చిత్తూరు జిల్లా ములకలచెరువు పట్టణానికి చెందిన ఆర్. మల్లికార్జున(48) అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ శనివారం ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ములకలచెరువు(చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా ములకలచెరువు పట్టణానికి చెందిన ఆర్. మల్లికార్జున(48) అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ శనివారం ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
కూలిపని చేసుకుని జీవించే మల్లికార్జున నాలుగు సంవత్సరాలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడేవాడు. ఎక్కడ చూపించినా జబ్బు నయం కాకపోవడంతో తీవ్ర వేదనకు గురైన ఆయన శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు.