మృతి చెందిన రాజశేఖర్
పత్తికొండ రూరల్ : పరీక్షల్లో ఫెయిల్ కావడంతో ఓ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల మేరకు.. అటికెలగుండు గ్రామానికి చెందిన మేడికుందు హంపయ్య, ఆదిలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. వీరిలో పెద్దవాడైన రాజశేఖర్(16) పత్తికొండలోని ప్రతిభ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం(బైపీసీ) చదువుతున్నాడు. ఇటీవల వెలువడిన ఫలితాల్లో ఐదు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈక్రమంలో మంగళవారం గ్రామ శివార్లలోని సిద్దరామప్ప పొలంలోని వేపచెట్టుకు తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
గమనించిన చుట్టుపక్కల రైతులు విషయాన్ని కుటుంబీకులకు సమాచారం అందించారు. విగతజీవిగా మారిన కుమారుడిని చూసి తల్లిదండ్రుల బోరన విలపించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment