తమిళనాడు సీఎం జయలలిత పది రోజుల్లో సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరుకుంటారని మధురై ఆధీనం అరుణగిరినాథర్ పేర్కొన్నారు. శనివారం అపోలో ఆసుపత్రిలో సీఎం జయలలిత ఆరోగ్యంపై విచారించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.జయలలిత ఆరోగ్యంగా ఉన్నారని, సంపూర్ణ ఆరోగ్యంతో మరో పది రోజుల్లో ఇంటికి చేరుకుంటారని చెప్పారు. తమిళ సినీ సంగీత దర్శకుడు శంకర్ గణేషన్ కూడా జయలలిత ఆరోగ్య పరిస్థితిని అపోలో ఆసుపత్రి వర్గాలతో కనుక్కున్నారు. అమ్మ ఆరోగ్యం మెరుగుపడిందని, ఆమె మళ్లీ ప్రజాసేవకు అంకితం కానున్నారని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి ఆనందం వ్యక్తం చేశారు.
Published Sun, Nov 6 2016 7:40 AM | Last Updated on Thu, Mar 21 2024 7:52 PM
Advertisement
Advertisement
Advertisement