ఘటనాస్థలం
అమ్రోహ/లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ఓ జర్నలిస్టు మృతి కలకలం రేపుతోంది. ఓ జాతీయ హిందీ దినపత్రికలో విలేకరిగా పనిచేసే రాజేష్ అగర్వాల్ చెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడు. ఈ ఘటన అమ్రోహ జిల్లాలో సోమవారం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, రాజేష్‌ది ఆత్మహత్య కాదని అతని కుటుంబ సభ్యులు అంటున్నారు. ప్రైవేటు స్కూల్ మేనేజర్ అయిన శ్యామ్ గిరి రాజేష్‌ని చంపి హత్యగా చిత్రీకరించారని ఆరోపిస్తున్నారు. శ్యామ్‌కు రాజేష్ లక్ష రూపాయలు బాకీ ఉన్నాడని.. ఆ నేపథ్యంలోనో ఈ ఘటన జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన రాజేష్ చివరగా శ్యామ్‌తో కనిపించినట్టు స్థానికులు చెప్పడం గమనార్హం.
ఇదిలా ఉండగా.. మృతుని వద్ద నుంచి సూసైడ్ నోట్ లభించిందని పోలీసులు వెల్లడించారు. రాజేష్‌ది ఆత్మహత్యగా భావిస్తున్నామని తెలిపారు. అయితే, మృతుని కుటుంబ సభ్యుల ఆరోపణలను కూడా పరిగణలోకి తీసుకుని దర్యాప్తు చేపడతామని పోలీస్ అధికారి అజయ్‌కుమార్ అన్నారు. పోస్టుమార్టం రిపోర్టు అనంతరం కేసులో పురోగతి ఉంటుందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment