ్వను చేసుకున్నాడు. రేఖ అనే అమ్మాయి జన్మించింది. కొద్ది రోజులకు హన్మవ్వ, బాలయ్యల మధ్య కుటుంబ గొడవలు తలెత్తాయి. రేఖ చిన్న వయస్సులో ఉన్నప్పుడే హన్మవ్వ ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో తండ్రి బాలయ్య కుమార్తెను పెంచి పెద్ద చేశాడు. రేఖకు మూర్చ వ్యాధి ఉండడంతో నన్ను చూసే వారు లేరని జీవితంపై విరక్తి చెంది నివాసం ఉంటున్న గుడిసెలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటలకు నివాసపు గుడిసె దగ్ధమైంది. వేడికి తట్టుకోలేక పక్కనే ఉన్న బాత్రూమ్లోకి పరుగెత్తింది. శరీరం పూర్తిగా కాలిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనా స్థలం వద్దనే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య
ములకలచెరువు(చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా ములకలచెరువు పట్టణానికి చెందిన ఆర్. మల్లికార్జున(48) అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ శనివారం ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కూలిపని చేసుకుని జీవించే మల్లికార్జున నాలుగు సంవత్సరాలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడేవాడు. ఎక్కడ చూపించినా జబ్బు నయం కాకపోవడంతో తీవ్ర వేదనకు గురైన ఆయన శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. -
బండారు దత్తాత్రేయకు అస్వస్థత
-
అనారోగ్యంతో వైఎస్సార్సీపీ నాయకురాలి మృతి
అనంతపురం: వైఎస్సార్సీపీ నాయకురాలు అనారోగ్యంతో కన్నుమూశారు. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం బైరసముద్రం వైఎస్సార్సీపీ గ్రామ సర్పంచ్ గుడ్ల వన్నూరమ్మ(52) శుక్రవారం ఉదయం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను గురువారం బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందారు. ఆమె మృతిపై వైఎస్సార్సీపీ నాయకులు సంతాపం తెలిపారు. -
వివేకం: మీ శరీర తయారీదారు ఎవరు?
అంటువ్యాధులు వేరు; అవి బయటి నుండి జరిగే దాడి. వాటికి కొన్ని రకాల మందులు అవసరమౌతాయి. కాని దీర్ఘకాలిక అనారోగ్యం అంటే, మన లోపల మనమే సృష్టించుకునే కొన్ని లోపాల వల్ల మాత్రమే ఎక్కువగా వచ్చేవి. డెబ్భై శాతం పైగా దీర్ఘవ్యాధులను మనమే సృష్టించుకుంటున్నాం. శరీరంలోని ప్రతి కణానికీ బతికి ఉండాలనే ఒక సహజమైన తపన ఉంటుంది. ఇలా ఉన్నప్పటికీ, మన శరీరానికి వ్యతిరేకంగా అవి ఎందుకు పనిచేస్తాయి? శరీరం సంగతి చూద్దాం. ప్రస్తుతం ఉన్న ఇంత ఆకారంలో పుట్టలేదు మనం. తల్లి గర్భంలో కేవలం రెండు కణాలుగా మీరు మొదలయ్యారు. ఒక శిశువుగా బయటికి వచ్చారు. ఇప్పుడేమో ఇంత పెరిగారు. ఇదంతా ఎలా జరిగింది? ఈ శరీరాన్ని సృష్టిస్తున్న మౌలిక శక్తి ఏదో ఈ పనిచేసింది. అదే సృష్టికి ఆధారం. దానిని మీరు సృష్టికర్త అంటున్నారు. మీ జీవితపు అనుక్షణమూ, ఆ సృష్టి మీ శరీరం లోపలి నుంచే పనిచేస్తోంది. ఈ శరీరాన్ని తయారుచేసేవాడు లోపలే ఉన్నాడు. మీరు ఏదైనా ఒక మరమ్మతు చేయించాలనుకోండి. మీరు తయారుచేసినవాడి దగ్గరకు వెళ్దామనుకుంటారా? లేకపోతే దగ్గరలో అందుబాటులో