పార్వతీపురం,న్యూస్‌లైన్ : ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం లో శుక్రవారం నిర్వహించిన మూడో విడత రచ్చబండ కార్యక్రమం రసాభాసగా మారింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే సవరపు జయమణి మాట్లాడుతుండగా వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కొయ్యాన శ్రీవాణి, పట్టణ పార్టీ కన్వీనర్ ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, తదితరులు అడ్డుతగులుతూ గతంలో అందజేసిన దరఖాస్తుల ను పరిష్కరించకుండా మళ్లీ రచ్చబండ కార్యక్రమం ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేయడానికే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తోందని ఆరోపిస్తూ వేదిక వైపు దూసుకొచ్చారు. దీంతో సీఐ బి. వెంకటరావు ఆధ్వర్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి వైఎస్సార్‌సీపీ నాయకులను అడ్డుకున్నారు.
ఈ సమయంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బొబ్బిలి చిరంజీవులు ఆధ్వర్యంలో పలువురు నాయకులు,వివిధ ప్రజా సంఘాల నాయకులు, ఇతర పార్టీల నాయకు లు కూడా వేదికవైపు దూసుకురావడంతో ఎమ్మెల్యే జయమణి కిందకు వచ్చి వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ విపక్ష నాయకులు రచ్చబండకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు కొయ్యా న శ్రీవాణి, ద్వారపురెడ్డి శ్రీనివాసరావుల తోపాటు 13 మందిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ తంతు ముగిసిన కొద్దిసేపటి కే వర్షం పడడంతో కార్యక్రమాన్ని తూతూమంత్రంగా ముగించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మరిశర్ల తులసి, తహశీల్దార్ ఎం. శ్రీని వాసరావు, మున్సిపల్ కమిషనర్ వీసీహెచ్ అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు.
రచ్చకెక్కిన విబేధాలు
కొంతకాలంగా అధికార కాంగ్రెస్ పార్టీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న విబేధాలు రచ్చబండ కార్యక్రమంలో బయటపడ్డాయి. ఎమ్మెల్యే వర్గీయులు మంత్రి శుత్రుచర్ల వర్గాన్ని పక్కనబెట్టా రు. శత్రుచర్ల ప్రధాన అనుచరుడైన రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ డెరైక్టర్ మజ్జి కృష్ణమోహన్‌ను కార్యక్రమానికి ఆహ్వానించలేదు. ప్రోటోకాల్ ప్రకారమైనా కృష్ణమోహన్ పేరు ను ఆహ్వానపత్రికలో వేయాలన్నది ఆయన వర్గీయుల వాదన. దీనికితోడు మున్సిపల్ మా జీ చైర్‌పర్సన్, కాంగ్రెస్ నాయకురాలు నరసిం హప్రియా థాట్రాజ్ కూడా కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. అలాగే మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ దొడ్డి విజయ్‌కృష్ణ, తదితర కాంగ్రెస్ నాయకులు మాజీ ఫ్లోర్ లీడర్ వారణాశి గున్నై పె చిందులు తొక్కుతూ సభ నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం.
అడిగితే అరెస్టే..
ప్రజలు నిలదీసే అవకాశం ఉందని భావించిన కాంగ్రెస్ నాయకులు, అధికారులు భారీ ఎత్తు న పోలీసులను మోహరించారు. అయి నప్పటి కీ అధికారులు, పాలకులను ప్రశ్నించిన ప్రతి ఒక్కరినీ అరెస్టు చేశారు.
రచ్చబండ రసాభాస
Published Sat, Nov 23 2013 3:30 AM | Last Updated on Sat, Sep 2 2017 12:52 AM
Advertisement
Advertisement