ఇవి మాటల ప్రభుత్వాలు..
రైల్వేకోడూరు రూరల్: ఈ నెల 10న ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జరిగే ధర్నా పోస్టర్లను స్థానిక వైఎస్ అతిథి గృహంలో శుక్రవారం ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, నియోజకవర్గ కన్వీనర్ కొల్లం బ్రహ్మానందరెడ్డితో కలిసి విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యే విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలవి మాటలే తప్ప చేతలు లేవని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర విభజన చేసే సమయంలో కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని చంద్రబాబు గొప్పలు పలికి ఇప్పుడు మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు.
తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తలపెట్టిన ఈ ధర్నాలో అందురూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు మారెళ్ల రాజేశ్వరి, పట్టణ కన్వీనర్ సీహెచ్ రమేష్, జిల్లా మైనార్టీ నాయకులు ఎన్.మస్తాన్, నందాబాలా, నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎం.నాగేంద్ర, క్షత్రియ నాయకులు డి.క్రిష్ణమరాజు, ఎంపీటీసీ రవికుమార్, పార్టీ నాయకులు యానాదిరెడ్డి, రామక్రిష్ణయ్య, ఓబులవారిపల్లె మండల యూత్ కన్వీనర్ జయపాల్‌రెడ్డి, జిల్లా యూత్ స్టీరింగ్ కమిటీ సభ్యులు భరత్ కుమార్‌రెడ్డి, తదితరులు ల్గొన్నారు.