సైకిళ్లతో ఎమ్మెల్యే కాకాణి నివాసానికి వచ్చిన గిరిజనులు
వెంకటాచలం: వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిది రాజకీయం వ్యాపారం తప్ప ప్రజాసేవ కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన పలువురు గిరిజనులకు సోమిరెడ్డి గురువారం కండువాలు కప్పి టీడీపీలో చేరినట్లు ప్రకటించారు. వీరిలో సగం కుటుంబాలకుపైగా శుక్రవారం ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి నివాసానికి సైకిళ్లతో చేరుకున్నారు. సైకిళ్లు, వలలు, ఐస్ బాక్సుల పంపిణీ పేరుతో పిలిచి తమకు టీడీపీ కండువాలు కప్పారని, తాము ఆ పార్టీలో చేరలేదని, దివంగత సీఎం వైఎస్సార్ అభిమానులమని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకాణి మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులైన గిరిజన కుటుంబాలను సెకిళ్లు, వలలు, ఐస్‌బాక్సుల పంపిణీ పేరుతో అధికారులతో పిలిపించి టీడీపీ కండువాలు కప్పడంపై మండిపడ్డారు.
ఒక్కో లబ్ధి దారుడి వద్ద రూ.రెండు వేల నుంచి రూ.2500 వరకు వసూలు చేసి సైకిళ్లు, వలలను పంపిణీ చేయడం సిగ్గుచేటని విమర్శించారు. సోమిరెడ్డి వ్యవహార శైలితో జిల్లాలో టీడీపీ భ్రష్టు పడుతోం దన్నారు. అధికారంలో లేనప్పుడు నాయకులు, కార్యకర్తలను అడ్డంపెట్టుకొని బ్లాక్‌మెయిల్ చేయ డం, అధికారంలో ఉంటే అవినీతికి పాల్పడి వసూ ళ్లు చేయడం సోమిరెడ్డికి అలవాటుగా మారిపోయిందని ధ్వజమెత్తారు. అవినీతి సంపాదన, కమీ షన్ల కోసం దేనికైనా సిద్ధపడటం సోమిరెడ్డి నైజ మని ఎద్దేవా చేశారు. ఇప్పటికే సర్వేపల్లిలో నాలుగుసార్లు ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓటమి పాలైన సోమిరెడ్డి వచ్చే ఎన్నికల్లో 50 వేల ఓట్లకు పైగా తేడాతో ఓడిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయని, అయినా ప్రగల్భాలు పలకడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు వద్ద మెప్పుపొందేం దుకు వివిధ పథకాల పేరుతో ప్రజలను తన ఇంటి వద్దకు పిలిపించి టీడీపీ కండువాలు కప్ప డం సోమిరెడ్డి దిగజారుడుతనానికి నిదర్శనమని అభివర్ణించారు. పార్టీ యువజన విభాగ రాష్ట్ర కార్యదర్శి కోడూరు ప్రదీప్‌కుమార్‌రెడ్డి, జెడ్పీటీసీ మందల వెంకటశేషయ్య, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment