hanging suicide
-
వైద్యవిద్యార్థిని ఆత్మహత్య
రాజేంద్రనగర్: ఓ వైద్య విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ కనకయ్య తెలిపిన వివరాల ప్రకారం... తమిళనాడు రాష్ట్రానికి చెందిన సెల్వన్ కుటుంబం వ్యాపార నిమిత్తం 2005వ సంవత్సరంలో నగరానికి వలస వచ్చారు. హైదర్‌గూడ న్యూఫ్రెండ్స్ కాలనీలో ఇల్లు నిర్మించుకుని నివసిస్తున్నారు. సెల్వన్ దంపతులకు వినీషా(21) ఒక్కతే కూతురు. ఆమె మొయినాబాద్‌లోని భాస్కర కళాశాలలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతోంది. కాగా ఆదివారం మధ్యాహ్నం తన రూమ్‌లోకి వెళ్లిన వినీషా సాయంత్రం 5 గంటల వరకు బయటకు రాలేదు. దీంతో తల్లిదండ్రులు వెళ్లి చూడగా ఉరి వేసుకొని కనిపించింది. స్థానికులు అందించిన సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. నెలరోజులుగా డిప్రెషన్లో ఉంది: తండ్రి తండ్రి సెల్వన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల రోజులుగా తమ కుమార్తె డిప్రెషన్లో ఉందని, కాలేజీలోని స్నేహితులతో తరచు మాట్లాడుతూ ఏదో విషయమై బాధపడుతోందని సెల్వన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతానికి పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వినీషా సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే దానికి లాక్ ఉండడంతో తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. -
మహిళ ఒత్తిడితో 24 ఏళ్ల యువకుడి ఆత్మహత్య
ఆగ్రా: ఉత్తర ప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) హాస్టల్లో 24 ఏళ్ల టీచర్ ఉరి వేసుకుని మరణించడం కలకలం రేపింది. బాధితుడు అలీగఢ్‌లోని ఏఎన్సీ కాలేజ్‌లో అధ్యాపకుడిగా పనిచేస్తున్న అభిషేక్ కుమార్ సక్సేనాగా పోలీసులు గుర్తించారు. సక్సేనా గురువారం హాస్టల్ గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. అభిషేక్ గత వారం రోజులుగా తన వసతి గృహాన్ని ఖాళీ చేసి హాస్టల్ గదిలో ఉంటున్నాడు. అయితే ఆగ్రాకు చెందిన ఓ మహిళ ఒత్తిడి కారణంగానే అభిషేక్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ‘అభిషేక్ ఆత్మహత్యకు పాల్పడే సమయంలో ఒక మహిళతో వీడియో కాల్ మాట్లాడుతున్నాడు. ఆమె నా సోదరుడిని బ్లాక్మెయిల్ చేసింది’ అని బాధితుడి సోదరుడు ఆరోపించారు. యూపీలోని ఫిలిబిత్ అభిషేక్ స్వస్ధలమని పోలీసులు తెలిపారు. సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో బాధితుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు చేయడంతో సెక్షన్ 306 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుందని సివిల్ లైన్స్ ఎస్హెచ్ఓ రవీంద్ర కుమార్ దుబే తెలిపారు. -
జర్నలిస్టు ఉరి.. మృతిపై అనుమానాలు
అమ్రోహ/లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ఓ జర్నలిస్టు మృతి కలకలం రేపుతోంది. ఓ జాతీయ హిందీ దినపత్రికలో విలేకరిగా పనిచేసే రాజేష్ అగర్వాల్ చెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడు. ఈ ఘటన అమ్రోహ జిల్లాలో సోమవారం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, రాజేష్‌ది ఆత్మహత్య కాదని అతని కుటుంబ సభ్యులు అంటున్నారు. ప్రైవేటు స్కూల్ మేనేజర్ అయిన శ్యామ్ గిరి రాజేష్‌ని చంపి హత్యగా చిత్రీకరించారని ఆరోపిస్తున్నారు. శ్యామ్‌కు రాజేష్ లక్ష రూపాయలు బాకీ ఉన్నాడని.. ఆ నేపథ్యంలోనో ఈ ఘటన జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన రాజేష్ చివరగా శ్యామ్‌తో కనిపించినట్టు స్థానికులు చెప్పడం గమనార్హం. ఇదిలా ఉండగా.. మృతుని వద్ద నుంచి సూసైడ్ నోట్ లభించిందని పోలీసులు వెల్లడించారు. రాజేష్‌ది ఆత్మహత్యగా భావిస్తున్నామని తెలిపారు. అయితే, మృతుని కుటుంబ సభ్యుల ఆరోపణలను కూడా పరిగణలోకి తీసుకుని దర్యాప్తు చేపడతామని పోలీస్ అధికారి అజయ్‌కుమార్ అన్నారు. పోస్టుమార్టం రిపోర్టు అనంతరం కేసులో పురోగతి ఉంటుందని వెల్లడించారు. -
లేని ఇంటికి గృహ ప్రవేశం..
చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ) : సొంత ఇల్లే తన కల అని చెప్పాడు... దాచుకున్న డబ్బులకు తోడు అమ్మ.. అమ్మమ్మ కూడబెట్టిన డబ్బులు తీసుకుని తుళ్లూరులోని టౌన్ షిప్లో ఇల్లు కడుతున్నానని అం దరితో గొప్పగా చెప్పాడు.. గృహ ప్రవేశం అంటూ బంధువులకు, స్నేహితులకు ఆహ్వాన పత్రికలు అందచేశాడు... కార్యక్రమానికి విచ్చేసిన వారికి అన్ని మర్యాదలు చేశాడు.. హోటల్లో రూమ్‌లు, తుళ్లూరుకు వెళ్లి వచ్చేందుకు కార్లు ఏర్పాటు చేశాడు... ముహూర్త సమయం సమీపిస్తుండటంతో ముందు మీరు వెళ్లండి.. అని చెప్పి హోటల్ నుంచి ఇంటికి వచ్చి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ ఘటన కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధి లోని ఆంజనేయ వాగు సెంటర్లో చోటు చేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌కు చెందిన పెద్ది నాగమణి, కోటేశ్వరరావు భార్యభర్తలు. వీరికి ఇద్దరు సం తానం. నాగమణి రెండేళ్ల కిందట పెద్ద కుమారుడు పెద్ది రవిని తీసుకుని విజయవాడ కొత్తపేట ఆంజ నేయ సెంటర్‌కు వచ్చేశారు. పెద్ది రవి మహాత్మాగాంధీ రోడ్డులోని బాలాజీ అల్యూమినియం సెంటర్లో పని చేస్తుంటాడు. ఖరగ్‌పూర్‌లోనే భర్త కోటేశ్వరరావు, చిన్న కుమారుడు తేజేశ్వరరావు కిరాణా వ్యాపారం చేస్తుంటారు. పెద్ది రవి కొంత కాలంగా అమరావతి రాజధాని తుళ్లూరులోని శ్రీ సాయి నికేతన్ టౌన్ షిప్లో ఇంటిని కొనుగోలు చేశానని తల్లి, అమ్మమ్మలను నమ్మించాడు. ఇందుకోసం తల్లి వద్ద నుంచి లక్షలలో డబ్బులు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంటి నిర్మాణం పూర్తయిందని చెప్పి శుక్రవారం రాత్రి 1–05 గంటలకు గృహ నిర్మాణం అంటూ ఆహ్వాన పత్రికలు వేయించాడు. శనివారం సత్యనారాయణస్వామి వ్రతం కూడా ఉందని చెప్పాడు. స్నేహితులతో పాటు ఖరగ్‌పూర్‌లోని తండ్రి, సోదరుడికి ఫోన్ చేసి చెప్పాడు. తమ్ముడు తేజేశ్వరరావు పది రోజుల కిందట విజయవాడ రాగా, బంధువులు గురువారం ఉదయానికి చేరుకున్నారు. వీరందరికీ ఓ పెద్ద హోటల్లో రూమ్‌లు సైతం బుక్ చేశాడు. రాత్రి 10 గంటల సమయంలో తల్లిదండ్రులను, బంధువులను కార్లలో తుళ్లూరుకు బయలుదేరి వెళ్దామని చెప్పాడు. అందరూ సిద్ధమైన తర్వాత మీరు ముందు తుళ్లూరులోని ఇంటి వద్దకు వెళ్లమని అడ్రస్సు చెప్పాడు. తనకు ఇంట్లో చిన్న పని ఉందని అది చూసుకుని వచ్చేస్తానని నమ్మకంగా చెప్పాడు. దీంతో తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులందరూ తుళ్లూరు వెళ్లారు. టౌన్షిప్ గురించి ఆరా తీయగా అసలు అక్కడ ఆ పేరుతో టౌన్ షిప్ లేదని, ఇది తప్పుడు అడ్రస్ అని తెలిసింది. అయితే ఆహ్వాన పత్రికలో మాత్రం తుళ్లూరు, కృష్ణా జిల్లా అని