ఉండే మెకానిక్ దగ్గరకా? మీకు తయారీదారు చిరునామా తెలియకపోతే, అప్పుడు దగ్గరలోని మెకానిక్ దగ్గరకు వెళ్తారు. కానీ మీకు తయారీదారు తెలిసినవాడైతే, అతని వద్దకు వెళ్లే చనువు ఉంటే, కచ్చితంగా తయారీదారు దగ్గరకే వెళ్తారు. అవునా? మీ లోపల మీరు సృష్టించుకునే వాటన్నింటికీ, దగ్గరలో అందుబాటులో ఉండే డాక్టర్ దగ్గరకు పరిగెత్తితే ప్రయోజనం లేదు. ఆధునిక వైద్యశాస్త్రం దీర్ఘ రోగాలను మేనేజ్ చేసుకోవడానికి మాత్రమే మీకు సహాయం చేస్తుంది. మిమ్మల్ని దీర్ఘరోగాల బారి నుండి ఎప్పటికీ బయటకు పడవేయలేదు. ఎందుకంటే దీర్ఘరోగాలు బయట నుండి రాలేదు కాబట్టి. అవి బయట నుండి వచ్చి ఉంటే, వాళ్లు వాటిని మీ నుంచి తీసివేసేస్తారు. కానీ అవి లోపల నుండే వస్తున్నప్పుడు, మీరే వాటిని సృష్టిస్తున్నప్పుడు, మిమ్మల్ని వాటి నుండి వారు ఎలా వదిలించగలరు? ఆరోగ్యం కేవలం భౌతికమైన అంశం కాదు. మనసులో జరిగేది ఏదో, సహజంగా అదే శరీరంలో కూడా కలుగుతుంది. తిరిగి శరీరంలో జరిగేది ఏదో, అదే మనసులో కలుగుతుంది. అందుచేత, ఇక్కడ మనం ఎలా జీవిస్తున్నాము, మన వైఖరి, మన భావోద్వేగాలు, మన మానసిక స్థితి, మనం జరిపించే కార్యకలాపాల స్థాయి, మన ఆలోచనలు... ఇవన్నీ మన ఆరోగ్యంతో తప్పనిసరిగా ముడిపడి ఉండే భాగాలు. మీ శరీరం తయారీదారు దగ్గరకు వెళితే వీటన్నిటికీ చికిత్స ఉంటుంది. ఆరోగ్యం అంతర్గతంగా కలగాలంటే, లోపల కొంత ఇంజనీరింగ్ చేయాలి మనం. శరీరం, బుద్ధి, భావాలు, ప్రాణశక్తి - అన్నీ చక్కటి సమతుల్యతలో ఉండే వాతావరణాన్ని, సృష్టించుకోవాలి కొన్ని సరళమైన ప్రక్రియలతో శరీరాన్నీ, బుద్ధినీ సంపూర్ణ ఆరోగ్యంతో నిర్మించుకోవచ్చు. నేను చెప్పే ‘ఇన్నర్ ఇంజనీరింగ్’ అంటే, సరిగ్గా అదే. మీ తయారీదారుని వద్దకు రహదారి నిర్మించటం. ఇక అప్పుడు ఆరోగ్యంగా ఉండటం మీ పనికాదు, ఆరోగ్యాన్ని ఇవ్వడం అతని వంతు కార్యక్రమం అవుతుంది. సమస్య - పరిష్కారం ప్రస్తుత అధిక జనాభా పరిస్థితుల్లో, నేను ఒక బిడ్డతోనే సరిపెట్టుకుందామనుకుంటున్నాను. ఇంట్లో తల్లిదండ్రులు మరొకరినైనా కనమని బలవంతపెడుతున్నారు. మీ సలహా ఏమిటి? - ఎం.వెంకటేశ్, చిత్తూరు సద్గురు: భారతదేశ ప్రస్తుత జనాభా ఒక బిలియన్ కంటే ఎక్కువ. ఇంతమందికి సరిపోయేంత భూమి, నీరు, పర్వతాలు, కనీసం ఆకాశం కూడా లేదు. 60% కంటే ఎక్కువ గ్రామీణ జనాభాకు, శరీర నిర్మాణం సరిగా లేదు. వారి శరీరం, మెదడు పూర్తి స్థాయికి ఎదగడం లేదు. కారణం, గర్భస్త శిశు దశ నుంచి వారికి తగిన పోషణ అందడం లేదు. 35% మంది పిల్లలు బరువు తక్కువతో పుడుతున్నారు. ఈ కారణాన వారు ఎప్పటికీ సరిగా ఎదగలేరు. ఏ పిల్లలకైతే, పిండ దశలో పోషకాహార సమస్యలుంటాయో, ఎవరైతే సరైన బరువుతో పుట్టరో, వారికి మీరు ఏమి చేసినా, వారి జీవితంలో వారి శరీరము, మెదడు పరిపూర్ణంగా ఎదగదు. అంటే, మనం ఒక పరిపుష్టి లేని సమాజాన్ని తయారుచేస్తున్నాం. ఇది అభివృద్ధి కాదు. నా దృష్టిలో పిల్లలను కనడం కన్నా సరైన పోషణ లేని కొందరి పిల్లలనైనా ఆదుకోవడం ఉత్తమం. మీ పెద్దలకు ఈ విషయాలు మీరు విడమర్చి చెబితే వారు ఒప్పుకోకపోరు. - జగ్గీ వాసుదేవ్