ముద్రించడంతో ముందుగానే ప్రణాళిక ప్రకారం ఇది జరిగిందని బంధువులు పేర్కొంటున్నారు. ఇంతలో రవికి ఫోన్ చేయగా అవతలి వైపు నుంచి సమాధానం రాకపోవడంతో తిరిగి వాగు సెంటర్లోని ఇంటికి వచ్చేశారు. ఇంటికి వచ్చేసరికి తలుపులు గడియ వేసి ఉండటంతో ఉత్తరం వైపు ఉన్న సందులో నుంచి లోపలకు చూడగా వంట గదిలో హుక్కు చీరతో ఉరికి వేలాడుతూ పెద్ది రవి కనిపించాడు. దీంతో వెంటనే తలుపులు తెరిచి రవిని ఉరి నుంచి కిందకు దింపగా అప్పటికే ప్రాణాలను కోల్పోయాడు. వెంటనే ఘటనపై పోలీసులకు ఫిర్యాదు ఇవ్వగా వారు వచ్చి మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డబ్బులు ఏం చేసినట్లు.. అయితే పెద్ది రవి చాలా మంచివాడని స్థానికులు చెబుతున్నారు. కొంత కాలంగా అర్ధరాత్రి వరకు ఇంటి ముందు కూర్చుని ఫోన్లో మాట్లాడటం, లక్షలాది రూపాయలు ఏం చేశాడనే దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తల్లిదండ్రులతో పాటు తెలిసిన వారి వద్ద కూడా ఇంటి నిర్మాణం కోసం అప్పులు చేశాడని ప్రచారం జరుగుతోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. -
పరీక్షల్లో..ఫెయిలయ్యానని..
పత్తికొండ రూరల్ : పరీక్షల్లో ఫెయిల్ కావడంతో ఓ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల మేరకు.. అటికెలగుండు గ్రామానికి చెందిన మేడికుందు హంపయ్య, ఆదిలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. వీరిలో పెద్దవాడైన రాజశేఖర్(16) పత్తికొండలోని ప్రతిభ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం(బైపీసీ) చదువుతున్నాడు. ఇటీవల వెలువడిన ఫలితాల్లో ఐదు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈక్రమంలో మంగళవారం గ్రామ శివార్లలోని సిద్దరామప్ప పొలంలోని వేపచెట్టుకు తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన చుట్టుపక్కల రైతులు విషయాన్ని కుటుంబీకులకు సమాచారం అందించారు. విగతజీవిగా మారిన కుమారుడిని చూసి తల్లిదండ్రుల బోరన విలపించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. -
అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య
ములకలచెరువు(చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా ములకలచెరువు పట్టణానికి చెందిన ఆర్. మల్లికార్జున(48) అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ శనివారం ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కూలిపని చేసుకుని జీవించే మల్లికార్జున నాలుగు సంవత్సరాలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడేవాడు. ఎక్కడ చూపించినా జబ్బు నయం కాకపోవడంతో తీవ్ర వేదనకు గురైన ఆయన శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు.